Hijab Ban Row: ఆగని హిజాబ్ వివాదం- హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంలో పిటిషన్
Hijab Ban Row: హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది.
Plea moved in Supreme Court challenging Karnataka HC order dismissing various pleas challenging the ban on Hijab in educational institutes pic.twitter.com/HJv9eHgnR5
— ANI (@ANI) March 15, 2022
కొన్ని నెలలకు ముందు కర్ణాటకలో మొదలైన హిజాబ్ వివాదంపై ఆ రాష్ట్ర హైకోర్టు మంగళవారం సంచలన తీర్పు వెలువరించింది. విద్యాసంస్థల్లో హిజాబ్ వస్త్రధారణపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిషేధాన్ని కోర్టు సమర్థించింది. హిజాబ్ ధరించడంపై నిషేధాన్ని సవాల్ చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది.
మరోవైపు హిజాబ్‌కు వ్యతిరేకంగా కాషాయపు కండువాలు ధరించిన విద్యార్థులు ర్యాలీలు నిర్వహించారు. ఉడుపి కుండాపూర్‌లో కొందరు బాలబాలికలు కాషాయపు కండువాలు ధరించి 'జై శ్రీరామ్' నినాదాలతో ర్యాలీలు చేశారు. దీంతో ఈ వివాదం దేశవ్యాప్త చర్చకు తెరలేపింది.
కోర్టుకు
ఆ తర్వాత ఈ వివాదం కర్ణాటక హైకోర్టు చేరింది. హిజాబ్ ధరించి తాము విద్యాసంస్థలకు హాజరయ్యేలా అనుమతి ఇవ్వాలని ముస్లిం విద్యార్థినులు పిటిషన్ దాఖలు చేశారు. ఆ తర్వాత ఈ పిటిషన్‌ను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేశారు.
హైకోర్టు ఫుల్ బెంచ్ ఫిబ్రవరి 10న హిజాబ్ పిటిషన్‌లపై విచారణను ప్రారంభించింది. రెండు వారాల పాటు వాదనలు విన్న హైకోర్టు ఫిబ్రవరి 25వ తేదీన తీర్పును రిజర్వ్ చేసింది. అంతలో పాఠశాల, కళాశాల క్యాంపస్‌లలో హిజాబ్‌ను నిషేధించాలనే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. అయితే ఎట్టకేలకు కర్ణాటక హైకోర్టు.. హిజాబ్ ధరించడం ఇస్లాం ప్రకారం తప్పనిసరి మతాచారం కాదని మంగళవారం తీర్పు ఇచ్చింది.