Haryana Farmers Protest: రైతులపై లాఠీ ఛార్జి చేయడంలో తప్పు లేదు: హరియాణా సీఎం
హరియాణా కర్నల్ లో నిన్న రైతులపై పోలీసులు లాఠీఛార్జి చేయడంపై ఆ రాష్ట్ర సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ స్పందించారు. ఆ సమయంలో శాంతిభద్రతలు కాపాడటానికి పోలీసులు లాఠీఛార్జి చేయడం సరైన నిర్ణయమేనన్నారు.
హరియాణాలో శనివారం పోలీసులు చేసిన లాఠీఛార్జిలో 10 మంది రైతులకు తీవ్రగాయాలయ్యాయి. అయితే ఈ ఘటనపై హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ స్పందించారు.
పోలీసులు లాఠీఛార్జ్ చేయడాన్ని సీఎం సమర్థించారు. శాంతియుత నిరసనకే తాము అనుమతి ఇచ్చామని, కానీ రైతులు రాళ్లు రువ్వారని, జాతీయ రహదారిని దిగ్బంధించారని ఆయన అన్నారు. ఇందుకోసమే పోలీసులు లాఠీఛార్జి చేసినట్లు తెలిపారు.
కర్నల్ ప్రాంతంలో జరిగింది భాజపా రాష్ట్రస్థాయి సమావేశమని.. దాన్ని అడ్డుకోవాలని రైతులు పిలుపునివ్వడం తగదన్నారు.
పోలీసులకే గాయాలు..
లాఠీఛార్జి ఘటనలో నలుగురు నిరసనకారులకు మాత్రమే గాయలయ్యాయని హరియాణా అడిషనల్ డీజీపీ నవ్ దీప్ సింగ్ అన్నారు. రాళ్లు రువ్వడం వల్ల 10 మంది పోలీసులకు గాయాలైనట్లు తెలిపారు.
కఠిన చర్యలు తీసుకుంటాం..
I hope this video is edited and the DM did not say this… Otherwise, this is unacceptable in democratic India to do to our own citizens. pic.twitter.com/rWRFSD2FRH
— Varun Gandhi (@varungandhi80) August 28, 2021
రైతుల తలలు పగులగొట్టడంటూ పోలీసులకు కర్నాల్ జిల్లా ఉన్నతాధికారి ఆయుష్ సిన్హా సూచనలిస్తున్న వీడియో శనివారం నుంచి విపరీతంగా వైరల్ అయింది. ఈ వీడియోపై హరియాణా డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలా స్పందించారు.
The use of such kind of words by an IAS officer for farmers is condemnable. Definitely, action will be taken against him: Haryana Deputy CM Dushyant Chautala on viral video purportedly showing Karnal SDM Ayush Sinha asking policemen to crack the heads of protesting farmers https://t.co/DbPZkXQRgS pic.twitter.com/x9Z4Y1RlgZ
— ANI (@ANI) August 29, 2021