అన్వేషించండి

Driving License New Rules : ఆర్టీవో ఆఫీస్‌కు వెళ్లకుండానే, డ్రైవింగ్ టెస్ట్ చేయకుండానే లైసెన్స్ - కొత్త విధానం అమల్లోకి వచ్చేసిందని మీకు తెలుసా ?

ఆర్టీవో ఆఫీస్‌కు వెళ్లకుండానే .. డ్రైవింగ్ టెస్ట్ చేయకుండానే లైసెన్స్ జారీ చేసే ప్రక్రియ అమల్లోకి వచ్చింది. పూర్తి వివరాలు ఇవిగో

 

డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి కేంద్ర ప్రభుత్వం నిబంధనలని మార్చింది.  కేంద్ర ప్రభుత్వం డ్రైవింగ్ లైసెన్స్‌ను చాలా సులభతరం చేసింది.   డ్రైవింగ్ లైసెన్స్ కోసం ప్రజలు ఇకపై ప్రాంతీయ రవాణా కార్యాలయాన్ని (RTO) సందర్శించాల్సిన అవసరం లేదు.  కొత్త రూల్ ప్రకారం.. ఇప్పుడు ఆర్టీవో ( RTO ) ఆఫీసు వద్దకు వెళ్లి ఎలాంటి డ్రైవింగ్ పరీక్ష చేయవలసిన అవసరం లేదు. ఈ నిబంధనలను కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ నోటిఫై చేసింది. మారిన నిబంధనలు  అమల్లోకి వచ్చాయి. ఈ కొత్త మార్పు వల్ల డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆర్టీఓ వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న కోట్లాది మందికి ఊరట లభించినట్లయింది.

డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి ఆర్టీవో వద్ద పరీక్ష కోసం వేచి ఉన్న దరఖాస్తుదారులందరు ఏదైనా గుర్తింపు పొందిన డ్రైవింగ్ శిక్షణ పాఠశాలలో డ్రైవింగ్ లైసెన్స్ కోసం నమోదు చేసుకోవాలి. అక్కడ డ్రైవింగ్ ట్రైనింగ్ స్కూల్ నుంచి శిక్షణ పొందాలి. పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి. అప్పుడు దరఖాస్తుదారులకు డ్రైవింగ్ స్కూల్ ద్వారా సర్టిఫికేట్ అందుతుంది. ఈ సర్టిఫికేట్ ఆధారంగా దరఖాస్తుదారుడికి డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేస్తారు. శిక్షణా కేంద్రాలకు సంబంధించి రోడ్డు, రవాణా మంత్రిత్వ శాఖ నుంచి కొన్ని మార్గదర్శకాలు, షరతులు ఉంటాయి. ఇది శిక్షణా కేంద్రాల ప్రాంతం నుంచి శిక్షకుడి విద్య వరకు ఉంటుంది. నిబంధనల ప్రకారం అన్ని వివరాలు ఉంటేనే కేంద్రం డ్రైవింగ్‌ స్కూల్‌కి అనుమతి ఇస్తుంది.
    
కొత్తగా లైసెన్స్ కోసం అప్లై చేసే లెర్నర్స్ తమ లైసెన్స్ కోసం అర్హత సాధించడానికి ఏదైనా గుర్తింపు పొందిన డ్రైవర్ స్కూల్ కేంద్రాలలో శిక్షణ పొందాలి. మీరు డ్రైవింగ్ స్కూల్ నుండి డ్రైవింగ్ టెస్ట్ ను విజయవంతంగా పూర్తిచేయగాలిగితే, డ్రైవింగ్ లైసెన్స్ కోసం ప్రాంతీయ రవాణా కార్యాలయం నుండి డ్రైవింగ్ టెస్ట్ నుండి మీకు మినహాయింపు ఉంటుంది. అయితే ఇలా లైసెన్సులు జారీ చేసే డ్రైవింగ్స్ స్కూస్‌కు కట్టుదిట్టమైన రూల్స్ పెట్టారు.  

గుర్తింపు పొందిన డ్రైవింగ్ స్కూల్స్ మరియు గుర్తింపు పొందిన ఏజెన్సీలు ద్విచక్ర వాహనాలు, మూడు చక్రాల వాహనాలు మరియు తేలికపాటి మోటారు వాహనాల శిక్షణా కేంద్రాలకు కనీసం ఒక ఎకరం భూమి ఉండేలా చూడాలి. అదేవిధంగా, భారీ వాహనాలు మరియు కార్గో ట్రక్కుల ట్రైనింగ్ స్కూల్స్ కు 2 ఎకరాల స్థలం అవసరం .ఇంకో ముఖ్యమైన అవసరం ఏమిటంటే, ఎగ్జామినర్ కనీసం 12 తరగతి పాస్‌ కలిగి ఉండాలి.  డ్రైవింగ్ శిక్షణా కేంద్రాలు సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత, అది ఆటొమ్యాటిగ్గా సంబంధిత మోటారు వాహన లైసెన్స్ అధికారికి చేరుకుంటుంది. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP medical college controversy: PPP అంటే ప్రైవేటీకరణే అని వైసీపీ ఫిక్స్ - అదే రాజకీయ అస్త్రం - టీడీపీ తిప్పికొట్టలేకపోతోందా?
PPP అంటే ప్రైవేటీకరణే అని వైసీపీ ఫిక్స్ - అదే రాజకీయ అస్త్రం - టీడీపీ తిప్పికొట్టలేకపోతోందా?
KTR Challenge to CM Revanth: పది మందితో రాజీనామా చేయిస్తావా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ సవాల్
పది మందితో రాజీనామా చేయిస్తావా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ సవాల్
Adilabad News: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు అడ్డుకుంటే తిరగబడతాం; అటవీశాఖ అధికారులకు ఆదివాసీ గిరిజనుల హెచ్చరిక
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు అడ్డుకుంటే తిరగబడతాం; అటవీశాఖ అధికారులకు ఆదివాసీ గిరిజనుల హెచ్చరిక
Sharif Usman Hadi: కాజీ నజ్రుల్ సమాధి పక్కనే షరీఫ్ ఉస్మాన్ హదీ అంత్యక్రియలు! నేడు బంగ్లాదేశ్‌ జాతీయ సంతాప దినం!
కాజీ నజ్రుల్ సమాధి పక్కనే షరీఫ్ ఉస్మాన్ హదీ అంత్యక్రియలు! నేడు బంగ్లాదేశ్‌ జాతీయ సంతాప దినం!

వీడియోలు

Atha Kodalu In Sarpanch Elections Heerapur | హోరాహోరీ పోరులో కోడలిపై గెలిచిన అత్త | ABP Desam
టీమిండియా, సౌతాఫ్రికా మధ్య నేడు ఆఖరి పోరు
సంజూ.. చుక్కలు చూపించాల!
కోహ్లీ రికార్డ్‌ బద్దలు కొట్టడానికి అడుగు దూరంలో అభిషేక్ శర్మ
టీమిండియా కోచ్ గౌతం గంభీర్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన కపిల్ దేవ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP medical college controversy: PPP అంటే ప్రైవేటీకరణే అని వైసీపీ ఫిక్స్ - అదే రాజకీయ అస్త్రం - టీడీపీ తిప్పికొట్టలేకపోతోందా?
PPP అంటే ప్రైవేటీకరణే అని వైసీపీ ఫిక్స్ - అదే రాజకీయ అస్త్రం - టీడీపీ తిప్పికొట్టలేకపోతోందా?
KTR Challenge to CM Revanth: పది మందితో రాజీనామా చేయిస్తావా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ సవాల్
పది మందితో రాజీనామా చేయిస్తావా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ సవాల్
Adilabad News: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు అడ్డుకుంటే తిరగబడతాం; అటవీశాఖ అధికారులకు ఆదివాసీ గిరిజనుల హెచ్చరిక
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు అడ్డుకుంటే తిరగబడతాం; అటవీశాఖ అధికారులకు ఆదివాసీ గిరిజనుల హెచ్చరిక
Sharif Usman Hadi: కాజీ నజ్రుల్ సమాధి పక్కనే షరీఫ్ ఉస్మాన్ హదీ అంత్యక్రియలు! నేడు బంగ్లాదేశ్‌ జాతీయ సంతాప దినం!
కాజీ నజ్రుల్ సమాధి పక్కనే షరీఫ్ ఉస్మాన్ హదీ అంత్యక్రియలు! నేడు బంగ్లాదేశ్‌ జాతీయ సంతాప దినం!
Bigg Boss Telugu Grand Finale : బిగ్​బాస్​ గ్రాండ్ ఫినాలేలో మెగాస్టార్ చిరంజివీ.. నిధి అగర్వాల్ రాకతో కళ్యాణ్​కు గాయం!
బిగ్​బాస్​ గ్రాండ్ ఫినాలేలో మెగాస్టార్ చిరంజివీ.. నిధి అగర్వాల్ రాకతో కళ్యాణ్​కు గాయం!
Peddi Review : ఆ స్టోరీకి చికిిరీ గికిరీలు అవసరమా? - వారు తిన్న కంచంలో ఉమ్మేసినట్లే... రివ్యూయర్స్‌కు విశ్వక్ స్ట్రాంగ్ కౌంటర్
ఆ స్టోరీకి చికిిరీ గికిరీలు అవసరమా? - వారు తిన్న కంచంలో ఉమ్మేసినట్లే... రివ్యూయర్స్‌కు విశ్వక్ స్ట్రాంగ్ కౌంటర్
Hardik Pandya : తను కొట్టిన సిక్సర్‌ బంతి తగిలి గాయపడ్డ కెమెరామెన్‌ను పరామర్శించిన హార్దిక్ పాండ్యా!
తను కొట్టిన సిక్సర్‌ బంతి తగిలి గాయపడ్డ కెమెరామెన్‌ను పరామర్శించిన హార్దిక్ పాండ్యా!
Tamil Nadu Crime News: తండ్రిని పాముతో కరిపించి హత్య చేసిన కుమారులు! బీమా డబ్బులు, ప్రభుత్వ ఉద్యోగం కోసం దారుణం!
తండ్రిని పాముతో కరిపించి హత్య చేసిన కుమారులు! బీమా డబ్బులు, ప్రభుత్వ ఉద్యోగం కోసం దారుణం!
Embed widget