అన్వేషించండి

పెట్రోల్ డీజిల్ వాహనాల కన్నా ఈవీలతోనే ఎక్కువ కాలుష్యం - సంచలన రిపోర్ట్

Electric Vehicles: పెట్రోల్, డీజిల్ వాహనాల కన్నా విద్యుత్ వాహనాల వల్లే ఎక్కువ కాలుష్యం నమోదవుతుందని ఓ అధ్యయనం వెల్లడించింది.

Electric Vehicles Emits Pollution: విద్యుత్ వాహనాలతో కాలుష్యమే ఉండదు. వాతావరణ మార్పుల సమస్యని ఎదుర్కోవాలంటే ఈవీల సంఖ్య పెంచాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. వాటికి ప్రోత్సాహకాలూ అందిస్తున్నాయి. అయితే...ఇప్పుడో రిపోర్ట్ సంచలన విషయం వెల్లడించింది. పెట్రోల్, డీజిల్ వాహనాల కన్నా విద్యుత్ వాహనాల వల్లే ఎక్కువగా వాతావరణం కలుషితం అవుతుందని స్పష్టం చేసింది.  Emission Analytics ఇటీవలే ఓ అధ్యయనం చేపట్టి ఈ షాకింగ్ నిజాన్ని చెప్పింది. వాల్‌స్ట్రీట్ జర్నల్‌లో ఈ రిపోర్ట్ పబ్లిష్ అయింది. ఈవీల్లోని బ్రేక్‌లు, టైర్‌ల ద్వారా Particle Pollution పెరిగే ప్రమాదముందని తెలిపింది. సాధారణ వాహనాలతో పోల్చి చూస్తే ఈవీల బరువు ఎక్కువగా ఉంటుందని.. బ్రేక్‌లు, టైర్‌ల ద్వారా గాల్లోకి భారీ మొత్తంలో particulate matter ని విడుదల చేస్తాయని స్పష్టం చేసింది. సాధారణ వాహనాలతో పోల్చితే...ఇది 1,850 రెట్లు ఎక్కువగా ఉంటుందని వివరించింది. ఈవీల బరువు ఎక్కువగా ఉండడం వల్ల టైర్‌లు త్వరగా చెడిపోతాయి. ఆ సమయంలో గాల్లోకి టైర్‌ల ద్వారా హానికర రసాయనాలు విడుదలవుతాయి. క్రూడ్‌ ఆయిల్‌ నుంచి తీసిన సింథటిక్ రబ్బర్‌తో ఈ టైర్‌లను తయారు చేయడమే ఇందుకు కారణం.

దీంతో పాటు బ్యాటరీ బరువు గురించి కూడా ఈ రిపోర్ట్ ప్రస్తావించింది. గ్యాసోలిన్ ఇంజిన్స్‌తో పోల్చి చూసినప్పుడు ఈవీల బ్యాటరీ వెయిట్ ఎక్కువగా ఉంటుంది. ఈ అదనపు బరువు కారణంగా బ్రేక్‌లు, టైర్‌లపై ఒత్తిడి పెరుగుతుంది. ఈ కారణంగానే గాల్లోకి ఎక్కువ కాలుష్యం విడుదలవుతుంది. ఈ రిపోర్ట్ Tesla ఈవీల గురించి ప్రస్తావించింది. Tesla Model Y తోపాటు  Ford F-150 Lightning గురించీ చెప్పింది. ఈ రెండు కార్లలో బ్యాటరీల బరువు 1,800  పౌండ్‌ల కన్నా ఎక్కువగా ఉందని వెల్లడించింది. గ్యాసోలిన్ కార్‌తో పోల్చి చూస్తే...ఈ ఎలక్ట్రిక్ వెహికిల్స్‌ టైర్‌ల ద్వారా 400 రెట్ల ఎక్కువగా కాలుష్యం విడుదలవుతోందని తేలింది. వీటిని దృష్టిలో పెట్టుకుని ఈవీల్లో మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది. 

భారత్‌లో ఫ్యాక్టరీ పెట్టేందుకు టెస్లా (Tesla in India Market) ఎన్నో ఏళ్లుగా ప్రయత్నిస్తోంది. భారత్‌ కూడా అందుకు సానుకూలంగానే ఉన్నప్పటికీ Import Tax విషయంలో రాజీ కుదరడం లేదు. ఈ ట్యాక్స్‌ని తగ్గించాలని టెస్లా ప్రతిపాదించింది. అందుకు కేంద్ర ప్రభుత్వం పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. చాలా రోజులుగా దీనిపై చర్చ జరిగింది. ఇన్నాళ్లకు అధికారికంగా ఓ ప్రకటన చేసింది. దిగుమతి చేసుకునే విద్యుత్ వాహనాలపై ఇంపోర్ట్ ట్యాక్స్ (Import Tax on Tesla Vehicles)తగ్గించే ఆలోచన ఏమీ లేదని స్పష్టం చేసింది. ఇండియన్ మార్కెట్‌లో పాగా వేయాలని చూస్తున్న టెస్లాకి ఇది ఊహించని షాక్. పార్లమెంట్‌లో ఈ ప్రస్తావన రాగా..లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు వాణిజ్యశాఖ మంత్రి సోమ్ ప్రకాశ్. దిగుమతి చేసుకునే విద్యుత్ వాహనాలపై వేసే ట్యాక్స్ విషయంలో ఎలాంటి సబ్సిడీలు ఇచ్చే ఆలోచన లేదని స్పష్టం చేశారు. 
Also Read: జర్నలిస్ట్‌లను ఉద్యోగులుగా పరిగణించలేం, వాళ్లకి ఆ చట్టాలు వర్తించవు - బాంబే హైకోర్టు

టాప్ హెడ్ లైన్స్

Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
India Census 2027: జనాభా లెక్కల్లో తప్పుడు సమాధానాలు ఇస్తే ఏమవుతుంది, జైలు శిక్షనా ? జరిమానా విధిస్తారా
జనాభా లెక్కల్లో తప్పుడు సమాధానాలు ఇస్తే ఏమవుతుంది, జైలు శిక్షనా ? జరిమానా విధిస్తారా
US Iran War: ధరలు పెరిగినా సరే పెట్రోల్ కోనుగోలు చేయండి.. అమెరికన్లకు ట్రంప్ హుకుం
ధరలు పెరిగినా సరే పెట్రోల్ కోనుగోలు చేయండి.. అమెరికన్లకు ట్రంప్ హుకుం
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
Devdutt Padikkal Historic Ton: కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
CM Revanth Reddy: రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
ఏడాదికి ఒక్కసారి మాత్రమే సర్వీస్, 200 KM రేంజ్‌తో రాబోతున్న Ather Konarc
ఏడాదికి ఒక్కసారి మాత్రమే సర్వీస్, 200 KM రేంజ్‌తో రాబోతున్న Ather Konarc
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి
Embed widget