అన్వేషించండి

Godfather of Sudoku Died: సుడోకు గాడ్‌ఫాదర్‌ మాకీ కాజీ కన్నుమూత.. జపాన్ నిపుణుడికి ప్రముఖుల సంతాపం

తొమ్మిది నిలువు, అడ్డం గడులతో నెంబర్ల పజిల్స్ ఆయన సుడోకు తయారుచేసి పజిల్స్‌లో కొత్త ఒరవడి తీసుకొచ్చిన జపాన్ మాస్టర్ మైండ్ మాకీ కాజీ ఇటీవల కన్నుమూశారు. కంపెనీ తాజాగా ఈ విషయాన్ని వెల్లడించింది.

Sudoku Maki Kaji Passes Away: మెదడుకు మేత అంటూ మనం ఎన్నో పజిల్స్, పద వినోదాలు, ఇతరత్రా వాటితో పాటు ఫేమస్ అయిన పజిల్ సుడోకు.  ఆ పజిల్​ సృష్టికర్త మాకీ కాజీ కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 69 ఏళ్లు కాగా గత కొంతకాలం నుంచి క్యాన్సర్ సమస్యతో సతమతమయ్యారు. సుడోకు గాడ్‌ఫాదర్‌గా మాకా కాజీని వ్యవహరిస్తారు. ప్రపంచంలోని పలు దేశాలలోని చిన్నారులు, విద్యార్థులకు మాకీ కాజీ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.

తొమ్మిది నిలువు, అడ్డం గడులతో నెంబర్ల పజిల్స్ ఆయన సుడోకు తయారుచేసి పజిల్స్‌లో కొత్త ఒరవడి తీసుకొచ్చారు.  యూనివర్సిటీ డ్రాపౌట్ అయినా.. స్వశక్తితో ఎదిగిన వ్యక్తి మాకీ కాజీ. జపాన్‌లో తొలి పజిల్ మ్యాగజైన్‌ను తీసుకొచ్చి కొత్త తరహా పనులకు శ్రీకారం చుట్టారు. అక్టోబర్ 8, 1951న జపాన్‌లోని సపోరోలో మాకీ కాజీ జన్మించారు. ఆయన తండ్రి ఓ టెలికాం కంపెనీలో ఇంజనీర్ కాగా, తల్లి ఓ షాపులో పని చేశారు. చిన్ననాటి నుంచి కాజీకి చదువుపై అంతగా ఆసక్తి ఉండకపోయేది.
Also Read: Gandhi Hospital Case: మిస్టరీగా గాంధీ హాస్పిటల్ గ్యాంగ్ రేప్ వ్యవహారం.. కేసులో మరో ట్విస్ట్

రాజధాని టోక్యోలో స్కూలు, ఉన్నత విద్యాభ్యాసం పూర్తిచేశారు. గ్రాడ్యుయేషన్ మధ్యలోనే మానేసిన మాకీ కాజీ మొదట ఓ ప్రింటింగ్ కంపెనీలో చేరారు. ఆపై ఆయన ఆలోచనలు పూర్తిగా మారిపోయాయి. నెంబర్లపై ఆయనకు ఆసక్తి పెరగింది. ఈ క్రమంలో 1980 దశకంలో పజిల్స్ విధానం మొదలుపెట్టారు. అనతికాలంలో సుడోకు పజిల్స్‌తో మ్యాజిక్ చేశారు.

1984లో నికోలి మ్యాగజైన్​లో కొత్త పజిల్స్‌ను ప్రవేశపెట్టాడు. అయితే కొన్నేళ్లవరకు మాకీ కాజీ కొత్త పజిల్ విధానానికి గుర్తింపు దక్కలేదు. రిటైర్డ్ న్యాయమూర్తి ఈ నెంబర్ పజిల్స్‌‌ను 1997లో చూశారు. దానికి సుడోకు అని నామకరణం చేశారు. జపాన్ భాషలో సుడోకు అంటే ఒక్క అంకె అని అర్థం. పదేళ్ల తరువాత చిన్నారులకు సరళంగా ఉండేలా సుడోకు పజిల్స్ తయారు చేశాడు. తల్లిదండ్రులు సైతం తమ పిల్లలకు ఈ సుడోకు పజిల్స్ ప్రాక్టీస్ చేయించేవారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 100 మిలియన్ల మంది క్రమం తప్పకుండా ఈ సుడోకు పజిల్స్ పూర్తి చేయడానికి ప్రయత్నిస్తుంటారు. 
Also Read: శశి థరూర్‌కు భారీ ఊరట.. సునంద పుష్కర్ హత్య కేసులో కాంగ్రెస్ ఎంపీపై అభియోగాలు కొట్టివేసిన కోర్టు

ఈ పజిల్స్ తక్కువ సమయంలో పూర్తి చేయడానికి కాంపిటీషన్ కూడా ఏర్పాటు చేశారు. పలు దేశాల్లో సుడోకు పజిల్స్‌పై పోటీలు జరిగేవి. ఆన్‌లైన్ లో విద్యార్థులు వీటిని ప్రాక్టీస్ చేస్తూ తమ మైండ్ పవర్‌ను పెంచుకునేవారు. సుడోకు గాడ్‌ఫాదర్ మాకీ కాజీ కొన్నేళ్ల కిందట బైల్ డక్ట్ క్యాన్సర్ బారిన పడ్డారు. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇటీవల కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కంపెనీ నికోలీ సోమవారం నాడు తమ వెబ్‌సైట్‌లో వెల్లడించారు. ఆయన సేవల్ని స్మరించుకున్నారు. 
Also Read: Medak: చికెన్‌ కర్రీతో అన్నం తిని పడుకున్న చిన్నారులు.. పొద్దునే లేచి చూస్తే షాక్! తీవ్ర విషాదం..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jani Master: జానీ మాస్టర్ నేషనల్‌ అవార్డు రద్దు, కమిటీ నిర్ణయంతో మరిన్ని చిక్కులు!
Jani Master: జానీ మాస్టర్ నేషనల్‌ అవార్డు రద్దు, కమిటీ నిర్ణయంతో మరిన్ని చిక్కులు!
AP TET Key: ఏపీటెట్‌ అభ్యర్థులకు అలర్ట్, ప్రాథమిక ఆన్సర్ 'కీ' విడుదల చేసిన విద్యాశాఖ - డైరెక్ట్ లింక్ ఇదే
ఏపీటెట్‌ అభ్యర్థులకు అలర్ట్, ప్రాథమిక ఆన్సర్ 'కీ' విడుదల చేసిన విద్యాశాఖ - డైరెక్ట్ లింక్ ఇదే
Haryana Exit Polls 2024: హర్యానాలో బీజేపీకి బిగ్ షాక్, 10 ఏళ్ల తరువాత అధికారం కాంగ్రెస్ హస్తగతం- ఎగ్జిట్ పోల్ రిజల్ట్
హర్యానాలో బీజేపీకి బిగ్ షాక్, 10 ఏళ్ల తరువాత అధికారం కాంగ్రెస్ హస్తగతం- ఎగ్జిట్ పోల్ రిజల్ట్
Mahindra Thar Roxx Bookings: రికార్డు సృష్టించిన మహీంద్రా థార్ రోక్స్ బుకింగ్స్ - కేవలం గంటలోనే!
రికార్డు సృష్టించిన మహీంద్రా థార్ రోక్స్ బుకింగ్స్ - కేవలం గంటలోనే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పసిపాపకి పాలు పట్టేందుకు అవస్థలు పడుతున్న తల్లిNirmal Man Returned from Kuwait: కువైట్‌లో గోట్‌లైఫ్ బతుకు! ఒక్క పోస్ట్‌తో సేఫ్‌గా సొంతూరికిRajendra Prasad: నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదంManchu Vishnu on Nagarjuna Issue | నాగార్జున, సమంత, నాగచైతన్య వెంటే ఉంటాం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jani Master: జానీ మాస్టర్ నేషనల్‌ అవార్డు రద్దు, కమిటీ నిర్ణయంతో మరిన్ని చిక్కులు!
Jani Master: జానీ మాస్టర్ నేషనల్‌ అవార్డు రద్దు, కమిటీ నిర్ణయంతో మరిన్ని చిక్కులు!
AP TET Key: ఏపీటెట్‌ అభ్యర్థులకు అలర్ట్, ప్రాథమిక ఆన్సర్ 'కీ' విడుదల చేసిన విద్యాశాఖ - డైరెక్ట్ లింక్ ఇదే
ఏపీటెట్‌ అభ్యర్థులకు అలర్ట్, ప్రాథమిక ఆన్సర్ 'కీ' విడుదల చేసిన విద్యాశాఖ - డైరెక్ట్ లింక్ ఇదే
Haryana Exit Polls 2024: హర్యానాలో బీజేపీకి బిగ్ షాక్, 10 ఏళ్ల తరువాత అధికారం కాంగ్రెస్ హస్తగతం- ఎగ్జిట్ పోల్ రిజల్ట్
హర్యానాలో బీజేపీకి బిగ్ షాక్, 10 ఏళ్ల తరువాత అధికారం కాంగ్రెస్ హస్తగతం- ఎగ్జిట్ పోల్ రిజల్ట్
Mahindra Thar Roxx Bookings: రికార్డు సృష్టించిన మహీంద్రా థార్ రోక్స్ బుకింగ్స్ - కేవలం గంటలోనే!
రికార్డు సృష్టించిన మహీంద్రా థార్ రోక్స్ బుకింగ్స్ - కేవలం గంటలోనే!
Tirumala News: తిరుమలలో అన్నదాన కేంద్రంలో అన్నంలో జెర్రి! భక్తులకు టీటీడీ విజ్ఞప్తి ఏంటంటే!
తిరుమలలో అన్నదాన కేంద్రంలో అన్నంలో జెర్రి! భక్తులకు టీటీడీ విజ్ఞప్తి ఏంటంటే!
Jr NTR On Ayudha Pooja Song: ఆయుధ పూజ షూటింగ్‌లో ఎన్టీఆర్‌కు గాయం - ఈసారి సాంగ్ చూస్తే ఆ డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి!
ఆయుధ పూజ షూటింగ్‌లో ఎన్టీఆర్‌కు గాయం - ఈసారి సాంగ్ చూస్తే ఆ డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి!
Jammu Kashmir Exit Polls 2024: జమ్మూకాశ్మీర్‌లో దుమ్ము రేపింది ఎవరు? తొలి బీజేపీ సీఎం ఛాన్స్ ఉందా? ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్
జమ్మూకాశ్మీర్‌లో దుమ్ము రేపింది ఎవరు? తొలి బీజేపీ సీఎం ఛాన్స్ ఉందా? Exit Polls Result
Harsha Sai: 'ఆ యూట్యూబ్ ఛానల్స్‌పై కేసు' - హర్షసాయి బాధితురాలి తరఫు న్యాయవాది స్ట్రాంగ్ వార్నింగ్
'ఆ యూట్యూబ్ ఛానల్స్‌పై కేసు' - హర్షసాయి బాధితురాలి తరఫు న్యాయవాది స్ట్రాంగ్ వార్నింగ్
Embed widget