By: Ram Manohar | Updated at : 21 Aug 2022 04:53 PM (IST)
దేశీయ అవసరాలకు సరిపడ గోధుమల నిల్వలున్నాయని కేంద్రం వెల్లడించింది.
Wheat Production in India:
సరిపడ నిల్వలున్నాయ్..
దేశీయ అవసరాల కోసం భారత్ గోధుమల్ని దిగుమతి చేసుకోనుందన్న వార్తలపై కేంద్రం స్పందించింది. అలాంటిదేమీ లేదని స్పష్టం చేసింది. ఇతర దేశాల నుంచి గోధుమల్ని దిగుమతి చేసుకోవటం లేదని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ వెల్లడించింది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) వద్ద సరిపడా నిల్వలున్నాయని, ప్రజా పంపిణీలో ఎలాంటి సమస్యలు రావని తెలిపింది. దేశీయ అవసరాలకు ఇబ్బంది తలెత్తదని పేర్కొంది. ట్విటర్ వేదికగా ఈ విషయం స్పష్టం చేసింది. "గోధుమల్ని దిగుమతి చేసుకునే ఆలోచన లేదు.
దేశీయ అవసరాలకు సరిపడ నిల్వలున్నాయి" అని ట్వీట్ చేసింది. ఈ ఏడాది రబీ పంటకు ముందు విపరీతమైన వేడి గాలులు వీచాయి. ఆ సమయంలో గోధుమ పంట దిగుబడిపై ప్రభావం పడింది. 2021-22 మధ్య కాలంలో గోధుమ దిగుబడి 106.84 మిలియన్ టన్నులకు పడిపోయింది. నిజానికి ఈ ఏడాది 111 మిలియన్ టన్నుల మేర దిగుబడి వస్తుందని అంచనా వేశారు. కానీ...ఆ స్థాయిలో ఉత్పత్తి జరగలేదు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలయ్యాక..ప్రపంచవ్యాప్తంగా గోధుమల కొరత ఏర్పడింది. రికార్డు స్థాయి ధరలు పలికాయి. వేడిగాలుల కారణంగా దిగుబడి పడిపోవటమూ ధరల పెరుగుదలకు ఓ కారణం. రష్యా, ఉక్రెయిన్ పెద్ద ఎత్తున గోధుమల్ని విదేశాలకు ఎగుమతి చేస్తాయి. అక్కడ సరఫరా వ్యవస్థలు నిలిచిపోవటం వల్ల ఆ దేశాలపై ఆధారపడిన దేశాల్లో తిప్పలు తప్పటం లేదు.
Government says there is no plan to import #wheat into India and country has sufficient stocks to meet domestic requirements. Department of Food and Public Distribution clarifies on reports about possible import of wheat by the government.
— All India Radio News (@airnewsalerts) August 21, 2022
ఎగుమతులపై ఆంక్షలు..
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో టన్ను గోధుమల ధర రూ.2,400-2,500గా పలికింది. అయితే రబీలో పండించిన గోధుమలు మండీల్లోకి వచ్చాక..కాస్త ధరలు తగ్గాయి. అయినా...కనీస మద్దతు ధర కన్నా ఎక్కువే పలుకుతున్నాయి ధరలు. టన్నుకి రూ.2,015 ఎమ్‌ఎస్‌పీ ఉంది. గోధుమల ఎగుమతుల విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాలు...విమర్శలకు తావిచ్చినా...ప్రస్తుతానికైతే కొంత వరకూ ధరలు తగ్గటానికి కారణమయ్యాయి. చాలా రోజుల పాటు గోధుమల ఎగుమతుల్ని పూర్తిగా నిలిపివేసింది కేంద్రం. గోధుమ ఎగుమతులను ఇప్పటికే నిషేధించిన కేంద్ర ప్రభుత్వం, తరవాత గోధుమ పిండి ఎగుమతులపైనా ఆంక్షలు విధించింది. దేశీయంగా ధరల్ని నియంత్రించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు గతంలో ప్రకటించింది. ఈ ఏడాది మే ముందు వరకూ గోధుమలు భారీగానే ఎగుమతి చేసింది భారత్. ఈ కారణంగా దేశీయంగా నిల్వలు నిండుకున్నాయి. వెంటనే అప్రమత్తం కాకపోతే, ఇక్కడా కొరత ఏర్పడుతుందని గ్రహించిన కేంద్రం, వెంటనే ఎగుమతులపై ఆంక్షలు పెట్టింది. తరవాత గోధుమ పిండి విషయంలోనూ ఆ ఆంక్షల్ని కొనసాగించింది. గోధుమ పిండి ఎగుమతిదారులు, ప్రభుత్వ అనుమతి లేకుండా విదేశాలకు సరఫరా చేయటానికి వీల్లేదని కేంద్రం స్పష్టం చేసింది.
దేశీయంగా నిల్వలు గమనించుకుని, నాణ్యతను పరిశీలించి, ప్రభుత్వ అనుమతితోనే ఎగుమతి చేయాలని వెల్లడించింది. అంతర్జాతీయంగా ఉన్న కొరతతో కొందరు కావాలనే బ్లాక్ మార్కెట్‌ను సృష్టించే ప్రమాదముందని అంటోంది కేంద్రం. ఈ కారణంగా నాణ్యత లోపించే అవకాశముందని అభిప్రాయపడింది. భారత్ గోధుమలు ఎగుమతులు నిషేధించిన సమయంలో అంతర్జాతీయంగా ఒక్కసారిగా ధరలు పెరిగిపోయాయి. ఈ నిర్ణయంపై పలు దేశాలు అసహనం వ్యక్తం చేశాయి. భారత్ మాత్రం దేశీయంగా ధరల్ని నియంత్రించేందుకు ఇలాంటి చర్యలు తప్పవని స్పష్టం చేసింది.
Also Read: Congress Meeting: భారత్ జోడో యాత్రకు రెడీ అవుతున్న కాంగ్రెస్, అక్కడి నుంచే మొదలు
BEL Jobs: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో 52 ట్రైనీ, ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు - ఈ అర్హతలుండాలి
Anantapur News: డిసెంబర్ 1 ఎయిడ్స్ డే: హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులకు ఏపీ సర్కార్ పింఛను ఎంతో తెలుసా
Revanth Reddy: రేపు ఈసీ వద్దకు కాంగ్రెస్ నేతలు, కేసీఆర్‌పై ఫిర్యాదు - వాటిని మార్చేస్తున్నారని ఆరోపణలు
AP Telangana Water Issue: కృష్ణాజలాలపై ఢిల్లీలో రేపు కీలక మీటింగ్ - ఏపీ, తెలంగాణ హాజరవ్వాలని ఆదేశాలు
RK Roja: ఏపీలో ‘ఆడుదాం ఆంధ్రా’ - 51 రోజుల్లో 3 లక్షల మ్యాచ్‌లు, కీలక వివరాలు చెప్పిన మంత్రి రోజా
Telangana Elections 2023: 'తెలంగాణలో రీపోలింగ్ కు నో ఛాన్స్' - రాష్ట్రంలో 70.74 శాతం పోలింగ్, గతంతో పోలిస్తే తక్కువేనన్న సీఈవో వికాస్ రాజ్
Salaar Trailer: ‘సలార్’ ట్రైలర్ వచ్చేసింది - ‘కేజీఎఫ్’తో లింకేమిటీ? 3 నిమిషాల్లో కథ మొత్తం చెప్పేశారు - ప్రభాస్ ఎలివేషన్ అదుర్స్
Ambati Rambabu: 'మా వాటాకు మించి ఒక్క నీటి బొట్టునూ వాడుకోం' - సాగర్ నీటి విషయంలో ఏపీ చర్యలు సరైనవేనన్న మంత్రి అంబటి
Hanamkonda News: సీఐ కొడుకు ర్యాష్ డ్రైవింగ్, స్పాట్‌లో మహిళ మృతి, షాకింగ్ వీడియో
/body>