(Source: Poll of Polls)
Kinjarapu Atchannaidu: మణిపూర్ లో ఉన్న ఏపీ విద్యార్థుల సమస్యలు సీఎం జగన్ కు పట్టవా?: అచ్చెన్నాయుడు
Kinjarapu Atchannaidu: మణిపూర్ లో ఉన్న తెలుగు విద్యార్థుల సమస్యలపై ఏపీ సీఎం జగన్ స్పందించకపోవడం దారుణం అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు అన్నారు.
Kinjarapu Atchannaidu: మణిపూర్ లో ఉన్న తెలుగు విద్యార్థులను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దారుణం అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడు అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్రతిపక్షాలపై అక్రమ కేసులు పెట్టడంపై ఉన్న శ్రద్ధ తెలుగు విద్యార్థుల సమస్యలపై లేదని పేర్కొన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా తెలుగు ప్రజల సంక్షేమం కోసమే కృషి చేస్తుందన్నారు. సీఎం జగన్ కు ఏపీ విద్యార్థుల సమస్యలు పట్టవా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగులు వేయడం కోసం, ప్రచారం కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసే వైసీపీ ప్రభుత్వం, విద్యార్థులను ఆదుకోవడానికి లక్షలు కూడా ఖర్చు చేసేందుకు ముందుకు రాకపోవడం దారుణం అన్నారు. మణిపూర్ లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులను వెంటనే స్వరాష్ట్రానికి తీసుకు రావాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వ అప్పులపై ఫైర్ అయిన అచ్చెన్నాయుడు
దేశ చరిత్రలో మొదటిసారి ఆంధ్ర రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది ప్రజలు వ్యతిరేకిస్తున్న ఏకైక ముఖ్యమంత్రిగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలిచారని అచ్చెన్నాయుడు ఇటీవల వ్యాఖ్యానించారు. ఏపీ చరిత్రలో చంద్రబాబు వరకు పరిపాలించిన సీఎంలు అంతా కలిసి రూ.2.7 లక్షల కోట్లు అప్పులు చేస్తే, సీఎం జగన్ కేవలం నాలుగేళ్లలోనే రూ.10 లక్షల కోట్లు అప్పులు, పన్నుల రూపంలో వసూలు చేసినవి రూ.1.5 లక్షల కోట్లు. ఇందులో జనాల ఖాతాల్లో రూ.1.5 లక్షల కోట్లు వేశారన్నారు ఓకే, మిగతా 9.5 లక్షల కోట్లు ఏం చేశారో చెప్పాలని సీఎం జగన్ ను ప్రశ్నించారు. పుట్టపర్తిలో ఇటీవల టిడిపి జిల్లా సమీక్ష సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన అచ్చెన్నాయుడు వైసీపీ ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు.
జగన్ సీబీఐ ఎంక్వైరీ ఎందుకు వేయలేదు !
వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో జరిగిన ఏ ఒక్క ఎన్నిక కూడా సక్రమంగా జరగలేదని అచ్చెన్నాయుడు ఆరోపించారు. మోసపూరిత వాగ్దానాలతో గద్దెనెక్కిన సీఎం జగన్ ను ఇంటికి పంపేందుకు రాష్ట్రంలో ప్రజలు ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు. అధికారం కోసం సొంత చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డిని పొట్టన పెట్టుకున్న జగన్.. అధికారంలోకి వచ్చిన వెంటనే సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వేయలేదని ఏపీ టీడీపీ అధ్యక్షుడు ప్రశ్నించారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి అడ్డంగా దొరికిపోయారని, త్వరలోనే విచారణలో ఇదే తేలుతుందన్నారు. ఒకవేళ ఈ కేసుతో సంబంధం లేకుంటే తానే సీబీఐ ఎంక్వైరీ వేసి న్యాయం జరిగే వరకు పోరాటం చేసేవాళ్లు అన్నారు.
గంజాయికి కేరాఫ్ అడ్రస్ గా ఏపీ..
గంజాయికి కేరాఫ్ అడ్రస్ గా రాష్ట్రాన్ని మార్చేశారని, యువత గంజాయి మత్తుకు బానిసై జీవితాలను నాశనం చేసుకుంటోందని అచ్చెన్నాయుడు అన్నారు. రాష్ట్రాన్ని ప్రస్తుత పరిస్థితి నుంచి బయటకు తీసుకురావాలంటే.. అభిప్రాయ భేదాలు పక్కనబెట్టి ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. జగన్ బటన్ సీఎం అని ఎద్దేవా చేశారు. సార్వత్రిక ఎన్నికల్లోనూ ఓటర్లు టీడీపీకి ఓట్లు వేసి జగన్ ను ఇంటికి పంపించాలన్నారు. నాలుగేళ్లు గడిచాయి.. కానీ జగన్ నోరు తెరిస్తే బటన్ నొక్కా అంటారు. ప్రజలకు డబ్బులు వేశా అంటానని సీఎం చెబుతున్నారు కానీ, కరెంటు ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు, ఇతర ఛార్జీలు పెంచుతూ ప్రజల రక్తాన్ని పీల్చుతున్న నేత సీఎం జగన్ అంటూ మండిపడ్డారు.