అన్వేషించండి

Supreme Court: కొలీజియం సిఫార్సులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. కొత్తగా 9 మంది జడ్జీలు

సుప్రీం కోర్టులో కొత్త జడ్జీల నియామకానికి కొలీజియం చేసిన సిఫార్సును కేంద్రం ఓకే చేసింది. మొత్తం 9 మంది త్వరలోనే సుప్రీం న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో కొత్త జడ్జీల నియామకానికి సంబంధించి కొలీజియం చేసిన సిఫార్సుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం ఇటీవల 9 మంది పేర్ల జాబితాను ప్రభుత్వానికి పంపింది. ఈ పేర్లను పరిశీలించిన కేంద్రం తాజాగా వారి నియామకానికి అనుమతినిచ్చింది. 

ఈ 9 మంది పేర్లను రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌కు పంపింది. ఆయన నుంచి అధికారిక ఆమోదం లభించిన వెంటనే వీరంతా సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. వీరితో కలిపితే సుప్రీం కోర్టు న్యాయమూర్తుల సంఖ్య 33కు చేరనుంది. సాధారణంగా 34 మంది జడ్డీలు ఉండాలి. ఒక స్థానం ఖాళీగా ఉంది. సుప్రీంకోర్టు చరిత్రలో ఒకేసారి తొమ్మిది మంది న్యాయమూర్తులను, అందులోనూ ముగ్గురు మహిళా న్యాయమూర్తులను నియమించడం ఇదే తొలిసారి.

ఎవరెవరున్నారు?

సుప్రీంకోర్టు కొలీజియం ప్రభుత్వానికి సిఫార్సు చేసిన పేర్లలో ముగ్గురు మహిళా న్యాయమూర్తులు కూడా ఉన్నారు. వీరిలో కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీవీ నాగరత్న ఒకరు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయ్యే అవకాశాలు ఆమెకు ఉన్నాయి. అదే జరిగితే భారత న్యాయ చరిత్రలో చీఫ్ జస్టిస్ అయిన తొలి మహిళగా జస్టిస్ నాగరత్న రికార్డులకెక్కుతారు.

హైకోర్టు చీఫ్ జస్టిస్ లు..

  • జస్టిస్ విక్రమ్ నాథ్ (గుజరాత్)
  • జస్టిస్ అభయ్ శ్రీనివాస్ ఓకా (కర్ణాటక)
  • జస్టిస్ హిమా కోహ్లీ (తెలంగాణ)
  • జస్టిస్ జేకే మహేశ్వరి (సిక్కిం)

హైకోర్టు జడ్జీలు..

  1. జస్టిస్ బీవీ నాగరత్న (కర్ణాటక)
  2. జస్టిస్ ఎమ్ఎమ్ సుందరేశ్ (మద్రాస్)
  3. సీటీ రవి కుమార్ (కేరళ)
  4. బేలా ఎమ్ త్రివేది (గుజరాత్)
  5. పీఎస్ నరసింహ (సీనియర్ అడ్వకేట్)

సోమవారమే ప్రమాణస్వీకారం..

రాష్ట్రపతి ఆమోదం తెలిపి నియామక ఉత్తర్వులు జారీచేస్తే వచ్చే సోమవారం కొత్త న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేపట్టే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు కొలీజియం ఈనెల 17న సమావేశం కాగా.. 18వ తేదీన న్యాయమూర్తి జస్టిస్‌ నవీన్‌ సిన్హా పదవీ విరమణ చేశారు. ఫలితంగా ఆ ఒక్క ఖాళీకి పేరును సిఫార్సు చేయలేకపోయింది.

ముగ్గురు కొత్త మహిళా న్యాయమూర్తుల రాకతో సుప్రీంకోర్టులో మొత్తం మహిళా న్యాయమూర్తుల సంఖ్య నాలుగుకుచేరుతుంది. 

Also Read: Nityananda Kailasa : నిత్యానంద "కైలాస"కు దగ్గరి దారి తెలిసిపోయింది..! ఇక పోలీసులు వెళ్తారా..?

టాప్ హెడ్ లైన్స్

CWG 2026 Cricket Drop: నేటి నుంచి గ్లాస్గోలో కామన్వెల్త్ గేమ్స్ స్టార్ట్, జాబితా నుంచి క్రికెట్ తో సహా 9 స్పోర్ట్స్ ఔట్.. , అస‌లు కార‌ణం ఏంటంటే..!
నేటి నుంచి గ్లాస్గోలో కామన్వెల్త్ గేమ్స్ స్టార్ట్, జాబితా నుంచి క్రికెట్ తో సహా 9 స్పోర్ట్స్ ఔట్.. , అస‌లు కార‌ణం ఏంటంటే..!
IND Playing XI vs ZIM 1st T20I: జింబాబ్వేతో తొలి టీ20కి ఇండియా ప్లేయింగ్ 11 లో ఇదేనా...! వైభవ్ సూర్యవంశీ కి మ‌రో చాన్స్.. ఫేవ‌రెట్ మైదానంలో అద‌ర‌గొడ‌తాడా..?
జింబాబ్వేతో తొలి టీ20కి ఇండియా ప్లేయింగ్ 11 లో ఇదేనా...! వైభవ్ సూర్యవంశీ కి మ‌రో చాన్స్.. ఫేవ‌రెట్ మైదానంలో అద‌ర‌గొడ‌తాడా..?
PM Modi On NEET Paper Leak: నీట్ పేపర్ లీక్‌పై మోదీ సంచలన నిర్ణయం, దోషులకు వెంటనే శిక్షలు పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు ఆదేశం!
నీట్ పేపర్ లీక్‌పై మోదీ సంచలన నిర్ణయం, దోషులకు వెంటనే శిక్షలు పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు ఆదేశం!
Breaking News: తెలంగాణ డీజీపీ కార్యాలయంలో కానిస్టేబుల్ ఆత్మహత్య
తెలంగాణ డీజీపీ కార్యాలయంలో కానిస్టేబుల్ ఆత్మహత్య

వీడియోలు

NTR Sister In Law Politics Entry Rumours | నందమూరి ఫ్యామిలీ నుంచి మరో పొలిటికల్ ఎంట్రీ?
How Kohli’s Advice Changed PV Sindhu Career | సింధు విజయం వెనుక కోహ్లీ సీక్రెట్ సలహా
Sanju Samson vs Rohit Sharma | రోహిత్ కు సారీ చెప్పిన సంజూ శాంస‌న్
Telugu Serial Actor Debjani Modak Biography | ఎన్నెన్నో జన్మల బంధం' వేద అన్‌సీన్ లైఫ్
Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Latest News:  తెలంగాణ యువకుడి సంచలన ఆరోపణ! తన ఆత్మహత్యకు మోదీనే కారణం అంటూ సూసైడ్ నోట్!
తెలంగాణ యువకుడి సంచలన ఆరోపణ! తన ఆత్మహత్యకు మోదీనే కారణం అంటూ సూసైడ్ నోట్!
Telangana DGP Office Constable Suicide:తెలంగాణ డీజీపీ ఆఫీస్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ ఆత్మహత్య! సూసైడ్‌ నోట్‌లో కీలక విషయాలు!
తెలంగాణ డీజీపీ ఆఫీస్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ ఆత్మహత్య! సూసైడ్‌ నోట్‌లో కీలక విషయాలు!
NEET Controversy Political: నీట్ పోరులో పొలిటికల్ ట్విస్ట్ - విద్యార్థుల ఆందోళన బీజేపీ vs కాంగ్రెస్ పోరుగా ఎలా మారింది?
నీట్ పోరులో పొలిటికల్ ట్విస్ట్ - విద్యార్థుల ఆందోళన బీజేపీ vs కాంగ్రెస్ పోరుగా ఎలా మారింది?
Hyderabad Crime News: హైదరాబాద్‌ సాఫ్ట్వేర్ ఉద్యోగి తేజస్విని మృతిలో కొత్త ట్విస్ట్!రావి చెట్టు కింద సూసైడ్ నోట్!అజయ్ పేరుతో అరుపులు
హైదరాబాద్‌ సాఫ్ట్వేర్ ఉద్యోగి తేజస్విని మృతిలో కొత్త ట్విస్ట్!రావి చెట్టు కింద సూసైడ్ నోట్!అజయ్ పేరుతో అరుపులు
Raw NTR Shot Down: రా ఎన్టీఆర్‌ పేరుతో చేపట్టే కార్యక్రమాలన్నీ షట్‌డౌన్- నిర్వాహకుడి ప్రకటన! జూనియర్‌ కోప్పడ్డాడా! 
రా ఎన్టీఆర్‌ పేరుతో చేపట్టే కార్యక్రమాలన్నీ షట్‌డౌన్- నిర్వాహకుడి ప్రకటన! జూనియర్‌ కోప్పడ్డాడా! 
GHMC Elections Stay: గ్రేటర్ ఎన్నికల నిర్వహణ కాంగ్రెస్‌కు ఇష్టం లేదా ? - న్యాయపరమైన చిక్కుల్లో పడేలా ఎందుకు చేస్తున్నారు?
గ్రేటర్ ఎన్నికల నిర్వహణ కాంగ్రెస్‌కు ఇష్టం లేదా ? - న్యాయపరమైన చిక్కుల్లో పడేలా ఎందుకు చేస్తున్నారు?
YS Jagan Political Strategy: ఏపీలో సైలెంట్ రాజకీయం - నీట్ పోరులో ప్రజల కోసం పోరాడే చాన్స్ - జగన్ వదిలేసుకుంటున్నారా?
ఏపీలో సైలెంట్ రాజకీయం - నీట్ పోరులో ప్రజల కోసం పోరాడే చాన్స్ - జగన్ వదిలేసుకుంటున్నారా?
US Iran War: వెనక్కి తగ్గని అమెరికా; 12వ రోజు కూడా దాడులు కొనసాగింపు, కంటికి కన్ను ఖాయమంటున్న ఇరాన్ !
వెనక్కి తగ్గని అమెరికా; 12వ రోజు కూడా దాడులు కొనసాగింపు, కంటికి కన్ను ఖాయమంటున్న ఇరాన్ !
Embed widget