అన్వేషించండి

పీఎఫ్ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. త్వరలో EPFO కొత్త యాప్, తక్షణమే నగదు విత్‌డ్రా!

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) మార్చి 2026లో కొత్త మొబైల్ యాప్ లాంచ్ చేయనుంది. దాంతో UPI ద్వారా PF డబ్బులు నేరుగా బ్యాంకు అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు.

ఈపీఎఫ్ఓ (EPFO)తో కోట్లాది మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు అనుబంధం ఉంది. ప్రతినెలా ఉద్యోగుల బేసిక్ పే నుంచి కొంత మొత్తం పీఎఫ్ ఖాతాలోకి చేరుతుందని తెలిసిందే. అయితే గతంలో పీఎఫ్ నగదు విత్‌డ్రా చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడాల్సి వచ్చేది. ఇకపై పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేసుకోవడానికి ఎక్కువ రోజులు వేచి చూడాల్సిన అవసరం లేదు,  ఎక్కువ డాక్యుమెంటేషన్ కూడా అవసరం లేదు. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ EPFO మార్చి-ఏప్రిల్ 2026లో కొత్త మొబైల్ యాప్‌ను ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తోంది. దాంతో పీఎఫ్ ఖాతాదారులు యూపీఐ ద్వారా నేరుగా బ్యాంక్ ఖాతాకు పీఎఫ్ డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఈపీఎఫ్ఓ కొత్త యాప్‌ను ప్రారంభించబోతోంది, అయితే ఇందులో ఏయే ఫీచర్లు ఉంటాయో ఇక్కడ తెలుసుకోండి. 

ఉమంగ్ నుండి భిన్నంగా కొత్త ఈపీఎఫ్ఓ యాప్

ఈ కొత్త యాప్ ఇప్పటికే ఉన్న ఉమంగ్ యాప్ (UMANG app) నుంచి కాస్త భిన్నంగా ఉంటుంది. ఇది నేరుగా పీఎఫ్ ఖాతాదారుల బ్యాంక్ ఖాతాతో అనుసంధానమై ఉంటుంది. భీమ్‌తో సహా ఇతర యూపీఐ యాప్‌లతో పనిచేస్తుంది. పీఎఫ్ విత్‌డ్రాయల్‌ను పూర్తిగా బ్యాంకింగ్ స్థాయి సౌకర్యాన్ని అందించడమే దీని లక్ష్యం. కొత్త సిస్టమ్ కింద, ఈపీఎఫ్ఓ ఖాతా నుండి డబ్బు నేరుగా పీఎఫ్ ఖాతా నుంచి లింక్ చేసిన బ్యాంక్ ఖాతాకు బదిలీ అవుతుంది. దీని తర్వాత, పీఎఫ్ ఖాతాదారులు  యూపీఐ పిన్ ఉపయోగించి వెంటనే మనీ విత్‌డ్రా చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ సౌకర్యం అందుబాటులో లేదు. పీఎఫ్ విత్‌డ్రా చేసుకోవడానికి యూఏఎన్ పోర్టల్ లేదా ఉమంగ్ యాప్ ద్వారా క్లెయిమ్ చేయాలి. ప్రస్తుతం ఈ ప్రాసెస్ కోసం చాలా  సమయం పడుతుంది.

ట్రయల్ మోడ్‌లో సిస్టమ్

ఈపీఎఫ్ఓ ఈ కొత్త సౌకర్యాన్ని ట్రయల్ రన్ ప్రారంభించింది. ప్రస్తుతం దాదాపు 100 డమ్మీ అకౌంట్లలపై టెస్టులు చేస్తోంది. టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని పరిష్కరిస్తుంది. టెస్టింగ్ పూర్తయిన తర్వాత, యాప్‌ను మార్చి చివరి నాటికి ఈపీఎఫ్ కొత్త యాప్ విడుదల చేయవచ్చని అధికారులు చెబుతున్నారు.

ఎంత పీఎఫ్ విత్‌డ్రా చేసుకోవచ్చు?

ఈపీఎఫ్ఓ రూల్స్ ప్రకారం, పీఎఫ్ అకౌంట్ హోల్డర్స్ తమ ఈపీఎఫ్ బ్యాలెన్స్‌లో గరిష్టంగా 75 శాతం విత్‌డ్రా చేసుకోవచ్చు. మిగిలిన 25 శాతం మొత్తాన్ని రిటైర్మెంట్ ఫండ్ కోసం ఖాతాలో ఉంచడం తప్పనిసరి. ఉద్యోగం కోల్పోయిన సందర్భంలో కూడా ఇదే రూల్ వర్తిస్తుంది. మిగిలిన 25 శాతం పీఎఫ్‌ను నిర్ణీత సమయం తర్వాత మాత్రమే విత్‌డ్రా చేసుకోవచ్చు.

కొత్త యాప్‌లో ఈ ప్రత్యేక ఫీచర్లు లభిస్తాయి

  • యూపీఐ ద్వారా తక్కువ సమయంలో పీఎఫ్ విత్‌డ్రా
  • అర్హత కలిగిన బ్యాలెన్స్, కనీస బ్యాలెన్స్ గురించి ప్రత్యేక సమాచారం
  • పీఎఫ్ ఖాతాదారుడి రియల్ టైమ్ క్లెయిమ్ స్టేటస్
  • రూ. 5 లక్షల వరకు ఆటో సెటిల్‌మెంట్ సౌకర్యం
  • డిజిటల్ కేవైసీ, సెల్ఫ్ కరెక్షన్ ఫీచర్
  • పాస్‌బుక్, బ్యాలెన్స్ చెక్ వంటి సేవలు
  • ఏఐ ఆధారిత బహుభాషా మద్దతు

ఈపీఎఫ్ఓ 3.0 తో కీలక మార్పులు

ఈ కొత్త యాప్ ఈపీఎఫ్ఓ 3.0 అప్‌గ్రేడ్‌లో భాగం కాగా... తద్వారా డిజిటల్ క్లెయిమ్‌లు, ఫాస్ట్ వెరిఫికేషన్, సర్వీసులు వేగవంతం చేయడంపై ఫోకస్ చేస్తున్నారు. ఈపీఎఫ్ఓ మొత్తం కార్పస్ దాదాపు 26 లక్షల కోట్లు, ఇందులో దాదాపు 30 కోట్ల మంది ఖాతాదారులు ఉన్నారు. వీరిలో దాదాపు 7.5 కోట్ల మంది యాక్టివ్‌ మెంబర్స్ ఉన్నారు. దీనితో పాటు, కొత్త యూపీఐ సౌకర్యం వచ్చిన తర్వాత అనారోగ్యం, వివాహం, ఎడ్యుకేషన్, లేదా ఏదైనా అత్యవసర పరిస్థితిలో పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేసుకోవడం ఈజీ అవుతుంది. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Ronaldo Suspension Shock: కోచ్‌తో విభేదించి క్యాంప్ వీడినందుకు దిగ్గజానికి భారీ షాక్.. రొనాల్డోపై సస్పెన్షన్ వేటు
కోచ్‌తో విభేదించి క్యాంప్ వీడినందుకు దిగ్గజానికి భారీ షాక్.. రొనాల్డోపై సస్పెన్షన్ వేటు
ABP Desam Top 10, 10 October 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening
ABP Desam Top 10, 10 October 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening
CM Chandrababu: స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
Srikakulam Crime News: హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dasara Special Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
Talliki Vandanam Phase 2: తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
Srikakulam Crime News: హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
Bloody Romeo: బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
CM Chandrababu: స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
11-10-2026 ఆదివారం నవరాత్రుల మొదటి రోజు మకర, కుంభ, మీన రాశుల భవిష్యత్తు ఎలా ఉందంటే!
11-10-2026 ఆదివారం నవరాత్రుల మొదటి రోజు మకర, కుంభ, మీన రాశుల భవిష్యత్తు ఎలా ఉందంటే!
YS Sharmila: మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
Abhijit Dipke Grandmother Passes Away: అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
Embed widget