Viral News : హూ ఈజ్ రియా ? ఈ వ్యక్తికి మాత్రం పెద్ద విలన్ - దేశద్రోహం కేసులో ఇరికించేసింది !
Gujarat: సోషల్ మీడియాలో పరిచయం అయిన అమ్మాయికి తనకు తెలిసిన సమాచారం ఇచ్చాడో వ్యక్తి. ఆ పరిచయమైన అమ్మాయి పేరు రియా. కానీ ఇప్పుడతను దేశద్రోహం నేరం కింద జైల్లో ఉన్నాడు. అసలేమయిందో తెలుసా ?
Gujarat Man Worked As Helper On Coast Guard Ship Sent Crucial Info To Ria : వెరీజ్ రియా అంటే అసలు హు ఈజ్ రియా అనే మీమ్ సోషల్ మీడియాలో కొంత కాలంగా ట్రెండింగ్ లో ఉంది. మత్తు వదలరా 2 సినిమలో ఈ రియా క్యారెక్టర్ చుట్టూనే చాలా సన్నివేశాలు తిరుగుతూ ఉంటాయి. ఓ రకంగా కథ అంతా ఆ క్యారెక్టర్ చుట్టూనే తిరుగుతుంది. అందుకే ఆ సినిమా చూసిన వారు సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అయితే నిజంగానే ఓ రియా మాత్రం.. ఓ వ్యక్తిని దేశద్రోహం కేసులో ఇరికించేసింది. ఆ కథ ఆ సినిమా కన్నా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది.
కోస్ట్ గార్డ్ లో పనిచేసే వ్యక్తిని ట్రాప్ చేసిన ఐఎస్ఐ ఏజెంట్ రియా
గుజరాత్‌లోని కోస్ట్ గార్డ్ షిప్‌లో వెల్డింగ్‌తో పాటు ఇతర పనుల్లో హెల్పర్‌గ ాఉండేందుకు పంకజ్ కొఠియా అనే వ్యక్తి చేరాడు. అతనికి సోషల్ మీడియాలో రియా అనే అమ్మాయి పరిచయం అయింది ఆ అమ్మాయి కబుర్లు చెప్పి గోముగా కొంత సాయం కావాలని అడిగింది. డబ్బులు అయితే తన దగ్గర లేవని చెప్పాడేమో కానీ.. డబ్బులదేముంది నేనే ఇస్తా.. పెద్దగా పని లేని సాయం కావాలని రియా కోరింది. ఏమిటంటే ఆయన పనిచేస్తున్న కోస్ట్ గార్డుకు సంబంధించిన సమాచారం. అదేమంత పెద్ద విషయం అని సమాచారం అంతా రియాకు చేరవేయడం ప్రారంభించారు. రియా నుంచి ఇరవై ఆరు వేల రూపాయలు కూడా పంకజ్ అందుకున్నారు .
కీలక సమాచారం పంపి డబ్బులు తీసుకున్న పంకజ్
కోస్ట్ గార్డ్ షిప్‌లకు సంబంధించిన సమాచారం బయటకు వెళ్తుందని గుర్తించిన ఆఫీసర్లు నిఘా పెట్టారు. చివరికి పంకజ్ ఆ పని చేస్తున్నట్లుగా గర్తించి పట్టుకుని ఫోన్ చెక్ చేశారు. దాంతో రియాతో జరిపిన సంభాషణలు వారు పంపిననగదు సమాచారం అంతా సేకరించారు. అరెస్టు చేసి జైలుకు పంపారు. దేశ భద్రతకు సంబంధించిన కీలక సమాచారం బ యటకు పంపినందున ఆయనపై దేశద్రోహం కేసు పెట్టడం ఖాయం.
రియా ఒక పాకిస్తాన్ ఏజెంటని చివరికి క్లారిటీ
ఇంతకీ పంకజ్ సమాచారం పంపిన రియా ఎవరంటే.. పాకిస్తాన్ కు చెందిన సీక్రెట్ సర్వీస్ సంస్త ఐఎస్ఐ ఏజెంట్. అయితే ఫేస్ బుక్ ప్రోఫైల్ మాత్రమే అది. నిజంగా అమ్మాయో కాదో ఐఎస్ఐకే తెలియాలి..పోలీసులు పంకజ్ అను అరెస్టు చేసిన తర్వాత ఆ అకౌంట్ కూడా డీయాక్టివేట్ అయింది. అప్పటికే పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్ రియా పంకజ్ ను ట్రాప్ చేసినట్లుగా గుర్తించారు. పంకజ్ కు తెలిసే పాకిస్తాన్ కు సమాచారం పంపారా.. ఎంత సమాచారం పంపారు అన్నది దర్యాప్తులో తేల్చనున్నారు.