Gandhi Jayanti 2022: శుక్రవారానికి గాంధీజీకి ఓ స్పెషల్ లింక్ ఉందట, ఆ ఘనత సాధించిన తొలి భారతీయుడు ఆయనే
Gandhi Jayanti 2022: మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.
Gandhi Jayanti 2022:
మహాత్మా గాంధీ జయంతి
మహాత్మా గాంధీ. ఈ పేరు తెలియన వారెవరు..? ప్రపంచవ్యాప్తంగా బాపూజీ పేరు పరిచయమే. భారత స్వాతంత్య్రోద్యమాన్ని ముందుండి నడిపిన వ్యక్తిగా చిరస్థాయిలో నిలిచిపోయారు. దేశ చరిత్రను మలుపు తిప్పారు. ఆంగ్లేయులపై పోరాడేందుకు భారతీయులందరినీ ఏకం చేసిన వ్యక్తి ఆయన. ఆ చలనమే...సంచలనమైన ఉద్యమంగా మారింది. బ్రిటీష్‌లను గద్దె దింపింది. ఇప్పుడు మనం అనుభవిస్తున్నస్వేచ్ఛ ఆయన పోరాట ఫలమే. మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ గుజరాత్‌లోని పోర్‌బందర్‌లో 1869లో అక్టోబర్ 2న జన్మించారు. ఆయన జయంతి సందర్భంగా ఆయనకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.
Interesting facts about Mahatma Gandhi:
1. మహాత్మాగాంధీ ఓ సారి రైలు ఎక్కుతుండగా...పొరపాటున ఓ షూ కింద పడిపోయింది. ఆయన వెంటనే మరో షూని కూడా కిందకు విసిరేశారట. ఎవరికైనా సరే...ఒక్క షూ దొరికితే దాంతో ఏం చేసుకుంటాడు..? ఎలాగో పోయిందేదో పోయింది. ఇంకోటి కూడా ఇచ్చేస్తే ఎవరికో ఒకరికి పనికొస్తాయి కదా అని అనుకున్నారట బాపూజీ. అందుకే అలా చేశారట.
2.1931లో తొలిసారి గాంధీ రేడియోలో మాట్లాడారట. ఆయన రేడియోను చూడగానే ఏమన్నారో తెలుసా..? "నేనిప్పుడు ఏం చేయాలి, ఇందులో మాట్లాడాలా?" అని అడిగారట.
3.Time Magazine ఇచ్చే "Man of the Year", "Person of the Year" ఎంత గౌరవప్రదమైనవో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటి వరకూ...ఆ మ్యాగజైన్ ఇచ్చే " Person of the Year" అవార్డుని దక్కించుకున్న భారతీయుడు గాంధీజీ మాత్రమే. 1930లో ఉప్ప సత్యాగ్రహం సమయంలో ఈ గౌరవం దక్కింది.
4. మహాత్మాగాంధీ ఆటోబయోగ్రఫీ "An Autobiography of My Experiments with Truth" బుక్ 1927లో ప్రచురితమైంది. 20వ శతాబ్దంలో వచ్చిన 100 గొప్ప పుస్తకాల్లో ఇదీ ఒకటిగా నిలిచింది.
5.1948లో గాందీ...నోబెల్ శాంతి పురస్కారానికీ నామినేట్ అయ్యారు. అయితే...నామినేషన్లు వేసిన సమయంలోనే గాంధీ దారుణ హత్యకు గురయ్యారు. నోబెల్ కమిటీ...ఆ ఏడాది అవార్డులు ప్రకటించలేదు. ఇంకెవరినీ నామినేట్ కూడా చేయలేదు. ఆ స్థాయికి తూగే వ్యక్తి అప్పటికి ఎవరూ లేరు అని ప్రకటించింది కమిటీ.
6.1999లో టైమ్ మ్యాగజైన్ "Person of the Century"టైటిల్ దక్కించుకోవటంలో సెకండ్ రన్నరప్‌గా నిలిచారు గాంధీ. ఆయనకు బదులుగా ఆల్బర్ట్ ఐన్‌స్టీన్‌కు ఈ గౌరవం దక్కింది. శాస్త్రసాంకేతిక రంగంలో ఐన్‌స్టీన్ చేసిన సేవలకు గుర్తుగా...ఈ టైటిల్ ఇచ్చారు.
7. బాపూజీ ఇంగ్లీష్ మాట్లాడినప్పటికీ...అది ఐరిష్ అసెంట్‌లో ఉంటుంది. అందుకు కారణం...ఆయనకు ఇంగ్లీష్ నేర్పిన గురువు ఐరిష్ వ్యక్తి కావటమే.
8. అప్పట్లోనే గాంధీజీ సౌతాఫ్రికాలో 15వేల డాలర్లు సంపాదించేవారట. ఇప్పటికీ...చాలా మంది ఈ సంపాదన కోసం శ్రమ పడుతూనే ఉన్నారు.
9. మహాత్మా గాంధీ జయంతిని ప్రపంచవ్యాప్తంగా "అంతర్జాతీయ అహింసా దినోత్సవం"గా జరుపుకుంటారు.
10. ఫోర్డ్ మోటార్ కంపెనీ వ్యవస్థాపకుడు గాంధీజీ అనుచరుడే. గాంధీ పంపిన చర్ఖాను చాలా భద్రంగా దాచుకుని రోజూ తిప్పేవారట.
11. శుక్రవారానికీ, గాంధీజీకి ఓ ప్రత్యేక అనుబంధం ఉంది. భారత్‌కు శుక్రవారమే స్వాతంత్య్రం వచ్చింది. బాపూజీ పుట్టింది, కన్నుమూసింది కూడా శుక్రవారమే.
12. గాంధీజీ ఓ సారి శాంతినికేతన్‌కు వెళ్లినప్పుడు అక్కడ రవీంద్రనాథ్ ఠాగూర్‌ని చూసి "నమస్తే గురుదేవ్" అని సంబోధించారట. ఠాగూర్ వెంటనే "నేను గురుదేవ్ అయితే..మీరు మహాత్మా" అని అన్నారట. ఆ మహాత్మ అన్న పదమే తరవాత గాంధీజీ పేరుకు
ముందు వచ్చి చేరింది.
Also Read: PM Modi Launches 5G: 5G సేవలు ప్రారంభించిన ప్రధాని మోదీ, ముందుగా ఆ నగరాల్లోనే