By: Ram Manohar | Updated at : 26 Feb 2023 01:55 PM (IST)
అదానీ అంశంపై కేంద్రం నోరు విప్పేంత వరకూ ప్రశ్నిస్తూనే ఉంటానని రాహుల్ గాంధీ అన్నారు. (Image Credits: ANI)
Rahul Gandhi on Adani Row:
కాంగ్రెస్ ప్లీనరీ సమావేశాలు..
కాంగ్రెస్ ప్లీనరీ సమావేశాల్లో రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ జోడో యాత్ర గురించి ప్రస్తావించిన ఆయన...కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. అదానీ అంశంపైనా మాట్లాడారు. పార్లమెంట్‌లోనూ అదానీ అంశాన్ని ప్రస్తావించానని గుర్తు చేశారు.
"పార్లమెంట్ సమావేశాల్లో అదానీ గురించి మాట్లాడాను. ఉన్నట్టుండి గౌతమ్ అదానీ అనే వ్యక్తి ప్రపంచంలోని ధనికుల్లో రెండో వాడిగా ఎలా ఎదిగారని ప్రశ్నించాను. దేశంలో మరెవ్వరికీ దక్కనన్ని లాభాలు అదానీకి మాత్రమే దక్కాయి. కేవలం ప్రధాని మోదీ, అదానీ మధ్య సంబంధం ఏంటి అని అడిగాను. బీజేపీ కార్యకర్తలు కూడా అదానీకి కొమ్ము కాస్తున్నారు. ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే దేశద్రోహి అని ముద్ర వేస్తున్నారు. ఎవరూ అదానీ గురించి ప్రశ్నించే అవకాశమే లేకుండా చేస్తున్నారు. అయినా సరే. నిజమేంటో బయటకు వచ్చేంత వరకూ నేను ప్రశ్నిస్తూనే ఉంటాను"
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ సీనియర్ నేత
భారత్ జోడో యాత్రలో తనకు ఎదురైన అనుభవాలనూ పంచుకున్నారు రాహుల్ గాంధీ. ఈ యాత్ర ద్వారా ఎన్నో కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం దక్కిందని వెల్లడించారు.
"యాత్రలో నేను చాలా నేర్చుకున్నాను. దేశం కోసం కన్యా కుమారి నుంచి కశ్మీర్ వరకూ నడిచాను. వేలాది మంది మాతో కలిసి వచ్చారు. రైతుల సమస్యల్ని అడిగి తెలుసుకున్నాను. వాళ్ల బాధేంటో అర్థం చేసుకున్నాను. 52 ఏళ్లు గడిచిపోయాయి. ఇప్పటికీ నాకు సొంత ఇల్లంటూ లేదు. కానీ కశ్మీర్‌కు వెళ్లినప్పుడు సొంత ఇంటికి వెళ్లిన అనుభూతి కలిగింది. భారత్ జోడో యాత్రతో అన్ని వర్గాల ప్రజలకు కాంగ్రెస్‌తో ఇదే అనుభూతి వచ్చింది. యాత్రలో చాలా మంది ప్రజలు రాజకీయాల గురించి మాట్లాడలేదు. కానీ కశ్మీర్ ప్రజలు మాత్రం వీటి గురించే ప్రస్తావించారు. కశ్మీరీ యువతను దృష్టిలో పెట్టుకుని మూడు రంగుల జెండాను ఎగరేశాం. కానీ బీజేపీ దాన్ని తొలగించింది"
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ సీనియర్ నేత
During Bharat Jodo Yatra I learned a lot. I walked for my nation from Kanyakumari to Kashmir. Thousands connected to me & party during the yatra. I listened to all problems of farmers & realized their pain: Cong MP Rahul Gandhi at 85th Plenary Session of party in Raipur pic.twitter.com/pmhptf7uPB
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) February 26, 2023
కాంగ్రెస్ ప్లీనరీ సమావేశంలో సోనియా గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్ జోడో యాత్రతోనే తన పొలిటికల్ ఇన్నింగ్స్ ముగుస్తుందని అని వెల్లడించారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ నేతృత్వంలో కాంగ్రెస్ ఎంతో పురోగతి సాధించిందని, ఆయన పని తీరు తనకు సంతృప్తినిచ్చిందని అన్నారు.
"2004,2009లో మన్మోహన్ సింగ్ నేతృత్వంలో మేం సాధించిన విజయాలు ఎంతో సంతృప్తినిచ్చాయి. ఇంకా సంతోషించే విషయం ఏంటంటే భారత్ జోడో యాత్రతోనే నా రాజకీయ ఇన్నింగ్స్ ముగుస్తుండొచ్చు. కాంగ్రెస్‌కు ఇదో కీలక మలుపు అవుతుండొచ్చు"
-సోనియా గాంధీ, కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు
Also Read: Global Economy: అమెరికా, ఐరోపా వాసులకు చుక్కలు - మళ్లీ రికార్డు స్థాయికి ఇన్ఫ్లేషన్!
Tirupati Crime : విద్యార్థినికి మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్న లెక్చరర్, నిందితుడికి అంతకు ముందే పెళ్లి!
Data Theft Case : వినయ్ భరద్వాజ ల్యాప్ టాప్ లో 66.9 కోట్ల మంది డేటా- 24 రాష్ట్రాలు, 8 మెట్రోపాలిటిన్ సిటీల్లో డేటా చోరీ
Tirupati News : ఏడో తరగతి విద్యార్థినితో ఆర్టీసీ డ్రైవర్ అసభ్య ప్రవర్తన, ఫొటోలు తీసి పైశాచిక ఆనందం
MP Laxman: బీజేపీ పాలిత ప్రాంతాల్లో రూ.20 తగ్గిస్తే, కేసీఆర్ రూ.5 కూడా తగ్గించలేదు: ఎంపీ లక్ష్మణ్
Sugar: తీపి తగ్గుతున్న చక్కెర, ప్రపంచ దేశాల్లో ఇదో పెద్ద సమస్య
PBKS Vs KKR: కోల్‌కతాకు వర్షం దెబ్బ - డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో పంజాబ్ విక్టరీ!
BRSలో చేరిన మహారాష్ట్ర రైతు సంఘాల నేతలు, తన జీవితమంతా పోరాటాలేనన్న కేసీఆర్
Nellore Adala : టీడీపీకి అభ్యర్థులు లేకనే ఫిరాయింపులు - నెల్లూరు వైఎస్ఆర్‌సీపీ ఎంపీ లాజిక్ వేరే...
LSG Vs DC: టాస్ గెలిచిన వార్నర్ భాయ్ - ఫీల్డింగ్‌కే ఓటు!