మీరు LPG గ్యాస్ సిలిండర్ విషయంలో ఈ తప్పులు చేయవద్దు

Published by: Shankar Dukanam
Image Source: pixbay

ఇళ్లలో ఉపయోగించే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లను చాలా జాగ్రత్తగా వాడకపోతే ప్రమాదాలు తప్పవు.

Image Source: pixabay

గతంలో వంటకు మట్టి పొయ్యిలను ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు దాదాపు అన్ని ఇళ్లలోనూ LPGతో వంట చేస్తున్నారు.

Image Source: pixabay

కొన్నిసార్లు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ప్రమాదాల గురించి వార్తలు వస్తుంటాయి. దీనివల్ల ప్రాణ, ఆస్తి నష్టం జరుగుతుంది.

Image Source: pixabay

ఎల్పీజీ సిలిండర్‌ను ఎల్లప్పుడూ నిటారుగా ఉంచాలి. అలా చేయకపోతే పైప్ లైన్లో ఒత్తిడి పెరిగి గ్యాస్ లీక్ కావచ్చు.

Image Source: pixabay

కొత్త సిలిండర్ అమర్చినప్పుడు లేదా గ్యాస్ వాసన వచ్చినా అగ్గిపుల్లతో పరీక్షించకుండా, సబ్బు లిక్విడ్ తో చెక్ చేయాలి.

Image Source: pixabay

సాధారణ రబ్బరు గొట్టాలకు బదులుగా, ISI మార్క్ కలిగిన సేఫ్‌గా ఉండే రబ్బరు పైప్ మాత్రమే వాడండి.

Image Source: pixabay

సిలిండర్‌ను వెంటిలేషన్ ఉన్న ప్రదేశంలో ఉంచండి. దాంతో లీకేజీ జరిగితే వెంటనే గ్యాస్ బయటకు వెళ్తుంది

Image Source: pixabay

గ్యాస్ వాసన వస్తే వెంటనే రెగ్యులేటర్ ఆఫ్ చేయాలి. ఇంట్లో మెయిన్ స్విచ్ ఆఫ్ చేయడంతో పాటు కిటికీలు, తలుపులు తెరవాలి.