Karnataka CM Race: రాహుల్‌తో సిద్దరామయ్య, డీకే శివకుమార్ వరుస భేటీలు - సోనియా గాంధీ ఇంట్లో మంతనాలు
Karnataka CM Race: సిద్దరామయ్యపై డీకే శివకుమార్ నెగటివ్ ఫీడ్‌బ్యాక్ ఇచ్చినట్టు సమాచారం.
Karnataka CM Race:
ఆయన వల్లే..
కర్ణాటక సీఎం పదవిపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. డీకే శివకుమార్, సిద్దరామయ్యల్లో ఎవరికి వారు ఆ కుర్చీ కోసం ఆరాటపడుతున్నారు. హైకమాండ్ వరుస భేటీలతో ఈ సమస్యను తేల్చే పనిలో పడింది. ఈక్రమంలోనే...డీకే శివకుమార్ ఖర్గేతో సమావేశమయ్యారు. ఈ మీటింగ్‌లో... శివకుమార్ సిద్దరామయ్యకు వ్యతిరేకంగా మాట్లాడినట్టు సమాచారం. అంతే కాదు. సిద్దరామయ్యపై ఓ పెద్ద రిపోర్ట్ తయారు చేసి మరీ ఇచ్చినట్టు తెలుస్తోంది. 135 మంది ఎమ్మెల్యేలను తానే గెలిపించినట్టు ఇప్పటికే స్పష్టం చేశారు శివకుమార్. అందుకే...తనకే ముఖ్యమంత్రి పదవి దక్కాలని పట్టుపడుతున్నట్టు తెలుస్తోంది. గతంలో సిద్దరామయ్య చేసిన తప్పులే కాంగ్రెస్ పతనానికి కారణమయ్యాయని ఆరోపించినట్టు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఆయన వల్లే 2019 ఎన్నికల్లోనూ అనుకూల ఫలితాలు రాలేదని అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. 2020లో ప్రభుత్వం కూలిపోవడానికీ కారణం సిద్దరామయ్యే అని శివకుమార్ ఆరోపించినట్టు తెలుస్తోంది.
ఇప్పటి వరకూ ఏం జరిగింది..?
డీకే శివకుమార్ ఈ నెల 15వ తేదీనే ఢిల్లీకి వెళ్లాల్సి ఉంది. కానీ...కొన్ని కారణాల వల్ల ఆయన ఆ రోజు వెళ్లలేదు. మరుసటి రోజుఢిల్లీ వెళ్లిన శివకుమార్...ఖర్గేతో స్పెషల్‌గా మీట్ అయ్యారు. దాదాపు అరగంట పాటు ఇద్దరూ చర్చించారు. ఈ సమయంలోనే శివకుమార్...తాను ముఖ్యమంత్రి అవ్వాలని ఆసక్తి చూపుతున్నట్టు చెప్పారు. శివకుమార్ అలా వెళ్లిపోగానే...సిద్దరామయ్య ఖర్గే ఇంటికి వచ్చారు. ఆ తరవాత సిద్దరామయ్య కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌తోనూ భేటీ అయ్యారు. అంతకు ముందు రాహుల్ గాంధీ...ఖర్గే నివాసానికి వెళ్లారు. దాదాపు గంటన్నర పాటు చర్చించారు. ప్రభుత్వ ఏర్పాటు, సీఎం పేరు ఖరారు అంశాలపై డిస్కస్ చేశారు. మళ్లీ ఇవాళ కూడా వరుస భేటీలు జరిగాయి. ముందుగా సిద్దరామయ్య సోనియా నివాసానికి వచ్చారు. రాహుల్‌తో సమావేశమయ్యారు. ఆ తరవాత డీకే శివకుమార్ వచ్చి రాహుల్‌ని కలిశారు. వీళ్లిద్దరితో పాటు సీఎం రేసులో ఉన్న జీ పరమేశ్వర కూడా స్పందించారు. హైకమాండ్ ఆదేశిస్తే...ఆ కుర్చీలో కూర్చునేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. అయితే..ఫైనల్‌గా సోనియా గాంధీని కలిశాకే నిర్ణయం ప్రకటించే అవకాశాలున్నాయి. అప్పటి వరకూ ఈ సస్పెన్స్‌కి తెరపడేలా లేదు. ఇదిగో అప్పుడు ఇప్పుడు అంటూ కొందరు కాంగ్రెస్ నేతలు చెబుతున్నప్పటికీ...ఫైనల్ డిసిషన్ వచ్చేంత వరకూ ఉత్కంఠ తప్పేలా లేదు.
చివరి ఎన్నికలు అని చెప్పిన సిద్ధరామయ్య గతంలోనే సీఎంగా సేవలు అందించారు. అందులోనూ ఆయన జేడీఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన నేత. మరోవైపు కాంగ్రెస్ పార్టీతోనే మొత్తం పొలిటికల్ కెరీర్ కొనసాగించిన డీకే శివకుమార్ తనకు ఎలాగైన సీఎం పదవి వస్తుందని ధీమాగా ఉన్నారు. ఎన్నికల్లో తన కష్టం గుర్తించి అధిష్టానం తనకు ఛాన్స్ ఇస్తుందని భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని గెలిపిస్తానని సోనియాకు మాటిచ్చాను, చెప్పినట్లుగానే గెలిపించి చూపించానంటున్నారు డీకే. ఇక అధిష్టానం తనకు అనుకూల నిర్ణయం తీసుకుంటుందని కొండంత ఆశగా ఉన్నారు.సీఎం పదవి ఒక్కరికి ఇవ్వాలా, లేక చెరో రెండున్నరేళ్లతో మధ్యే మార్గంగా కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందా అనేది ఆసక్తికరంగా మారింది. అయితే చెరో రెండున్నరేళ్లు ఇచ్చినా, మొదట తనకే ఇవ్వాలంటూ సిద్ధరామయ్య, శివకుమార్ పార్టీ హైకమాండ్ ను కోరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Also Read: Karnataka Election 2023: అప్పుడు ప్రభుత్వం కూలడానికి సిద్దరామయ్యే కారణం, బీజేపీ నేత సంచలన ఆరోపణలు