(Source: ECI/ABP News/ABP Majha)
ఫ్లైట్ ల్యాండ్ అయిన 30 నిముషాల్లోనే బ్యాగేజ్ డెలివరీ అవ్వాలి - ఎయిర్‌లైన్ సంస్థలకు ఆదేశాలు
Airlines Baggage: ఫ్లైట్ ల్యాండ్ అయిన అరగంటలోగా ప్రయాణికులకు బ్యాగేజ్ డెలివరీ పూర్తవ్వాలని ఎయిర్‌లైన్స్‌కి ఆదేశాలొచ్చాయి.
Airlines Baggage Delivery Time: ఫ్లైట్ ల్యాండ్ అయిన తరవాత లగేజ్ కోసం ప్రయాణికులు చాలా సేపు వేచి చూడాల్సి వస్తోంది. ఇది వాళ్లను అసౌకర్యానికి గురి చేస్తోంది. ఈ మధ్య కాలంలో ఈ సమస్య ఎక్కువ అయింది. ఈ క్రమంలోనే Bureau of Civil Aviation Security (BCAS)కీలక ఆదేశాలిచ్చింది. భారత్‌లోని అన్ని ఎయిర్ లైన్ సంస్థలు ఎయిర్‌పోర్ట్‌ల వద్ద ప్రయాణికులకు వీలైనంత వేగంగా బ్యాగేజ్‌లు డెలివరీ చేసేలా చూడాలని తేల్చి చెప్పింది. దాదాపు దేశంలోని అన్ని ఎయిర్‌పోర్ట్‌లలో బ్యాగేజ్ డెలివరీ టైమ్‌పై నిఘా పెట్టిన ఏవియేషన్ సెక్యూరిటీ...ఈ ఆదేశాలి ఇచ్చింది. ఇండిగో, స్పైస్‌జెట్, విస్టారా, ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సంస్థల పేర్లని ముఖ్యంగా ప్రస్తావించింది. ఈ సంస్థలు ఫ్లైట్ ల్యాండ అయిన అరగంటలోగా ప్రయాణికులకు బ్యాగేజ్‌ని డెలివరీ ఇవ్వాలని స్పష్టం చేసింది. డెలివరీ అగ్రిమెంట్ స్టాండర్డ్స్ ప్రకారం ఈ 30 నిముషాల నిబంధనను పాటించాలని చెప్పింది. ఈ నిబంధనను అమలు చేసేందుకు అన్ని ఎయిర్ లైన్ సంస్థలకు పది రోజుల సమయం ఇచ్చింది. ఫిబ్రవరి 26వ తేదీలోగా ఇది అమల్లోకి తీసుకురావాలని స్పష్టం చేసింది. ఈ ఏడాది జనవరిలోనే BCAS అన్ని ఎయిర్‌పోర్ట్‌లలో పర్యవేక్షణ మొదలు పెట్టింది. బ్యాగేజ్ ఏ సమయానికి వస్తోందో గమనించింది. 6 కీలకమైన ఎయిర్‌పోర్ట్‌లలో ట్రాక్ చేసింది. గతంతో పోల్చి చూస్తే పరిస్థితి కాస్త మెరుగు పడినప్పటికీ ఇంకా ప్రమాణాలకు తగ్గట్టుగా డెలివరీ అవడం లేదని అసహనం వ్యక్తం చేసింది. ఫ్లైట్ ఇంజిన్ ఆఫ్ చేసిన 10 నిముషాల్లోగానే బెల్ట్ ఏరియాకి బ్యాగేజ్ వచ్చి తీరాలని...ఈ ప్రక్రియంతా 30 నిముషాల్లో పూర్తైపోవాలని వెల్లడించింది. ప్రమాణాలకు అనుగుణంగా నడుచుకోకపోతే చర్యలు తప్పవని హెచ్చరించింది.