అన్వేషించండి

Ram Navami Surya Tilak 2024: బాల రాముడి సూర్య తిలకాన్ని చూసి ప్రధాని భావోద్వేగం, చరిత్రాత్మకం అంటూ పోస్ట్

Surya Tilak 2024: అయోధ్య రాముడి సూర్య తిలకాన్ని దర్శించిన ప్రధాని మోదీ భావోద్వేగానికి లోనయ్యారు.

Ayodhya Surya Tilak 2024: అయోధ్య రామ మందిరంలో సూర్య తిలక దర్శనం (Ram Navami Surya Tilak 2024) భక్తుల్ని పరవశంలో ముంచేసింది. బాల రాముడి ఆలయంలో తొలిసారి రామ నవమి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగానే ఈ అపూర్వ ఘట్టం కనిపించింది. సరిగ్గా మధ్యాహ్నం 12.01 నిముషాలకు రాముడి నుదుటిన సూర్య కిరణాలు ప్రసరించాయి. దాదాపు 3-4 నిముషాల పాటు ఈ తిలకం దర్శనమిచ్చింది. ఆ సమయంలో ఆలయం అంతా జైశ్రీరామ్ నినాదాలతో మారు మోగింది. ఈ అద్భుతాన్ని ఆన్‌లైన్‌లో వీక్షించిన ప్రధాని నరేంద్ర మోదీ భావోద్వేగానికి గురయ్యారు. అసోంలోని నల్బరీలో ర్యాలీలో పాల్గొనేందుకు వెళ్లిన సమయంలో ట్యాబ్‌లో ఈ వీడియో చూశారు మోదీ. ఆ తరవాత X వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. అయోధ్యలో రామ నవమి జరగడం చరిత్రాత్మకం అని అన్నారు. ఈ సూర్య తిలకం దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు స్ఫూర్తినిస్తుందని ఆకాంక్షించారు. 

"నల్బరీలో ర్యాలీలో పాల్గొన్న తరవాత ఈ సూర్య తిలకం దర్శనం చేసుకున్నాను. అయోధ్య రాముడిపై సూర్య కిరణాలు పడిన ఆ అపూర్వ ఘట్టాన్ని వీక్షించాను. కోట్లాది మంది ప్రజలతో పాటు నాకూ ఇది చాలా భావోద్వేగమైన క్షణం. అయోధ్యలో రామ నవమి వేడుకలు జరగడం నిజంగా చరిత్రాత్మకం. మన జీవితాల్లోకి ఈ సూర్య తిలకం కొత్త శక్తినివ్వాలని, మన దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్తుందని ఆకాంక్షిస్తున్నాను"

- ప్రధాని నరేంద్ర మోదీ

సూర్య తిలకాన్ని చూస్తున్న ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రజలందరూ ఈ అద్భుతాన్ని కచ్చితంగా చూడాలని కోరారు. ర్యాలీలో పాల్గొన్న సమయంలో సూర్య తిలకం గురించి ప్రస్తావించారు. సెల్‌ఫోన్‌లలో టార్చ్ లైట్ ఆన్ చేసి అదే సూర్యుడికి తిలకంగా భావించాలని అన్నారు. ఆ తరవాత జై శ్రీరామ్ అంటూ నినదించారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kakinada: కాకినాడలో అక్రమ కట్టడాలపై అధికారుల సమ్మెట- అడ్డుకొనేందుకు ద్వారంపూడి రావడంతో ఉద్రిక్తత
కాకినాడలో అక్రమ కట్టడాలపై అధికారుల సమ్మెట- అడ్డుకొనేందుకు ద్వారంపూడి రావడంతో ఉద్రిక్తత
Hathras Stampede: హత్రాస్‌ ఘటనా స్థలంలో చెల్లాచెదురుగా చిన్నారుల చెప్పులు, గుండెని మెలిపెడుతున్న దృశ్యాలు
హత్రాస్‌ ఘటనా స్థలంలో చెల్లాచెదురుగా చిన్నారుల చెప్పులు, గుండెని మెలిపెడుతున్న దృశ్యాలు
Raithu Bharosa: రైతుభరోసా మరింత ఆలస్యం- వ్యవసాయేతర భూములు సర్వే తర్వాత సాయం!
రైతుభరోసా మరింత ఆలస్యం- వ్యవసాయేతర భూములు సర్వే తర్వాత సాయం!
Andhra Pradesh News: వైసీపీ ఎంపీపీ ఇంటిపైకి బుల్డోజర్‌ - టీడీపీ తిరువూరు ఎమ్మెల్యేపై విమర్శలు
వైసీపీ ఎంపీపీ ఇంటిపైకి బుల్డోజర్‌ - టీడీపీ తిరువూరు ఎమ్మెల్యేపై విమర్శలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

T20 World CUP 2024 Team of The Tournament | 12 మందితో కూడిన టీమ్ ను ప్రకటించిన ఐసీసీ | ABP DesamSurya Kumar Yadav Catch Controversy | T20 World Cup 2024| సూర్య స్టన్నింగ్ క్యాచ్ పై కొత్త అనుమానాలుRahul Dravid About Team India Victory | T20 World Cup 2024 | కోచ్ పదవి పోయిందంటూ ద్రవిడ్ కామెంట్స్BCCI Announce Rs 125 crore prize money | T20 World Cup2024 గెలిచిన టీం ఇండియాకు భారీ నజరానా | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kakinada: కాకినాడలో అక్రమ కట్టడాలపై అధికారుల సమ్మెట- అడ్డుకొనేందుకు ద్వారంపూడి రావడంతో ఉద్రిక్తత
కాకినాడలో అక్రమ కట్టడాలపై అధికారుల సమ్మెట- అడ్డుకొనేందుకు ద్వారంపూడి రావడంతో ఉద్రిక్తత
Hathras Stampede: హత్రాస్‌ ఘటనా స్థలంలో చెల్లాచెదురుగా చిన్నారుల చెప్పులు, గుండెని మెలిపెడుతున్న దృశ్యాలు
హత్రాస్‌ ఘటనా స్థలంలో చెల్లాచెదురుగా చిన్నారుల చెప్పులు, గుండెని మెలిపెడుతున్న దృశ్యాలు
Raithu Bharosa: రైతుభరోసా మరింత ఆలస్యం- వ్యవసాయేతర భూములు సర్వే తర్వాత సాయం!
రైతుభరోసా మరింత ఆలస్యం- వ్యవసాయేతర భూములు సర్వే తర్వాత సాయం!
Andhra Pradesh News: వైసీపీ ఎంపీపీ ఇంటిపైకి బుల్డోజర్‌ - టీడీపీ తిరువూరు ఎమ్మెల్యేపై విమర్శలు
వైసీపీ ఎంపీపీ ఇంటిపైకి బుల్డోజర్‌ - టీడీపీ తిరువూరు ఎమ్మెల్యేపై విమర్శలు
Chandra Babu And Revanth Reddy Meeting: చంద్రబాబు రేవంత్ రెడ్డి మధ్య చర్చకు వచ్చే అంశాలేంటీ? పదేళ్ల పెండింగ్‌కు పరిష్కారం దొరుకుతుందా?
చంద్రబాబు రేవంత్ రెడ్డి మధ్య చర్చకు వచ్చే అంశాలేంటీ? పదేళ్ల పెండింగ్‌కు పరిష్కారం దొరుకుతుందా?
సెన్సెక్స్ @ 80,000.. బడ్జెట్ ముందు భారత మార్కెట్లలో బుల్స్ జోరు..!
సెన్సెక్స్ @ 80,000.. బడ్జెట్ ముందు భారత మార్కెట్లలో బుల్స్ జోరు..!
Hathras Stampede: హత్రాస్‌లో తొక్కిసలాటకు కారణమిదే, ఆ ఒక్క తప్పు ఇన్ని ప్రాణాలు తీసింది
హత్రాస్‌లో తొక్కిసలాటకు కారణమిదే, ఆ ఒక్క తప్పు ఇన్ని ప్రాణాలు తీసింది
Kakuda Trailer: ఇది చాలా డిఫరెంట్ దెయ్యం, టైం ఇచ్చి మరీ చంపేస్తోంది- నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘కాకుడా‘ ట్రైలర్ చూశారా?
ఇది చాలా డిఫరెంట్ దెయ్యం, టైం ఇచ్చి మరీ చంపేస్తోంది- నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘కాకుడా‘ ట్రైలర్ చూశారా?
Embed widget