Mumbai Fire: ముంబయిలో ఓ బిల్డింగ్‌లో భారీ మంటలు, భయాందోళనలో స్థానికులు
Mumbai Fire: ముంబయిలోని ఓ బిల్డింగ్‌లో భారీగా మంటలు చెలరేగాయి.
Mumbai Fire:
ముంబయిలోని తిలక్ నగర్లో ఓ బిల్డింగ్‌లో అగ్నిప్రమాదం జరిగింది. మధ్యాహ్నం 2.43 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా భవనంలో నుంచి మంటలు చెలరేగాయి. లెవల్-2 ఫైర్‌గా అధికారులు నిర్ధరించారు. "తిలక్‌నగర్‌లో లోకమాన్య తిలక్ టర్మినల్ వద్ద ఓ బిల్డింగ్‌లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఎవరూ చనిపోలేదు" అని ముంబయి ఫైర్ బ్రిగేడ్ వెల్లడించింది. అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తోంది. ఈ మధ్యే మహారాష్ట్రలోని థానేలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. ఓ పెద్ద భవంతిలో 18వ అంతస్తులో మంటలు చెలరేగాయి. వెంటనే అక్కడి నుంచి 10 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. 27 అంతస్తుల ఈ బిల్డింగ్‌లో జరిగిన ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
Mumbai | Fire broke out in a residential building in the New Tilak Nagar area. Fire tenders on spot.
— ANI (@ANI) October 8, 2022
The fire has been declared level 2. No loss of life has been reported yet: Mumbai Fire Brigade (MFB) pic.twitter.com/HBZ9uVXJpc
Mumbai | Level 2 fire reported in the New Tilak Nagar area, near Lokmanya Tilak Terminal around 2:43pm. Fire tenders on spot.
No loss of life has been reported yet: Mumbai Fire Brigade (MFB)
— ANI (@ANI) October 8, 2022
మహారాష్ట్రలో ఘోర ప్రమాదం..
మహారాష్ట్రలోని నాసిక్‌లో ఘోర ప్రమాదం జరిగింది. 30 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సులో ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. ఈ ఘటలో 14 మంది సజీవ దహనం అయ్యారు. మరికొంత మంది ప్రయాణికులు తీవ్ర గాయాల పాలయ్యారు. విషయం గుర్తించిన స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం రాత్రి యవత్మాల్ నుంచి నాసిక్ వైపు 30 మందికి పైగా ప్రయాణికులతో ఓ ప్రైవేటు బస్సు బయలు దేరింది. శనివారం వేకువ జామున 4.20 గంటల సమంలో నాసిక్-ఔరంగాబాద్ రబదారిపై ఈ ప్రమాదం జరిగింది. హోటల్ చిల్లీ చౌక్ వద్ద అదుపుతప్పి ట్రక్కుకను బస్సు ఢీకొట్టింది. దీంతో లారీ డీజిల్ ట్యాంక్ బ్లాస్ట్ అయింది. అయితే బస్సు వెంటనే మరో కారును ఢీకొట్టింది. ఆ తర్వాత బస్సులో మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో ప్రయాణికులంతా నిద్ర పోతున్నారు. విషయం గుర్తించిన స్థానిక ప్రజలు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఈఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Crimea Bridge Fire: రష్యా ఆక్రమిత క్రిమియాలో బాంబు దాడి, ధ్వంసమైన వంతెన
Also Read: Kakinada News : కాకినాడలో దారుణం, ప్రేమించలేదని యువతి గొంతు కోసిన ఉన్మాది