Farooq Abdullah: పార్లమెంట్ ఆవరణలో పాట పాడిన ఎంపీ ఫరూక్ అబ్దుల్లా
Farooq Abdullah Sings: పార్లమెంట్ ఆవరణలో జీనా యహా మర్నా యహా అంటూ పాట పాడారు ఫరూక్ అబ్దుల్లా.
Farooq Abdullah Sings:
జీనా యహా మర్నా యహా..
లోక్‌సభ ఎంపీ, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా పార్లమెంట్ ఆవరణలో పాట పాడారు. "మేరా నామ్ జోకర్" సినిమాలోని జీనా యహా మర్నా యహా అనే ఫేమస్ పాటను కాసేపు హమ్ చేశారు. పాట పాడుతూ కాస్త ఎమోషనల్ కూడా అయ్యారు ఫరూక్. ఇదే సమయంలో ఆర్‌జేడీ నేత అబ్దుల్లా బరి సిద్దికీ చేసిన వ్యాఖ్యలపైనా స్పందించారు. భారత్‌లో ముస్లింల స్థితిగతులపై పరోక్షంగా విమర్శలు చేశారు అబ్దుల్లా సిద్దికీ. దీనిపై స్పందించిన ఫరూక్ అబ్దుల్లా "భారత్‌లో విద్వేషం పెరుగుతోందన్నది వాస్తవం. కానీ...దేశం వదిలి వెళ్లడం అనేది సమస్యకుపరిష్కారం కాదు. మనమంతా కలిసి ఆ సమస్యను అంతం చేయాలి. అప్పుడే దేశంలోని అన్ని మతాల ప్రజలూ సోదరభావంతో ఉంటారు" అని అన్నారు.
फारूक अब्दुल्ला संसद का सत्र खत्म होने के बाद कुछ इस तरह जीना यहां मरना यहां गाते हुए नजर आए... फारूक अब्दुल्ला से सवाल पूछा गया था कि आरजेडी नेता अब्दुल बारी सिद्दिकी देश के माहौल को असुरक्षित बता रहे हैं... @OmarAbdullah pic.twitter.com/n22vYdYcr1
— Ankit Gupta ( ABP News) 🇮🇳 (@ReporterAnkitG) December 23, 2022
ఆర్‌జేడీ నేత సంచలన వ్యాఖ్యలు..
బిహార్‌లోని ఆర్‌జేడీ నేత భారత్‌లోని పరిస్థితులపై చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. ఇండియాలో పరిస్థితులేమీ బాలేవని, విదేశాలకు వెళ్లి సెటిల్ అయిపోవాలని తమ పిల్లలకు చెప్పానని అన్నారు...అబ్దుల్ బరి సిద్దిఖీ. ఆర్‌జేడీకి నేషనల్ జనరల్ సెక్రటరీగా వ్యవహరిస్తున్న అబ్దుల్ చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ హీట్ పెంచాయి. భారత్‌లో ముస్లింల స్థితిగతులను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. "ఈ దేశంలో ముస్లింల పరిస్థితి ఎలా ఉందో ఓ ఉదాహరణ చెబుతాను. ఇది నా సొంత అనుభవం కూడా. నాకో కొడుకు ఉన్నాడు. హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుతున్నాడు. కూతురు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో డిగ్రీ పూర్తి చేసింది. వాళ్లను అక్కడే ఉద్యోగాలు చూసుకోమని చెప్పాను. వీలైతే అక్కడి పౌరసత్వం కూడా తీసుకోవాలని సూచించాను" అని అన్నారు అబ్దుల్ బరి. గత వారం ఓ కార్యక్రమానికి హాజరైనప్పుడు ఇలా తన అసహనాన్ని వ్యక్తం చేశారు. "నేను ఈ విషయం చెప్పగానే వాళ్లకు భయం మొదలైంది. మీరెందుకు ఇండియాలోనే ఉంటున్నారని నన్ను ప్రశ్నించారు. నేను ఏదో విధంగా నెగ్గుకు రాగలను...కానీ మీ వల్ల కాదు అని చెప్పాను" అని అన్నారు.
చైనాపై ఫరూక్..
చైనా ప్రస్తావన వచ్చిన సమయంలో ఘాటుగా స్పందించారు ఫరూక్ అబ్దుల్లా. "ఇది 1962 నాటి భారత్ కాదు. ఇండియా...చైనాకు సరైన బదులు కచ్చితంగా ఇచ్చి తీరుతుంది" అని స్పష్టం చేశారు. గతంలో ఎన్నోసార్లు ఈ విషయం గురించి మాట్లాడారు ఫరూక్. చైనా, పాకిస్థాన్‌తో ఉన్న సరిహద్దు వివాదాల్ని కూర్చుని మాట్లాడుకుని పరిష్కరించుకోవాలని సూచించే వారు. కానీ....ఈ సారి భిన్న స్వరం వినిపించారు ఫరూక్ అబ్దుల్లా. చైనాకు గట్టి బదులు ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పారు. ఇదే సమయంలో చైనాతో చర్చలూ జరపాలని అన్నారు.
Also Read: Army Personnel Killed: సిక్కింలో ఘోర విషాదం, ప్రమాదానికి గురైన ఆర్మీ వాహనం - 16 మంది జవాన్లు మృతి