Pakistan Issues NOTAM: ఆపరేషన్ సిందూర్ 2.0 భయం - నిద్రపోకుండా సరిహద్దుల్లో కాపలా కాస్తున్న పాకిస్తాన్ సైన్యం
Delhi Red Fort Blast : ఢిల్లీ పేలుళ్లతో భారత్ మరోసారి పాకిస్తాన్ పై దాడి చేస్తుందని ఆ దేశం భయపడుతోంది. విమానాలు ఎగరకుండా ఆపేసి.. నిద్రపోకుండా కాపలా కాస్తోంది.

Pakistan Issues NOTAM Puts Forces on Alert: ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ సమీపంలో జరిగిన కారు బాంబు పేలుడు భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతను మరోసారి తీవ్రతరం చేసింది. ఈ పేలుడును 'టెర్రర్ అటాక్'గానే భావిస్తున్నారు. ఈ దాడుల వెనుక ఉన్న వారిని కఠినంగా శిక్షిస్తామని ప్రధాని మోదీ హెచ్చరించారు. దీనికి ప్రతిస్పందనగా పాకిస్తాన్ దేశవ్యాప్తంగా NOTAM నోటిస్ టు ఎయిర్‌మెన్ జారీ చేసి, వాయు, సైనిక, నావికాదళాలను 'హై అలర్ట్'లో ఉంచింది. భారతీయ ప్రతీకార చర్యల అనుమానంతో ఇస్లామాబాద్ లో టెన్షన్ వాతావరణం ఏర్పడింది.
ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్ సమీపంలో ఒక వైట్ మారుతి స్విఫ్ట్ కారులో పేలుడు జరిగింది. ఈ పేలుడు వల్ల చుట్టూ ఉన్న షాపులు, వాహనాలు దెబ్బతిన్నాయి. ఢిల్లీ పోలీస్ కమిషనర్ సంజయ్ అరోరా ప్రకారం, కారులో 50-60 కేజీల ఇంప్రొవైజ్డ్ ఎక్స్‌ప్లోసివ్ డివైస్ (IED) ఉంది. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కేసును దర్యాప్తు చేస్తోంది. మొదట 'మిస్టీరియస్ ఎక్స్‌ప్లోషన్'గా భావించినా తర్వాత టెర్రర్ అటాక్‌గా నిర్ధారించారు. భద్రతా ఏజెన్సీలు దీన్ని 'కాశ్మీర్ మిలిటెంట్స్'తో ముడిపడినట్టు అనుమానిస్తున్నాయి.
Pakistan begins mobilisation as tensions rise with India.
— People's news Channel (@peoplesnews2024) November 12, 2025
Unverified visuals from the Lahore motorway show increased activity. Additionally, Islamabad has issued NOTAMs covering its eastern border with India.#India #Pakistan #Islamabad #Lahore #indiapakistan #NOTAM #PNC pic.twitter.com/MivDaDOyH6
పేలుడు వార్తలు వినగానే పాకిస్తాన్ దేశవ్యాప్తంగా NOTAM జారీ చేసింది. ఇది విమానాలు, డ్రోన్‌లకు 48 గంటల పాటు పరిమితులు విధిస్తుంది. పాకిస్తాన్ వాయు, సైనిక, నావికాదళాలను 'హై అలర్ట్'లో ఉంచి, సరిహద్దు ప్రాంతాల్లో ట్రూప్స్ మొబిలైజ్ చేసింది. ఇస్లామాబాద్‌లోని ప్రధానమంత్రి కార్యాలయం "భారతీయ ప్రతీకార చర్యల అనుమానంతో భద్రతా చర్యలు తీసుకుంటున్నాం" అని ప్రకటించింది. మరో వైపు ఇస్లామాబాద్ లోనూ పేలుడు సంభవించింది. ఇస్లామాబాద్‌లో సూసైడ్ బాంబింగ్‌లో 12 మంది చనిపోయారు. ఇది భారత్ పనేనని పాకిస్తాన్ ఆరోపించిది.
🚨🇵🇰 Pakistan issues NOTAM A0757/25 — activating restricted zone OPR235 over Tilla Range, Chakwal from Nov 12–18.
— جنات کی جماعت (@JnatKy850271) November 12, 2025
Surface to unlimited altitude ⚡
Likely training or range ops under Lahore FIR.#Pakistan #PAF #NOTAM #BreakingNews #DefenseUpdate#PakistanArmy #DGISPR #Loc pic.twitter.com/JAVl9qdGSL
ఈ పేలుడు ఇండో-పాక్ మధ్య ఉద్రిక్తతకు కొత్త మలుపు తిరిగింది. గతంలో పుల్వామా, యురి అటాకుల తర్వాత భారత్ సర్జికల్ స్ట్రైక్‌లు చేసింది. అదుకే పాకిస్తాన్ 'ప్రీ-ఎంప్టివ్ అలర్ట్' తీసుకుంది.




















