Punjab New CM Oath Ceremony: పంజాబ్ సీఎంగా సోమవారమే చరణ్‌జిత్ ప్రమాణస్వీకారం.. రాహుల్ గాంధీ శుభాకాంక్షలు
పంజాబ్ సీఎంగా సోమవారం ఉదయం 11 గంటలకు చరణ్‌జిత్ సింగ్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయనకు రాహుల్ గాంధీ శుభాకాంక్షలు తెలిపారు.
పంజాబ్ ముఖ్యమంత్రిగా చరణ్‌జిత్ సింగ్ చన్నీ సోమవారణ ప్రమాణస్వీకారం చేయనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమం జరగనున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. ప్రమాణస్వీకారం అనంతరం పీసీసీ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ సహా పార్టీ నేతలతో ప్రెస్ మీట్‌లో మాట్లాడనున్నారు చన్నీ.
రాహుల్ శుభాకాంక్షలు..
పంజాబ్ సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్న చరణ్‌జిత్ సింగ్ చన్నీకి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శుభాకాంక్షలు తెలిపారు.
Congratulations to Shri Charanjit Singh Channi Ji for the new responsibility.
— Rahul Gandhi (@RahulGandhi) September 19, 2021
We must continue to fulfill the promises made to the people of Punjab. Their trust is of paramount importance.
కొత్త బాధ్యతలు స్వీకరించనున్న చరణ్‌జిత్ సింగ్ చన్నీకి నా శుభాకాంక్షలు. పంజాబ్ ప్రజలకు మనం ఇచ్చిన హామీలను తీర్చాలి. వారి నమ్మకమే అన్నిటికంటే మనకు ముఖ్యం.
రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత
గవర్నర్‌తో భేటీ..
నూతన సీఎంగా తన పేరు ప్రకటించిన అనంతరం చన్నీ.. పంజాబ్ గవర్నర్‌ను కలిశారు.
"We have presented our stance, unanimously supported by party MLAs, before the Governor. Oath taking ceremony to take place at 11 am tomorrow," says Punjab CM-designate Charanjit Singh Channi pic.twitter.com/Ksh9YnGYpm
— ANI (@ANI) September 19, 2021
సీఎం పదవిని స్వీకరించేందుకు నాకు మద్దతు తెలిపిన ఎమ్మెల్యేల బలాన్ని గవర్నర్‌కు సమర్పించాం. సోమవారం ఉదయం 11 గంటలకు ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుంది.
#WATCH | Punjab: Supporters of Charanjit Singh Channi celebrate outside his residence at Kharar, SAS Nagar after he became the Punjab CM-designate pic.twitter.com/Yp0z8VJesy
— ANI (@ANI) September 19, 2021