Delhi Liquor Policy Case: అరెస్ట్‌ను సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో సిసోడియా పిటిషన్,అత్యవసర విచారణ
Delhi Liquor Policy Case: తన అరెస్ట్‌ను సవాలు చేస్తూ సిసోడియా సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు.
Delhi Liquor Policy Case:
5 రోజుల కస్టడీలో..
సీబీఐ అరెస్ట్‌ను నిరసిస్తూ సుప్రీం కోర్టుని ఆశ్రయించారు ఢిల్లీ డిప్యుటీ సీఎం మనీశ్ సిసోడియా. ఇప్పటికే విచారణ పూర్తి చేసిన అధికారులు 5 రోజుల కస్టడీలో ఉంచారు. దీన్ని సవాలు చేస్తూ సిసోడియా సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. అత్యవసర విచారణలో భాగంగా సర్వోన్నత న్యాయస్థానం ఈ పిటిషన్‌ను పరిశీలించనుంది. లిక్కర్ స్కామ్‌లో మనీలాండరింగ్‌కు పాల్పడ్డారంటూ సిసోడియాపై ఆరోపణలు చేస్తోంది CBI.ఇప్పటికే ఆయనను రెండు సార్లు విచారించింది. ఇటీవలే ఆయనను 8.5 గంటల పాటు విచారించిన అధికారులు తరవాత అరెస్ట్ చేశారు. తాము అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వడం లేదని, అందుకే అదుపులోకి తీసుకుంటున్నామని చెప్పారు. ఆ తరవాత కోర్టులోనూ హాజరు పరిచారు. రౌస్ అవెన్యూ కోర్టులో CBI అధికారులు,సిసోడియా తరపున న్యాయవాది తమ తమ వాదనలు వినిపించారు. కచ్చితంగా అవకతవకలు జరిగాయని CBI చెబుతుంటే...అలాంటిదేమీ లేదని సిసోడియా తరపున న్యాయవాది వాదించారు. చివరకు 5 రోజుల కస్టడీకి కోర్టు అనుమతించింది.
Delhi Excise policy case | Delhi Deputy CM Manish Sisodia moves Supreme Court challenging his arrest, plea likely to be mentioned in SC today seeking urgent hearing on his plea.
— ANI (@ANI) February 28, 2023
(File photo) pic.twitter.com/QZQD7ptGIT
మార్చి 4వ తేదీ వరకూ కస్టడీలోనే ఉంటారని స్పష్టం చేశారు అధికారులు
"సిసోడియా కంప్యూటర్లో కొన్ని కీలక ఆధారాలు లభించాయి. కొందరి మంత్రుల నుంచి సిసోడియాకు నోట్లు వచ్చాయి. కమీషన్ ఉన్నట్టుండి 5 కోట్ల నుంచి 12 కోట్లకు పెంచేశారు. ఒకవేళ ఈ పాలసీ నిజంగానే పారదర్శకంగా ఉండి ఉంటే కచ్చితంగా అమలు చేసే వాళ్లు. Indo Spirit అనే కంపెనీ సిసోడియా వల్ల లబ్ధి పొందింది. ఈ కేసులో తప్పకుండా ఫేస్ టు ఫేస్ ఇంటరాగేషన్ జరిపి తీరాలి. ఆయన ఫోన్లు కూడా పదేపదే మార్చారు. ఆధారాలు చెరిపేందుకు ప్రయత్నించారు. 2020 జనవరి నుంచి ఇప్పటి వరకూ సిసోడియా వాడిన ఫోన్లను మేం పరిశీలించాలి."
-సీబీఐఅయితే సీబీఐ వాదనల్ని సిసోడియా తరపున వాదించే న్యాయవాది దయన్ కృష్ణన్ కొట్టి పారేశారు. రిమాండ్ అడగడానికి సీబీఐకి కచ్చితమైన కారణమేమీ లేదని అన్నారు. ఓ వ్యక్తి సమాధానం చెప్పనంత మాత్రాన అరెస్ట్ చేయడమేంటని ప్రశ్నించారు. రిమాండ్ పిటిషన్‌ను ఖండించారు. ఫోన్లు మార్చడం పెద్ద నేరమేమీ కాదని తేల్చి చెప్పారు.