By: Ram Manohar | Updated at : 10 Sep 2022 05:04 PM (IST)
పాకిస్థాన్‌లో వరదలు ఆ దేశాన్ని ఆర్థికంగా దెబ్బ తీయనున్నాయి.
Pakistan Floods:
వరదల కారణంగా..
పాకిస్థాన్‌లో వరదలు ఎంత బీభత్సం సృష్టించాయో కళ్లారా చూశాం. మూడొంతుల దేశం నీట మునిగింది. ఆహారం లేక ప్రజలు అలమటిస్తున్నారు. లక్షలాది మూగ జీవాలు నీళ్లలో పడి కొట్టుకుపోయాయి. వేల కిలోమీటర్ల రహదారులు ధ్వంసమయ్యాయి. ఇళ్లు కూడా కూలిపోయాయి. వీటికి తోడు ఉక్రెయిన్ యుద్ధ ప్రభావంతో పాకిస్థాన్ ఆదాయం పడిపోతుందని అంచనా వేస్తున్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి పాకిస్థాన్ GDP వృద్ధి రేటు 5 నుంచి 3 %కి పడిపోతుందని కొన్ని రిపోర్ట్‌లు వెల్లడించాయి. National Flood Response and Coordination Centre (NFRCC)ఛైర్మన్, మేజర్ జనరల్ జఫర్ ఇక్బాల్, ప్రధాని షెహబాజ్ షరీఫ్...ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ఆంటోనియో గుటెర్రస్‌తో మాట్లాడారు. పాక్‌లోని ప్రస్తుత పరిస్థితులను ఆయనకు వివరించారు. మూడొంతుల దేశం ధ్వంసమైందని...ఈ విపత్తు వల్ల కలిగిన నష్టం దాదాపు 30 బిలియన్ డాలర్లుగా ఉండొచ్చని చెప్పారు. వరుస సంక్షోభాలు, వరదలు, IMF నిధుల రాకలో జాప్యం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం...అన్నీ కలిసి జీడీపీలో 2% మేర కోత పడొచ్చని అక్కడి సంస్థలు కూడా అంచనా వేస్తున్నాయి. 2010లో వచ్చిన వరదలు దాదాపు 2 కోట్ల మందిపై ప్రభావం చూపితే...ఈ సారి దాదాపు 3కోట్ల మందికి పైగా ప్రభావానికి గురయ్యారు. వీరిలో దాదాపు 60 లక్షల మంది నిరాశ్రయు లయ్యారు. ఈ విపత్తుని ఎదుర్కొనేందుకు అవసరమైన మౌలిక వసతులు లేకపోవటం ప్రధాన సమస్యగా మారింది. సహాయక చర్యలు చేసేందుకు మిలిటరీ, ఎన్‌జీవోలు రంగంలోకి దిగాయి. అటు ఐక్యరాజ్య సమితి సహాయక బృందాలు కూడా తమ విధులు నిర్వర్తిస్తున్నాయి.
వేలాది మంది మృతి
నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (NMDA) లెక్కల ప్రకారం..పాక్‌లో వరదల కారణంగా..1,396మంది మృతి చెందారు. గాయపడిన వారి సంఖ్య 12,700కు చేరుకుంది. 10లక్షల 70 వేల ఇళ్లు నేలమట్టమయ్యాయి. 6,600 కిలోమీటర్ల మేర రహదారులు ధ్వంసం కాగా...269 బ్రిడ్జ్‌లు కూలిపోయాయి. మొత్తం 81 జిల్లాల్లో ఇంకా వరద ఉద్ధృతి తగ్గలేదు. రెండ్రోజుల పాకిస్థాన్ పర్యటనలో ఉన్న గుటెర్రస్...సింధ్, బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో పర్యటించనున్నారు. గ్లోబల్ వార్మింగ్ వల్ల ఇలాంటి దుస్థితి వచ్చి ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. మెడికల్ అసిస్టెన్స్ లేకపోవటం వల్ల పాకిస్థాన్‌లో వరదల కారణంగా...జబ్బులు తీవ్రమయ్యే ప్రమాదముందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరించింది. చర్మసంబంధిత వ్యాధులు, శ్వాసకోస సమస్యలు, మలేరియా, డెంగ్యూ లాంటి సమస్యలు ఎదుర్కోక తప్పదని తెలిపింది. నీటి ద్వారా సంక్రమించే వ్యాధులతోనూ ప్రజలు ఇబ్బందులు పడతారని వెల్లడించింది. జూన్ మధ్య పోటెత్తుతున్న వరదల కారణంగా..వేలాది మంది మృతి చెందారు. వారిలో చిన్నారులూ ఉన్నారు. దాదాపు 20 లక్షల పంటభూములు నాశనమయ్యాయి. 7,94,000 మేర పాడి పశువులు చనిపోయాయి. "ప్రస్తుతానికి అక్కడి ప్రజల్ని రక్షించటం తప్ప వేరే మార్గం కనిపించటం లేదు. వరదలు అనూహ్య రీతిలో
నష్టాన్ని చేకూర్చాయి. పంట పొలాలు ధ్వంసమైపోయాయి. మూగజీవాలు నీళ్లలో పడి కొట్టుకుపోతున్నాయి. ఈ సమస్యలతో పాటు ప్రజల్ని ఆకలి వేధిస్తోంది" అని యూకేకు చెందిన Disasters Emergency Committee చీఫ్ ఎగ్జిగ్యూటివ్ సలేహ్ సయ్యద్ వివరించారు.
Also Read: Britain New King: బ్రిటన్ రాజుగా ప్రిన్స్ ఛార్లెస్-III,అధికారికంగా రాచరిక బాధ్యతలు అప్పగింత
2000 Rupee Notes: రూ.2 వేల రూపాయల నోట్ల మార్పిడికి 3 రోజులే మిగిలుంది, ఇంకా వేల కోట్లు తిరిగి రాలేదు!
Ganesh Immersion: వినాయక విగ్రహాలకు క్యూఆర్ కోడ్లు, నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు
రోడ్డుపై అర్ధనగ్నంగా అత్యాచార బాధితురాలు, సాయం కోసం ఇంటింటికీ తిరిగిన బాలిక
ఆ ఇంటిలిజెన్స్ రిపోర్ట్‌తో భారత్‌కి సంబంధం లేదు, నిజ్జర్ హత్యపై జైశంకర్ క్లారిటీ
Latest Gold-Silver Price 27 September 2023: భలే ఛాన్సులే - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి
AP Assembly Session: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం, నేడే చివరి రోజు - సభ ముందుకు కీలక బిల్లులు
Bhainsa News: బైంసాలో గణేష్ నిమజ్జనం వేళ భారీ భద్రత - పోలీసులకు స్థానికులకు మధ్య గొడవ, లాఠీచార్జ్
Mahesh Babu Rajamouli : నో డౌట్ - రాజమౌళి రికార్డులకు దగ్గరలో మహేష్ సినిమా కలెక్షన్స్!
Kodali Nani: జైల్లో దోమలు కుట్టకపోతే రంభా ఊర్వశిలు కన్నుకొడతారా - కొడాలి నాని సెటైర్లు
/body>