అన్వేషించండి

indonesia earthquake today: ఇండోనేషియాలో మరోసారి భూకంపం, రిక్టర్‌ స్కేల్‌పై 6.5 తీవ్రత నమోదు

Indonesia Earthquake: ఇండోనేషియాలో మరోసారి భూప్రకంపనలు నమోదై ప్రజల్ని ఆందోళనకు గురి చేశాయి.

Earthquake in Indonesia: ఇండోనేషియాలో మరోసారి భూ ప్రకంపనలు (Indonesia Earthquake) నమోదయ్యాయి. జావా ద్వీపంలో 6.5 మ్యాగ్నిట్యూడ్‌తో భూకంపం నమోదైనట్టు అక్కడి మెటరాలజీ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది. United States Geological Survey వెల్లడించిన వివరాల ప్రకారం...జావా ద్వీపంలో ఈ భూకంపం రాగా అటు రాజధాని నగరం జకార్తాలోనూ ఈ ప్రభావం కనిపించింది. భారీ భవనాలు ఒక్కసారిగా కదిలిపోయాయి.  అప్రమత్తమైన ప్రజలు ఇళ్లలో నుంచి హుటాహుటిన బయటకు వచ్చారు. సాధారణంగా ఇక్కడ ఎప్పుడు భూకంపం వచ్చినా 5 సెకన్ల పాటు భవనాలు ఊగిపోతాయి. కానీ ఈ సారి 10-20 సెకన్ల వరకూ ఈ ప్రభావం కనిపించినట్టు స్థానికులు చెబుతున్నారు. అయితే...ప్రస్తుతానికి అక్కడ సునామీ హెచ్చరికలు మాత్రం జారీ చేయలేదు. అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. 10 కిలోమీటర్ల లోతు వరకూ భూకంప తీవ్రత నమోదైనట్టు వెల్లడించారు. జకార్తాతో పాటు బంటెన్ ప్రావిన్స్‌లోనూ స్వల్పంగా భూమి కంపించింది. 

ఇప్పుడే కాదు. ఇండోనేషియాలో ఇలా భూకంపాలు తరచూ వస్తూనే ఉంటాయి. ఆ ప్రాంత భౌగోళిక పరిస్థితులు ఆ దేశాన్ని తరచూ ఇలా భూకంపాల బారిన పడేలా చేస్తోంది. ఇక్కడి భూమిలోని టెక్టానిక్ ప్లేట్స్‌ ఉన్న తీరే భూకంపానికి కారణమవుతున్నాయి. 2021లోనూ ఇండోనేషియాలోని సులవేసి ద్వీపంలో భారీ భూకంపం నమోదైంది. ఈ ఘటనలో 100 మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. అంతకు ముందు 2018లో 7.5 మ్యాగ్నిట్యూడ్‌తో భూకంపం వచ్చింది. ఈ తీవ్రతకి సునామీ కూడా రావడం వల్ల 2,200 మంది మృతి చెందారు. 2004లో ఏకంగా 9.1 తీవ్రతతో భూకంపం వచ్చి లక్షా 70 వేల మందిని బలి తీసుకుంది.   

టాప్ హెడ్ లైన్స్

Team India Clean Sweep: టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
Task Force for Exam Reforms: పరీక్షా విధానంలో సంస్కరణలు.. నందన్ నీలేకని నేతృత్వంలో హైపవర్డ్ టాస్క్‌ఫోర్స్: ప్రధాని మోదీ
పరీక్షా విధానంలో సంస్కరణలు.. నందన్ నీలేకని నేతృత్వంలో హైపవర్డ్ టాస్క్‌ఫోర్స్: ప్రధాని మోదీ
Iran US Conflict: 13 రోజుల తర్వాత ఇరాన్‌పై నిలిచిన అమెరికా దాడులు.. ట్రంప్ నిర్ణయానికి కారణాలివే
13 రోజుల తర్వాత ఇరాన్‌పై నిలిచిన అమెరికా దాడులు.. ట్రంప్ నిర్ణయానికి కారణాలివే
IND vs ZIM 3rd T20 Update:  వైభవ్ సూర్యవంశీ స్ట‌న్నింగ్ ఫిఫ్టీ .. టీమిండియా భారీ స్కోరు, క్లీన్ స్వీప్ దిశగా శ్రేయ‌స్ సేన సూప‌ర్ స్కెచ్!
వైభవ్ సూర్యవంశీ స్ట‌న్నింగ్ ఫిఫ్టీ .. టీమిండియా భారీ స్కోరు, క్లీన్ స్వీప్ దిశగా శ్రేయ‌స్ సేన సూప‌ర్ స్కెచ్!

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Team India Clean Sweep: టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
Adilabad Airport News: ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
Peddi Sudarshan Reddy Cardiac Arrest: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
Chandrababu Meets Balakrishna: హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Indiramma Towers Helpline Number: ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
Iran US Conflict: 13 రోజుల తర్వాత ఇరాన్‌పై నిలిచిన అమెరికా దాడులు.. ట్రంప్ నిర్ణయానికి కారణాలివే
13 రోజుల తర్వాత ఇరాన్‌పై నిలిచిన అమెరికా దాడులు.. ట్రంప్ నిర్ణయానికి కారణాలివే
YS Sharmila Surgery: హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
Second Marriage OTT : ఓటీటీలోకి సరికొత్త రొమాంటిక్ సిరీస్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి సరికొత్త రొమాంటిక్ సిరీస్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Embed widget