అన్వేషించండి

Funds for Flab: నిధులివ్వండి మంత్రి గారూ, ముందు బరువు తగ్గండి ఎంపీ గారూ-ఇదేం ఛాలెంజ్ సామీ..

కేంద్ర మంత్రి గడ్కరీ విసిరిన ఛాలెంజ్‌ని యాక్సెప్ట్ చేసిన ఎంపీ అనిల్ ఫిరోజియా. కష్టపడి బరువు తగ్గిన ఎంపీ.

బరువు తగ్గితే నిధులు వస్తాయని..

ప్రస్తుత లైఫ్‌స్టైల్‌లో ఊబకాయం రావటం చాలా కామన్‌గా మారింది. కొందరిలో జీన్స్ ఆధారంగా అలా ఒళ్లు వచ్చేస్తుంది. బరువు తగ్గేందుకు వాళ్లు పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. కొందరు జిమ్‌కి వెళ్లి వ్యాయామాలు చేస్తుంటే మరికొందరు ఇంట్లోనే  యోగా చేసుకుంటున్నారు. ఫలానా సమయానికి ఇంత బరువు తగ్గాలని తమకు తామే లక్ష్యాలు పెట్టుకుని మరీ వర్కౌట్లు చేస్తున్నారు. అనుకున్న విధంగా లక్ష్యం సాధిస్తే వారికి ఆత్మసంతృప్తి వస్తుంది. అయితే బరువు తగ్గినందుకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్‌తో పాటు డబ్బు కూడా వస్తే ఎలా ఉంటుంది..? ఆ ఊహే ఎంతో బాగుంది కదా. ఇప్పుడు ఓ కేంద్ర ఎంపీ ఈ హ్యాపీనెస్‌ని ఫీల్ అయ్యేందుకు రెడీ అవుతున్నాడు. అసలు విషయం ఏంటో అర్థం కావాలంటే ఈ కథ పూర్తిగా చదవాల్సిందే. 

కిలో బరువు తగ్గితే రూ.1000 కోట్లు 

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని ఎంపీ అనిల్ ఫిరోజియా ఊబకాయులు. 127 కిలోలు ఉండే వారు. ఫిబ్రవరిలో ఈ నియోజకవర్గంలోని మాల్వాలో అభివృద్ధి పనుల శంకుస్థాపన సమయంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అక్కడికి వెళ్లారు. ఆ సమయంలో అనిల్ ఫిరోజియాను చూసి షాక్ అయ్యారట. ఇంత బరువుంటే ఆరోగ్యానికి మంచిది కాదని, వెంటనే బరువు తగ్గాలని సూచించారట. అప్పుడే ఎంపీ అనిల్ ఫిరోజియా తమ ప్రాంత అభివృద్ధికి మరిన్ని నిధులు కావాలని నితిన్ గడ్కరీని అడిగారట. నిజానికి అప్పటికే చాలా సందర్భాల్లో నిధుల విషయమై గడ్కరీతో చర్చించారు అనిల్ ఫిరోజ్. అయితే నితిన్ గడ్కరీ మాత్రం ఈ సమస్య పరిష్కారానికి తెలివైన మార్గం వెతికారు. చాలా సేపు ఆలోచించి ఓ ఐడియాతో ముందుకొచ్చారు. నియోజకవర్గ అభివృద్ధికి నిధులు అందించాలంటే ముందు మీరు బరువు తగ్గాలి అని ఎంపీ అనిల్ ఫిరోజ్‌కి 
సవాల్ విసిరారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. ఈ ఛాలెంజ్‌ని స్వీకరించి బరువు తగ్గితే వెంటనే నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. తానూ గతంలో 137 కిలోల బరువు ఉండేవాడినని,ఎంతో కష్టపడి 93 కేజీలకు తగ్గానని వివరించారు గడ్కరీ. ఎన్ని కిలోల బరువు తగ్గినా...కిలోకి రూ. 1000కోట్ల చొప్పున నిధులు అందిస్తామని ఎంపీ అనిల్ ఫిరోజ్‌కి చెప్పారు. ఇక అప్పటి నుంచి ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టారు అనిల్. 
వర్కౌట్లు, యోగా, స్విమ్మింగ్ ఇలా ఒక్కటేంటి, అన్ని వ్యాయామాలూ చేసి మూడు నెలల్లో 15 కిలోలు తగ్గారు. కేంద్రమంత్రి గడ్కరీ ఛాలెంజ్‌ని స్వీకరించి 15కిలోలు తగ్గానని, గడ్కరీ గారు చెప్పినట్టుగా 15వేల కోట్ల రూపాయలు అందజేస్తారని ఆశిస్తున్నట్టు వెల్లడించారు ఎంపీ అనిల్ ఫిరోజియా. మొత్తంగా ఈ ఛాలెంజ్‌ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP DSC 2024: ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
Telangana EV Subsidy 2024: తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
Andhra Pradesh High School Time Table: ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
Vishwak Sen : మేం ఇట్లనే మాట్లాడ్తాం, పర్సనల్ అటాక్ చేస్తే దబిడి దిబిడే - రివ్యూ రైటర్లకు విశ్వక్ సేన్ స్ట్రాంగ్ వార్నింగ్
మేం ఇట్లనే మాట్లాడ్తాం, పర్సనల్ అటాక్ చేస్తే దబిడి దిబిడే - రివ్యూ రైటర్లకు విశ్వక్ సేన్ స్ట్రాంగ్ వార్నింగ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సచ్చిపోదామని యాసిడ్ తాగినా!! ఇతని స్టోరీకి కన్నీళ్లు ఆగవు!బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP DSC 2024: ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
Telangana EV Subsidy 2024: తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
Andhra Pradesh High School Time Table: ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
Vishwak Sen : మేం ఇట్లనే మాట్లాడ్తాం, పర్సనల్ అటాక్ చేస్తే దబిడి దిబిడే - రివ్యూ రైటర్లకు విశ్వక్ సేన్ స్ట్రాంగ్ వార్నింగ్
మేం ఇట్లనే మాట్లాడ్తాం, పర్సనల్ అటాక్ చేస్తే దబిడి దిబిడే - రివ్యూ రైటర్లకు విశ్వక్ సేన్ స్ట్రాంగ్ వార్నింగ్
Kantara Chapter 1 Release Date: గాంధీ జయంతికి 'కాంతార' ప్రీక్వెల్... లాంగ్ వీకెండ్ మీద కన్నేసిన రిషబ్ శెట్టి
గాంధీ జయంతికి 'కాంతార' ప్రీక్వెల్... లాంగ్ వీకెండ్ మీద కన్నేసిన రిషబ్ శెట్టి
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Jio New Plan: ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
Embed widget