Alphabet CEO Sundar Pichai Salary: సుందర్ పిచాయ్ జీతం రూ. 1800 కోట్లు - కానీ విమర్శలు ! ఎందుకో తెలుసా ?
అల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ కు ఊహించనంత పారితోషికం లభిస్తోంది. వేల మంది ఉద్యోగుల్ని తొలగిస్తూ ఆయన ఇలా పారితోషికం తీసుకోవడం వివాదాస్పదమవుతోంది.
Alphabet CEO Sundar Pichai Salary: గూగుల్ మాతృ సంస్థ అల్ఫా బెట్ సీఈవో సుందర్ పిచాయ్ 2022 సంవత్సరానికి సుమారు 226 మిలియన్ల డాలర్లు పారితోషికాన్ని అందుకోనున్నారు . ఇది భారత కరెన్సీలో 1800 కోట్లు వరకూ ఉంటుంది. ఒక వైపు కంపెనీలో ఉద్యోగాల కోత ఉన్నా.. ఆయన ఆర్జన గణనీయంగా పెరిగడం వివాదాస్పదమవుతోంది. త ఏడాది పిచాయ్ అందుకున్న జీతంలో.. స్టాక్ అవార్డుల ద్వారా 218 మిలియన్ల డాలర్లు వచ్చాయి. సుందర్ పిచాయ్ పారితోషికానికి సంబంధించిన వివరాలను ఆల్ఫాబెట్.. స్టాక్‌మార్కెట్ నియంత్రణ సంస్థకు వెల్లడించింది. సుందర్ అందుకున్న పారితోషికంలో 218 మిలియన్ డాలర్ల విలువైన స్టాక్ అవార్డ్స్ కూడా ఉన్నట్టు తెలిపింది.
కంపెనీలో సగటు ఉద్యోగికి, సీఈవోకు మధ్య జీతంలో భారీ వ్యత్యాసం ఉంది. లే ఆఫ్స్‌ను వ్యతిరేకిస్తూ లండన్‌లో ఉన్న వేలాది మంది గూగుల్ ఉద్యోగులు భారీ వాకౌట్ చేపట్టిన అంశం వైరల్‌గా మారింది. మార్చి నెలలో జూరిచ్‌లో ఉన్న గూగుల్ ఉద్యోగులు సుమారు 200 మంది కూడా నిరసన చేపట్టారు. గతేడాది సుందర్ పిచాయ్ పారితోషికం గూగుల్ సగటు ఉద్యోగి వేతనం కంటే 800 రెట్లు ఎక్కువ. సంస్థలో పొదుపు చర్యల పేరిట ఉద్యోగులను తొలగిస్తున్న తరుణంలో సుందర్ ఈ స్థాయి పారితోషికం తీసుకోవడం ఏమిటని విమర్శలు కూడా వస్తున్నాయి.
స్టాక్ అవార్డు కారణంగా సుందర్ పిచాయ్ జీతం పెరిగిందని కంపెనీ తెలిపింది. ఆయన జీతం 21.8 మిలియన్ డాలర్లు అంటే రూ.1,788 కోట్లు. స్టాక్ అవార్డులను మినహాయిస్తే గత సంవత్సరం అతని జీతం 6.3 మిలియన్ డాలర్లు. అదే సమయంలో గత మూడేళ్లలో ఆయన జీతం 2 మిలియన్ డాలర్లుగా ఉంది. సుందర్ పిచాయ్ కు 2019తో సమానమైన ప్యాకేజీ ఇచ్చారు. ఆ ఏడాది ఆయనకు 28.1 మిలియన్ డాలర్ల ప్యాకేజీ లభించింది. స్టాక్ అవార్డును ప్రతి మూడేళ్లకోసారి ఇస్తారు. సుందర్ పిచాయ్ కృషి, కొత్త ఉత్పత్తుల విడుదలపై ప్రమోషన్ లో భాగంగా గూగుల్ మాతృసంస్థ ఈ పెరిగిన వేతనాన్ని ఇచ్చింది.
మొత్తం 12 వేల మంది ఉద్యోగులను తొలగించబోతున్నట్టు గూగుల్ ఈ ఏడాది జనవరిలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఆర్థికంగా గడ్డు పరిస్థితులు నెలకొన్న తొలగింపులు తప్పవని గూగుల్ అప్పట్లో ప్రకటించింది. ఇది మొత్తం వర్క్ ఫోర్స్ లో ఆరు శాతానికి సమానం. అంటే భారీగా తొలగింపులు చేస్తున్నారు. ఆర్థికంగాఇబ్బందుల్లో ఉంటే సుందర్ పిచాయ్ కు అంత పారితోషికం ఎందుకన్న ప్రశ్నలు కూడా సహజంగానే వస్తున్నాయి.