X
Super 12 - Match 17 - 25 Oct 2021, Mon up next
AFG
vs
SCO
19:30 IST - Sharjah Cricket Stadium, Sharjah
Super 12 - Match 18 - 26 Oct 2021, Tue up next
SA
vs
WI
15:30 IST - Dubai International Cricket Stadium, Dubai

PM Narendra Modi: రాజస్థాన్‌లో నాలుగు వైద్య కళాశాలలకు మోదీ శంకుస్థాపన

రాజస్థాన్‌ జైపుర్‌లో పెట్రోకెమికల్స్ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్‌ను ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు.

FOLLOW US: 

రాజస్థాన్‌లో నాలుగు వైద్య కళాశాలలకు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. బన్​స్వారా, సిరోహి, హనుమాన్​గఢ్​, దౌసా జిల్లాల్లో ఈ కళాశాలలు నిర్మించనున్నారు. జైపుర్ సితాపురాలో పెట్రోకెమికల్స్ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్‌ను కూడా ప్రారంభించారు. దేశ ఆరోగ్య రంగంలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు నూతన జాతీయ ఆరోగ్య విధానం కోసం కృషి చేస్తున్నామని ఈ సందర్భంగా మోదీ అన్నారు.

" ప్రస్తుత పరిస్థితుల్లో తమ బలాన్ని, స్వశక్తిని పెంచుకోవాలని భారత్​ నిర్ణయించింది. స్వచ్ఛ భారత్​ అభియాన్​ నుంచి ఆయుష్మాన్​ భారత్,  ఇప్పుడు ఆయుష్మాన్​ భారత్​ డిజిటల్​ మిషన్​ నూతన జాతీయ ఆరోగ్య విధానంలో భాగమే. ఒక్క క్లిక్​ దూరంలోనే మంచి ఆసుపత్రులు, ల్యాబ్​లు ఎక్కడున్నాయో ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ద్వారా తెలుస్తుంది. "
-                                 ప్రధాని నరేంద్ర మోదీ

ఈ శంకుస్థాపన కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయా, రాజస్థాన్​ సీఎం అశోక్​ గహ్లోత్​, లోక్​సభ స్పీకర్​ ఓం బిర్లా వర్చువల్​గా హాజరయ్యారు.

డిజిటల్ హెల్త్ ఐడీలు..

ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్‌లో భాగంగా ప్రతి భారతీయుడికీ హెల్త్ ఐడీ  కేటాయిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆయుష్మాన్ భారత్ ప్రారంభించి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టినట్లు వెల్లడించారు. 

ఆరు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇప్పటికే పైలట్​ ప్రాజెక్టుగా పీఎండీహెచ్​ఎం అమలవుతోంది. టెక్నాలజీ ఆధారంగా దేశ ప్రజలందరికీ వైద్య సేవలు అందించడం కోసం కేంద్రం ఈ కార్యక్రమం చేపడుతోంది.

ఎలా పనిచేస్తుంది?  • ఈ పథకంలో భాగంగా దేశ ప్రజలకు హెల్త్‌ కార్డ్‌లతో పాటు హెల్త్‌ ఐడీలను అందించనున్నారు.

  • వీటి ఆధారంగా ప్రజలు తమ ఆరోగ్య సమాచారాన్ని ఆయుష్మాన్‌ భారత్‌ డిజిటల్‌ వెబ్‌సైట్‌లో అప్‌డేట్‌ చేయలి.

  • ఎవరైనా అనారోగ్య సమస్యలతో ఆస్పత్రికి వెళ్లినా, ట్రీట్మెంట్‌ రికార్డ్‌లను పోగొట్టుకున్నా సంబంధిత సమాచారం ఈ వెబ్‌సైట్‌లో భద్రంగా ఉంటుంది.

  • హెల్త్ ఐడీ చెబితే మన ఆరోగ్య వివరాలు మొత్తం తెలుస్తాయి.

Also Read: ISIS Terrorist: కబాబ్ మార్చిన కథ.. ఏకంగా ఐసిస్ ఉగ్రవాదినే పట్టించేసింది!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: PM Modi Prime Minister Narendra Modi Rajasthan ashok gehlot Rajasthan Medical Colleges

సంబంధిత కథనాలు

AP TS Corona Updates: ఏపీలో కొత్తగా 400 కరోనా కేసులు, 4 మరణాలు... తెలంగాణలో 135  కేసులు

AP TS Corona Updates: ఏపీలో కొత్తగా 400 కరోనా కేసులు, 4 మరణాలు... తెలంగాణలో 135  కేసులు

Huzurabad By Poll: హుజూరాబాద్ లో జోరుగా ప్రచారం... సానుభూతి వర్సెస్ అభివృద్ధి.. గెలుపుకోసం ఎత్తుకుపై ఎత్తులు...!

Huzurabad By Poll: హుజూరాబాద్ లో జోరుగా ప్రచారం... సానుభూతి వర్సెస్ అభివృద్ధి.. గెలుపుకోసం ఎత్తుకుపై ఎత్తులు...!

Breaking News Live Updates: ఏపీలోనూ టీఆర్ఎస్ పెట్టాలంటున్నారు.. కర్ణాటక, మహారాష్ట్ర నుంచి ఎన్నో విజ్ఞప్తులు: కేసీఆర్

Breaking News Live Updates: ఏపీలోనూ టీఆర్ఎస్ పెట్టాలంటున్నారు.. కర్ణాటక, మహారాష్ట్ర నుంచి ఎన్నో విజ్ఞప్తులు: కేసీఆర్

Study: కరోనా వ్యాక్సిన్ ఇతర వ్యాధుల మరణాల రేటును కూడా ప్రభావితం చేస్తుందా?

Study: కరోనా వ్యాక్సిన్ ఇతర వ్యాధుల మరణాల రేటును కూడా ప్రభావితం చేస్తుందా?

Chittoor: భార్య గొంతు కోసేసిన భర్త.. కాపురానికి రాలేదనే ఆగ్రహంతో ఘాతుకం

Chittoor: భార్య గొంతు కోసేసిన భర్త.. కాపురానికి రాలేదనే ఆగ్రహంతో ఘాతుకం
SHOPPING
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

ICC T20 WC 2021, IND vs PAK: పాక్‌ విజయానికి 'పంచ సూత్రాలు'.. కోహ్లీసేన పరాభవానికి కారణాలు! మిస్టేక్ అయింది ఇక్కడే..!

ICC T20 WC 2021, IND vs PAK: పాక్‌ విజయానికి 'పంచ సూత్రాలు'.. కోహ్లీసేన పరాభవానికి కారణాలు! మిస్టేక్ అయింది ఇక్కడే..!

Actor Rajababu Passed Away: టాలీవుడ్ లో విషాదం.. సినీ నటుడు రాజబాబు కన్నుమూత

Actor Rajababu Passed Away: టాలీవుడ్ లో విషాదం.. సినీ నటుడు రాజబాబు కన్నుమూత

Virat kohli Press Conference: రోహిత్‌ను తప్పించి ఇషాన్‌కు చోటిస్తారా? మీడియా ప్రశ్నకు విరాట్‌ స్టన్‌..! ఎలా జవాబిచ్చాడో చూస్తారా!!

Virat kohli Press Conference: రోహిత్‌ను తప్పించి ఇషాన్‌కు చోటిస్తారా? మీడియా ప్రశ్నకు విరాట్‌ స్టన్‌..! ఎలా జవాబిచ్చాడో చూస్తారా!!

Honey Trap: న్యూడ్ కాల్స్ చేస్తే 25 వేల జీతం.. అలా చాట్ చేస్తే 15 వేలు.. ఆ జంట దందా బయటపడిందిలా 

Honey Trap: న్యూడ్ కాల్స్ చేస్తే 25 వేల జీతం.. అలా చాట్ చేస్తే 15 వేలు.. ఆ జంట దందా బయటపడిందిలా