By: Ram Manohar | Updated at : 26 Apr 2023 03:43 PM (IST)
కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా మైసూరులో ఓ హోటల్‌లో ప్రియాంక గాంధీ దోశలు వేశారు. (Image Credits: Twitter)
Priyanka Gandhi Dosas:
ఎన్నికల ప్రచారంలో..
కర్ణాటకలో క్యాంపెయినింగ్ జోరు మరింత పెరిగింది. బీజేపీ, కాంగ్రెస్ పోటాపోటీ ప్రచారం చేస్తున్నాయి. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ ప్రచారంలో చాలా యాక్టివ్‌గా కనిపిస్తున్నారు. మైసూరులో ర్యాలీ చేసిన ఆమె ఓ హోటల్‌కి వెళ్లారు. టిఫిన్ చేసేసి వస్తారేమో అనుకున్నారంతా. కానీ ఆమె నేరుగా హోటల్‌లోని కిచెన్‌లోకి వెళ్లారు. అక్కడి వాళ్లను పలకరించారు. పక్కనే దోశ పిండి గిన్నె కనబడగానే తన చేతికి పని చెప్పారు. అక్కడి సిబ్బందితో మాట్లాడుతూనే పెనంపై దోశలు వేశారు ప్రియాంక గాంధీ. అట్లకాడ తీసుకుని చాలా నింపాదిగా వాటిని అటూ ఇటూ తిప్పారు. దోశలు రెడీ చేసిన తరవాత హోటల్ ఓనర్‌తో కాసేపు సరదాగా ముచ్చటించారు. వాళ్లందరితో కలిసి సెల్ఫీ కూడా తీసుకున్నారు. ఈ వీడియోని తన ట్విటర్‌లో షేర్ చేశారు ప్రియాంక. దోశలు వేయడాన్ని ఎంతో ఎంజాయ్ చేశానంటూ ట్వీట్ చేశారు.
"మైలారీ హోటల్‌కి వెళ్లి అక్కడ దోశలు వేయడాన్ని చాలా ఎంజాయ్ చేశాను. నిజాయితీ, శ్రమ ఉంటే ఎదుగుతాం అనడానికి ఈ హోటలే ఉదాహరణ. ఇంత మంచి ఆతిథ్యం ఇచ్చినందుకు హోటల్ ఓనర్‌కి చాలా థాంక్స్. దోశలు చాలా రుచిగా ఉన్నాయి. నా కూతురుని కూడా ఇక్కడికి తీసుకొచ్చి దోశలు తినిపిస్తాను"
- ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ
Enjoyed making dosas with the legendary Myalri Hotel owners this morning….what a shining example of honest, hard work and enterprise.
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) April 26, 2023
Thank you for your gracious hospitality.
The dosas were delicious too…can’t wait to bring my daughter to Mysuru to try them. pic.twitter.com/S260BMEHY7
ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సరదాగా మాట్లాడారు. తనకు ఇష్టమైన వంటలేంటో చెప్పిన రాహుల్ ఫేవరేట్ కుక్ ఎవరన్నదీ రివీల్ చేశారు. 'Khaane Mein Kya Hai' అనే యూట్యూబ్ ఛానల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చారు. బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ చాలా బాగా వంట చేస్తారని ఇంట్రెస్టింగ్ విషయం చెప్పారు రాహుల్. కానీ తన అమ్మ వండిన వంటలే తనకు ఎంతో నచ్చుతాయని అన్నారు.
"ఫుడ్ అంటే నాకెంతో ఇష్టం. లాలూ ప్రసాద్ యాదవ్ చాలా బాగా వంట చేస్తారు. కానీ మా అమ్మ చేసిన వంటకు ఏదీ సాటి రాదు. మా అమ్మ వంట ప్రియాంకకు నచ్చదు. అయినా సరే వంటల్లో మా అమ్మే నంబర్ వన్. సెకండ్ ర్యాంక్ ప్రియాంకకు ఇచ్చేస్తాను. ఉదయమే కాఫీ తాగుతాను. కేవలం రాత్రి పూట మాత్రమే టీ తాగుతాను. ఫ్రెంచ్ డిసర్ట్స్ కన్నా నాకు మన ఇండియన్ స్వీట్స్ అంటేనే చాలా ఇష్టం. స్పైసీ ఫుడ్ చాలా తక్కువే తింటాను"
- రాహుల్ గాంధీ
Also Read: Bengaluru: ర్యాపిడో డ్రైవర్ లైంగిక వేధింపులు, బైక్‌పై నుంచి దూకేసిన మహిళ
WDCWD: విశాఖపట్నం జిల్లాలో 34 అంగన్‌వాడీ పోస్టులు, వివరాలు ఇలా!
TS WDSC: తెలంగాణ దివ్యాంగుల గురుకులాల్లో 30 ట్రైన్డ్ గ్రాడ్యుయేట్&సెకండరీ గ్రేడ్ బేసిక్ ట్రైన్డ్ టీచర్ పోస్టులు
Gold-Silver Price Today 09 June 2023: రేటు తగ్గిన పసిడి - ఇవాళ బంగారం, వెండి ధరలు ఇవి
Tirupati: 13 ఏళ్ళుగా మరదల్ని ప్రేమిస్తున్న యువకుడు, చివరికి ఉరేసుకొని ఆత్మహత్య
CM Jagan Gudivada Tour: సీఎం జగన్ రేపటి గుడివాడ పర్యటన వాయిదా, ఇక టిడ్కో ఇళ్లు ప్రారంభం 16న!
Sharwanand: సీఎం కేసీఆర్‌ను కలిసిన శర్వానంద్ - వెడ్డింగ్ రిసెప్షన్‌కు ఆహ్వానం
Ambati Rayudu : జగన్ ను కలిసిన అంబటి రాయుడు - వైసీపీలో చేరికకు ముహుర్తం ఖరారైనట్లేనా ?
CM Jagan Review: ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు ఉండాల్సిందే - అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు
Durgam Chinnaiah: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు షాక్! మహిళా కమిషన్ కీలక ఆదేశం