News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Parliment Session: ఓబీసీలను కూడా మహిళా రిజర్వేషన్ల బిల్లులో చేర్చాలి: సోనియా గాంధీ

Parliment Session: మహిళా రిజర్వేషన్‌ బిల్లులో ఓబీసీలను కూడా చేర్చాలని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ డిమాండ్‌ చేశారు.

FOLLOW US: 
Share:

మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై ఈరోజు లోక్‌సభలో చర్చ జరుగుతోంది. నిన్న నూతన పార్లమెంటు ప్రారంభమైన తర్వాత తొలి బిల్లుగా మహిళా రిజర్వేషన్ల బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. కాగా దానిపై ఈరోజు చర్చ ప్రారంభమైంది. ఈ బిల్లులో ఓబీసీలను కూడా చేర్చాలని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ డిమాండ్‌ చేశారు. 33 శాతం కోటాలో ఇతర వెనుక బడిన వర్గాల మహిళలను కూడా చేర్చాలని అన్నారు. ప్రతిపక్షం నుంచి తొలుతగా సోనియా మాట్లాడారు. ఈ బిల్లు పట్ల తాము ఎంతో సంతోషంగా ఉన్నామని, అలాగే కన్సర్నడ్‌ గా కూడా ఉన్నామని అన్నారు. భారత మహిళలు రాజకీయ అవకాశాల కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తూనే ఉన్నారు, ఇప్పుడు ఇంకా మరికొన్ని సంవత్సరాలు ఎదురుచూడమని అడుగుతున్నారు. ఇంకా ఎన్ని సంవత్సరాలు? అని ప్రశ్నించారు. దీనిని వెంటనే అమలు చేయాలని ఆమె డిమాండ్‌ చేశారు.

ఈ బిల్లుకు తనకు ఎంతో ఎమోషనల్‌ అని, తన భర్త రాజీవ్‌ గాంధీ లోకల్‌ బాడీస్‌లో రిజర్వేషన్లు ప్రారంభించారని సోనియా గాంధీ ఈ సందర్భంగా గుర్తుచేశారు. కాంగ్రెస్‌ పార్టీ నారీ శక్తి వందన్‌ అభియాన్‌ 2023 బిల్లుకు మద్దతిస్తుందని స్పష్టంచేశారు.  అయితే  ఎస్పీ, ఎస్టీ, ఓబీసీలకు సబ్‌ కోటా ద్వారా దీనిని వెంటనే అమలు చేయాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేస్తున్నట్లు చెప్పారు. దీని అమలులో ఆలస్యం చేయడం భారత మహిళలకు అన్యాయం జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. 

లోక్‌​సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టడంపై దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తం అవుతోంది. దశాబ్దాలుగా పెండింగ్‌ ఉన్న ఈ బిల్లుకు మోక్షం లభించినట్లైంది. అయితే ఇందులో OBC మహిళలకు రిజర్వేషన్ల అంశం వివాదాస్పదం, చర్చకు దారితీస్తోంది. మహిళలకు 33% సీట్ల రిజర్వేషన్ల అంశం గతంలో పార్లమెంట్‌ లోపల, వెలుపల అనేక ఆవేశ పూరిత చర్చలకు కారణమైంది. 1996 మహిళా రిజర్వేషన్ బిల్లును పరిశీలించిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ నివేదిక OBCలకు రిజర్వేషన్‌ను కల్పించేందుకు రాజ్యాంగాన్ని సవరించాలని, వారికి రిజర్వేషన్లు కల్పించాలని సిఫార్సు చేసింది. రాజ్యసభ, శాసనమండలిలకు కూడా రిజర్వేషన్లు పొడిగించాలని సిఫారసు చేసింది. ఈ సిఫార్సులు ఏవీ 2010 బిల్లు, తాజా బిల్లులో పొందుపరచబడలేదు. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలలో OBC లకు రిజర్వేషన్ కల్పించలేదు. 

1996 రిజర్వేషన్ బిల్లును పరిశీలించిన గీతా ముఖర్జీ నేతృత్వంలోని కమిటీ ఓబీసీలకు కూడా రిజర్వేషన్ల ప్రయోజనాన్ని వర్తింపజేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలించాలని సిఫారసు చేసింది. అయితే అప్పటి ప్రభుత్వం OBC మహిళలకు సీట్ల రిజర్వేషన్లు కల్పించడంపై బిల్లులో పొందుపరకపోవడాన్ని ముఖర్జీ నేతృత్వంలోని కమిటీ గమనిచింది. రాజ్యాంగం ప్రకారం ప్రస్తుతం షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు ఉన్నందున వారికి OBCలకు రిజర్వేషన్లు లేకుండా పోయాయి.  

ఈ అంశంపై వివిధ రాజకీయ పార్టీల అభిప్రాయాలను కూడా నివేదిక నమోదు చేసింది. ఉదాహరణకు, రాష్ట్రీయ జనతా దళ్ తన రాతపూర్వక మెమోరాండమ్‌లో మహిళలకు రిజర్వేషన్ కల్పించే విషయంలో, ముస్లింలు, క్రైస్తవులు, ఇతరులతో సహా OBC, మైనారిటీలు, దళితులు (SC/ST) కోటా తప్పనిసరిగా ఉండాలని. జనాభా లెక్కల ప్రకారం ఈ వర్గాల మహిళలకు కోటాలో తప్పనిసరిగా కల్పించాలని పేర్కొంది. అలాగే సమాజ్ వాదీ పార్టీ సైతం మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వాలంటే అందులో ఓబీసీ, ముస్లిం మహిళలకు కోటా ఉండాలని స్పష్టం చేసింది. 

Published at : 20 Sep 2023 12:08 PM (IST) Tags: CONGRESS Lok Sabha Sonia Gandhi Women's Reservation Bill Parliment Session

ఇవి కూడా చూడండి

Stocks To Watch Today 01 December 2023: ఈ రోజు మార్కెట్‌ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్‌' Flair Writing, UltraTech, Defence stocks

Stocks To Watch Today 01 December 2023: ఈ రోజు మార్కెట్‌ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్‌' Flair Writing, UltraTech, Defence stocks

Gold-Silver Prices Today 01 December 2023: గోల్డ్‌ కొనేవారికి గుడ్‌న్యూస్ - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి

Gold-Silver Prices Today 01 December 2023: గోల్డ్‌ కొనేవారికి గుడ్‌న్యూస్ - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి

Weather Latest Update: తెలుగు రాష్ట్రాల్లో కాస్త తగ్గిన చలి, ఏపీకి మాత్రం వర్ష సూచన!

Weather Latest Update: తెలుగు రాష్ట్రాల్లో కాస్త తగ్గిన చలి, ఏపీకి మాత్రం వర్ష సూచన!

ABP Desam Top 10, 1 December 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

ABP Desam Top 10, 1 December 2023:  ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

LAWCET: లాసెట్‌ సీట్ల కేటాయింపు, తొలి విడతలో 5912 మందికి ప్రవేశాలు

LAWCET: లాసెట్‌ సీట్ల కేటాయింపు, తొలి విడతలో 5912 మందికి ప్రవేశాలు

టాప్ స్టోరీస్

Telangana Elections 2023 : తెలంగాణలో హంగ్ వస్తే బీఆర్ఎస్ పార్టీతో కలిసేదెవరు ? - బీజేపీనా ? మజ్లిస్ పార్టీనా ?

Telangana Elections 2023 :  తెలంగాణలో హంగ్ వస్తే బీఆర్ఎస్ పార్టీతో కలిసేదెవరు ? -  బీజేపీనా ? మజ్లిస్ పార్టీనా ?

Dhootha Web Series Review - దూత రివ్యూ: అమెజాన్‌లో నాగ చైతన్య ఫస్ట్ వెబ్ సిరీస్ - బావుందా? బాలేదా?

Dhootha Web Series Review - దూత రివ్యూ: అమెజాన్‌లో నాగ చైతన్య ఫస్ట్ వెబ్ సిరీస్ - బావుందా? బాలేదా?

Nagarjuna Sagar Dam Issue: నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద మరోసారి ఉద్రిక్తత, జేసీబీలతో చేరుకుంటున్న టీఎస్ పోలీసులు

Nagarjuna Sagar Dam Issue: నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద మరోసారి ఉద్రిక్తత, జేసీబీలతో చేరుకుంటున్న టీఎస్ పోలీసులు

Telangana Exit Poll Results 2023: కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్లకు, కార్యకర్తలకు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి, ఏంటంటే!

Telangana Exit Poll Results 2023: కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్లకు, కార్యకర్తలకు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి, ఏంటంటే!