లక్షలాది జీమెయిల్ అకౌంట్స్‌ని డిలీట్ చేయనున్న గూగుల్, కారణమదేనట!
Google Accounts: రెండేళ్లుగా యాక్టివ్‌గా లేని అకౌంట్స్‌ని డిలీట్ చేస్తామని గూగుల్ ప్రకటించింది.
Google Accounts Deletion:
జీమెయిల్ అకౌంట్స్ తొలగింపు..
Google News: గూగుల్ (Google) సంచలన నిర్ణయం తీసుకుంది. లక్షలాది Gmail Accounts ని డిలీట్ చేయనుంది. యాక్టివ్‌గా లేని జీమెయిల్ అకౌంట్‌లను తొలగించే (Gmail Accounts Deletion) ఆలోచనలో ఉంది. వచ్చే నెలలో ఈ ప్రక్రియ చేపట్టే అవకాశాలున్నాయి. రెగ్యులర్‌గా వాడకంలో లోని అకౌంట్స్‌నే తొలగించనుంది. దాదాపు రెండేళ్లుగా యాక్టివ్‌గా లేని వాటినే భారీగా డిలీట్ చేయనుంది. ఓ బ్లాగ్‌పోస్ట్‌లో గూగుల్ ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్ వైస్ ప్రెసిడెంట్ రూత్ క్రిచెలీ ఈ ఏడాది మే నెలలోనే కీలక వ్యాఖ్యలు చేశారు. కంపెనీకి రిస్క్ అనుకున్న వాటిని వీలైనంత వరకూ తొలగించే పనిలోనే ఉన్నామని స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే గూగుల్ తన inactivity policy ని అప్‌డేట్ చేసింది. రెండేళ్లుగా గూగుల్ అకౌంట్స్‌ని వినియోగించని వాళ్లని లిస్టౌట్ చేసి వాటిని తొలగించాలని నిర్ణయించుకుంది. జీమెయిల్, గూగుల్ డాక్స్, గూగుల్ డ్రైవ్, గూగూల్ మీట్, గూగుల్ క్యాలెండర్...ఈ సర్వీస్‌లలో దేన్ని పెద్దగా వాడకపోయినా ఆ అకౌంట్‌ని డిలీట్ చేయనుంది. ఈ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో కూడా వివరించింది గూగుల్.
"కొంత మంది తమ అకౌంట్ లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్‌లు మర్చిపోయారు. మరి కొంత మంది అసలు లాగిన్ అవడం లేదు. అకౌంట్స్‌ని యాక్టివ్‌గా ఉంచడం లేదు. పాత పాస్‌వర్డ్‌లనే వినియోగిస్తున్నారు. టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ సెటప్‌నీ పట్టించుకోవడం లేదు. టూ స్టెప్ వెరిఫికేషన్ లేని అకౌంట్‌లను తొలగిస్తాం. ఈ వెరిఫికేషన్ చేయని అకౌంట్‌లకు ముప్పు ఎక్కువగా ఉంటుంది"
- గూగుల్
అకౌంట్‌ని యాక్టివ్‌గా ఉంచాలంటే..
గూగుల్ బ్లాగ్ పోస్ట్ ప్రకారం గూగుల్ అకౌంట్‌ని యాక్టివ్‌గా ఉంచాలంటే రెండేళ్లకోసారి కచ్చితంగా లాగిన్ అవ్వాలి. అయితే...గూగుల్ డిసెంబర్ నుంచి అకౌంట్‌లను తొలగించే ప్రక్రియను మొదలు పెట్టనుంది. రెండేళ్లుగా అకౌంట్‌లో సైనిన్ (Google Signin) అవ్వకుండా ఉన్న వాళ్లు ఇప్పుడు ఓ సారి లాగిన్ చేస్తే సరిపోతుంది. ఆ అకౌంట్‌ని గూగుల్ డిలీట్ చేయదు. అలాంటి అకౌంట్స్‌ని యాక్టివ్‌గా అకౌంట్స్‌గానే (Google Accounts) పరిగణిస్తుంది. గూగుల్ అకౌంట్‌లోకి లాగిన్ అయినప్పుడు ఈమెయిల్ పంపడం, గూగుల్ డ్రైవ్‌ని వినియోగించడం, గూగుల్ అకౌంట్‌లో నుంచి యూట్యూబ్‌లో వీడియో చూడడం, గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్‌ని డౌన్‌లోడ్ చేయడం, గూగుల్ సెర్చ్ వినియోగించడం లాంటివి చేస్తే ఆ అకౌంట్ యాక్టివ్ అవుతుంది. అయితే..యూట్యూబ్ వీడియోస్‌తో లింక్ ఉన్న Gmail అకౌంట్స్‌ని మాత్రం డిలీట్ చేయమని గూగుల్ వెల్లడించింది.
కొత్త ఫీచర్..
గూగుల్ సరికొత్త ఫీచర్ ను పరిచయం చేయబోతోంది. ఈ ఫీచర్ సాయంతో స్పామ్ మెయిల్స్ కు అడ్డుకట్టపడే అవకాశం ఉంది. ఇకపై రోజుకు 5,000 కంటే ఎక్కువ మెసేజ్ లు పంపే బల్క్ ఇమెయిల్స్ ఇప్పుడు అథెంటికేట్ చేయాల్సి ఉంటుంది. ఈ కారణంగా మెయిల్‌ను ఉపయోగించే వారికి సైబర్ ముప్పు తప్పే అవకాశం ఉంటుంది. మాండేటరీ అథెంటిఫికేషన్ ద్వారా హానికరమైన ఈ మెయిల్స్‌ని 75 శాతం తగ్గించడంలో ఉపయోగపడుతుందని గూగుల్ తెలిపింది. వినియోగదారులకు స్పామ్‌ను సులభంగా నివారించడంలో మరో కీలక మార్పు సహాయపడనున్నట్లు వెల్లడించింది. బల్క్ మెయిల్స్ పంపినవారు ప్రతి ఇమెయిల్‌తో 'అన్ సబ్‌స్క్రైబ్' బటన్‌ను చేర్చాల్సి ఉంటుంది. ఈ బటన్ సదరు స్పామ్ మెయిల్స్ ను కేవలం ఒక క్లిక్‌తో అన్‌సబ్‌స్క్రైబ్ చేయడంలో సహాయపడుతుంది.
Also Read: Delhi Air Pollution: ఢిల్లీలో సరిబేసి నిబంధనకు బ్రేక్, కీలక ప్రకటన చేసిన ప్రభుత్వం