Watch Video: మీరు బాలీవుడ్‌లో ఉండాల్సింది, ఢిల్లీ పోలీస్ వాయిస్‌కి నెటిజన్లు ఫిదా
Watch Video: అర్జిత్ సింగ్ తేరే హవాలే పాటను అద్భుతంగా పాడిన ఢిల్లీ పోలీస్ టాలెంట్‌కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
Delhi Cop Sings:
తేరే హవాలే పాట పాడిన ఢిల్లీ పోలీస్
పాపులర్ సాంగ్స్‌కి కవర్ సాంగ్స్ చేస్తూ చాలా మంది పాపులర్ అయిపోతున్నారు. ముఖ్యంగా రీల్స్, షార్ట్స్ వచ్చాక కంటెంట్‌కి కొదవ లేకుండా పోతోంది. ఇలా రీల్స్ చేసిన వాళ్లకూ సినిమాల్లో అవకాశాలొస్తున్నాయి. అంత ఇంపాక్ట్ చూపిస్తోంది సోషల్ మీడియా. అంతే కాదు. ఎక్కడెక్కడో ఉన్న కళాకారులనూ సోషల్ మీడియా వెలుగులోకి తీసుకొస్తోంది. కచ్చాబాదం పాట పాడిన వ్యక్తి ఎలా ట్రెండ్ అయ్యాడో తెలిసిందేగా. ఇప్పుడు మరో ఆర్టిస్ట్ ఇండస్ట్రీకి పరిచమయ్యేలా కనిపిస్తున్నాడు. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే...ఆయనో పోలీస్. ఢిల్లీ పోలీస్ అర్జిత్ సింగ్ పాడిన Tere Hawaale సాంగ్‌ని అద్భుతంగా పాడాడు...రజత్ రాథోడ్. ఒరిజినల్ పాటకు ఎంత మంది ఫిదా అయ్యారో...ఈ పోలీస్ పాడిన పాటకూ అంత మంది ఫిదా అయిపోయారు. ఆ మెలోడీ కంపోజిషన్‌ని ఎలాంటి ఇన్‌స్ట్రుమెంట్స్ లేకుండానే కేవలం తన వాయిస్‌తో అద్భుతంగా వినిపించాడు. లాల్ సింగ్ చద్దాలోని ఈ పాటను ఓ పార్కింగ్ ప్లేస్‌లో పాడాడు రజత్ రాథోడ్. ఇది విన్న వాళ్లెవరైనా సరే...ఒక్కసారికే ఆపేయలేరు. రిపీట్ మోడ్‌లో పెట్టుకుని మరీ ఎంజాయ్ చేస్తారు. అంత బాగుంది ఆయన గొంతు. ఇంత అద్భుతంగా పాడితే నెటిజన్లు సైలెంట్‌గా ఉంటారా..? లైక్‌లు, కామెంట్‌లతో తమ ఎగ్జైట్‌మెంట్ చూపిస్తున్నారు. కామెంట్స్‌లో అయితే రజత్‌కి బోలెడన్ని ప్రశంసలు దక్కుతున్నాయి. "నువ్వు బాలీవుడ్‌లో ఉండుంటే అన్ని పాటలూ నీతోనే పాడించే వాళ్లు. మనసు దోచేశావ్ బ్రో" అని నెటిజన్ కామెంట్ చేశాడు. "వావ్ వినడానికి ఎంత బాగుంది" అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. "మీ పాట వింటుంటే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంది" అని మరొకరు కాంప్లిమెంట్ ఇచ్చారు. మొత్తానికి ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
View this post on Instagram
Also Read: Manipur Violence: సీఎం సభనే టార్గెట్ చేసిన ఆందోళనకారులు, మణిపూర్‌లో హై అలెర్ట్ - ఇంటర్నెట్ బంద్