అన్వేషించండి
Delhi AIIMS Fire: ఢిల్లీ ఎయిమ్స్‌లో చెలరేగిన మంటలు, రోగుల తరలింపు
Delhi AIIMS Fire: ఢిల్లీ ఎయిమ్స్‌లోని ఎమర్జెన్సీ వార్డు పైన ఉన్న ఎండోస్కోపీ గదిలో సోమవారం మంటలు చెలరేగాయి. ఓపీడీ రెండవ అంతస్తులోని ఎండోస్కోపీ గదిలో మంటలు వ్యాపించడంతో దట్టమైన పొగ అలముకుంది.

ఢిల్లీ ఎయిమ్స్
Delhi AIIMS Fire: ఢిల్లీ ఎయిమ్స్‌లోని ఎమర్జెన్సీ వార్డు పైన ఉన్న ఎండోస్కోపీ గదిలో సోమవారం మంటలు చెలరేగాయి. పాత ఔట్ పేషెంట్ డిపార్ట్‌మెంట్ (OPD) రెండవ అంతస్తులోని ఎండోస్కోపీ గదిలో మంటలు వ్యాపించడంతో దట్టమైన పొగ అలముకుంది. సమాచారం అందుకున్న ఎనిమిది అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. 11:54 గంటలకు ఎయిమ్స్‌లోని ఎమర్జెన్సీ వార్డు నుంచి మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ఆస్పత్రి సిబ్బంది చుట్టుపక్కల ఉన్న రోగులను తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇంకా చదవండి
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఇండియా
న్యూస్
ఆంధ్రప్రదేశ్





















