అన్వేషించండి

Maldives Row: మాల్దీవుల మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలకు క్రికెట్‌ దిగ్గజాల కౌంటర్‌

Maldives Row: భారత ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన మాల్దీవుల మంత్రులపై దేశవ్యాప్తంగా విముఖత వ్యక్తం అవుతోంది. ఈ నేపధ్యంలో టీమిండియా క్రికెటర్లు సైతం ఘాటుగా స్పందించారు.

భారత ప్రధాని నరేంద్ర మోదీ(Pm Narendra Modi)ని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన మాల్దీవుల(Maldives) మంత్రులను టీమిండియా క్రికెటర్లు(Cricketers) తప్పుబడుతున్నారు. భారతీయులను తక్కువ చేసేలా మాట్లాడటం పద్ధతి కాదని హితవు పలుకుతున్నారు.  గతంలో  ఎన్నోసార్లు మాల్దీవుల పర్యటనకు వెళ్లామని కానీ ఇకపై అలాంటి పరిస్థితులు ఉండబోవని గట్టిగా చెబుతున్నారు. మన దేశంలోనే ఎన్నో సుందరమైన ప్రదేశాలు ఉన్నాయని.. ఇకపై వాటిపైనే మనమంతా దృష్టి సారించాలని పిలుపునిస్తున్నారు.  అంటే కాదు భారత పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసేలా తమ వంతు సహకారం అందిస్తామంటూ ప్రధాని మోదీకి మద్దతు తెలుపుతున్నారు. ఈ అంశంపై మాజీ ఓపెనర్లు వీరేంద్ర సెహ్వాగ్‌, ఆకాశ్‌ చోప్రా, మాజీ ఆల్‌రౌండర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌, మాజీ బ్యాటర్‌ సురేశ్‌ రైనా, టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య తదితరులు స్పందించారు. అలాగే భారతదేశ పర్యాటక రంగంపై విమర్శలు చేసిన మాల్దీవుల ఎంపీ జహీద్ రమీజ్‌ వ్యాఖ్యలపై  దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ పరోక్షంగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. 'అతిథి దేవో భవ' సంస్క‌ృతి కలిగిన మన దేశంలో ఎన్నో అందమైన ప్రదేశాలు ఉన్నాయని మాస్టర్ బ్లాస్టర్ ట్వీట్ చేశాడు.

అసలేం జరిగిందంటే.. 
కేంద్ర పాలిత ప్రాంతం లక్షద్వీప్‌(Lakshadweep)లో ప్రధాని మోదీ ఇటీవల పర్యటించారు. ఎప్పటిలాగానే తన పర్యటనకు  సంబంధించిన ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్ చేస్తూ లక్షద్వీప్‌ను పర్యాటక ధామంగా మార్చాలంటూ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పలువురు నెటిజన్లు ఉత్సాహంగా  మాల్దీవులతో లక్షద్వీప్‌ను పోలుస్తూ ప్రధాని మోదీ ఫొటోలను  వైరల్‌ చేశారు. అయితే దీనిని తట్టుకోలేకపోయిన మాల్దీవుల మంత్రులు మోదీని కించపరిచే విధంగా తోలుబొమ్మ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు. భారత్‌లో బీచ్‌లు, హోటల్‌ గదులు శుభ్రంగా ఉండవని.. అలాంటి దేశంతో తమకు పోలికేంటని వివాదాస్పద రీతిలో కామెంట్లు చేశారు. దీంతో బాయ్‌కాట్‌ మాల్దీవ్స్‌, #ExploreIndianIslands ట్రెండ్‌ చేస్తున్నారు భారత నెటిజన్లు. భారతీయుల బాయ్‌కాట్‌ నినాదంపై మాల్దీవుల మాజీ మంత్రి అహ్మద్ మహ్లూఫ్ స్పందించారు. భారత్‌పై చేసిన వ్యాఖ్యలతో జరుగుతున్న నష్టంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మాల్దీవుల పర్యటనలను భారతీయులు బహిష్కరిస్తే.. అది తమ దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందన్నారు. భారత్‌పై వ్యాఖ్యలు తమకే నష్టమని.. అందుకే ప్రభుత్వం త్వరితగతిన చర్యలు తీసుకోవాలని సూచించారు. తమ నేతలు చేసిన వ్యాఖ్యలు తమకే సిగ్గుచేటని ఇందుకు భారత్‌కు క్షమాపణలు తెలియజేస్తున్నానని మాల్దీవుల మంత్రి అన్నారు. తమ దేశంపై జరుగుతోన్న బాయ్‌కాట్ ప్రచారాన్ని ముగించాలని నెటిజన్లను అబ్దుల్లా అభ్యర్థించారు.  

మరోవైపు ప్రధాని మోదీపై మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలను భారత ప్రభుత్వం కూడా సీరియస్‌గా తీసుకుంది. మాల్దీవుల హై కమిషనర్ ఇబ్రహీం షహీబ్‌కు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ సమన్లు జారీ చేసింది. దిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సౌత్ బ్లాక్‌కు వెళ్లిన ఇబ్రహీం షహీబ్‌  వివాదంపై భారత ప్రతినిధులతో సుదీర్ఘంగా చర్చించారు. ప్రధాని మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రులపై మాల్దీవుల ప్రభుత్వం వేటు వేసిన పరిణామాలను షహీబ్‌ వివరించారు. అయితే జరిగిన వివాదంపై స్పష్టమైన వివరణ ఇవ్వాలని భారత్‌ ఆయనకు స్పష్టం చేసింది. మరోవైపు  ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలపై మాల్దీవుల విదేశాంగ శాఖ స్పందించింది. ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు సహింలేనివని మాల్దీవుల విదేశాంగ మంత్రి మూసా జమీర్ అన్నారు. మాల్దీవులు తన పొరుగు దేశాలతో సానుకూలంగా ఉంటుందని ప్రధాని మోదీపై మంత్రులు చేసిన వ్యాఖ్యలకు ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని  స్పష్టం చేశారు. 



మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Lagacharla Case: 'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
Minister Atchennaidu: జీరో అవర్‌పై అసెంబ్లీలో వాదోపవాదాలు - టీడీపీ ఎమ్మెల్యేకు రిప్లై ఇచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు
జీరో అవర్‌పై అసెంబ్లీలో వాదోపవాదాలు - టీడీపీ ఎమ్మెల్యేకు రిప్లై ఇచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు
Jhansi Hospital Fire: ఘోర విషాదానికి అదే కారణమా? - ఝాన్సీ ఆస్పత్రి అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు!
ఘోర విషాదానికి అదే కారణమా? - ఝాన్సీ ఆస్పత్రి అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడుసఫారీలను సెంచరీతో చితక్కొట్టిన సంజూ శాంసన్మైక్ టైసన్ ను చిత్తు చేశాడు, 300 కోట్ల ప్రైజ్ మనీని కొల్లగొట్టాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Lagacharla Case: 'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
Minister Atchennaidu: జీరో అవర్‌పై అసెంబ్లీలో వాదోపవాదాలు - టీడీపీ ఎమ్మెల్యేకు రిప్లై ఇచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు
జీరో అవర్‌పై అసెంబ్లీలో వాదోపవాదాలు - టీడీపీ ఎమ్మెల్యేకు రిప్లై ఇచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు
Jhansi Hospital Fire: ఘోర విషాదానికి అదే కారణమా? - ఝాన్సీ ఆస్పత్రి అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు!
ఘోర విషాదానికి అదే కారణమా? - ఝాన్సీ ఆస్పత్రి అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు!
Chandrababu Brother Passes Away: చంద్రబాబు ఇంట్లో తీవ్ర విషాదం, చికిత్స పొందుతూ సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత
చంద్రబాబు ఇంట్లో తీవ్ర విషాదం, చికిత్స పొందుతూ సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత
Most Ordered Item On Swiggy: కండోమ్ కాదు బిర్యానీ కూడా కాదు - స్విగ్గీలో ఎక్కువ ఆర్డర్ చేసే వస్తువు ఏదో తెలుసా ?
కండోమ్ కాదు బిర్యానీ కూడా కాదు - స్విగ్గీలో ఎక్కువ ఆర్డర్ చేసే వస్తువు ఏదో తెలుసా ?
Nayanthara Dhanush Issue:ధనుష్ వర్సెస్ నయనతార... పది కోట్లకు లీగల్ నోటీస్ - హీరోపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నయన్ ఓపెన్ లెటర్
ధనుష్ వర్సెస్ నయనతార... పది కోట్లకు లీగల్ నోటీస్ - హీరోపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నయన్ ఓపెన్ లెటర్
Starship: నలభై నిమిషాల్లో అమెరికా నుంచి ఢిల్లీకి - స్టార్ షిప్స్‌తో ప్లాన్ చేస్తున్న ఎలాన్ మస్క్
నలభై నిమిషాల్లో అమెరికా నుంచి ఢిల్లీకి - స్టార్ షిప్స్‌తో ప్లాన్ చేస్తున్న ఎలాన్ మస్క్
Embed widget