Modi In Loksabha: రాజ్యాంగాన్ని చెరబట్టింది కాంగ్రెస్ పార్టీనే - చరిత్రను తవ్వి కడిగిపారేసిన ప్రధాని మోదీ
Modi Speech: రాజ్యాంగాన్ని ఇష్టం వచ్చినట్లుగా మార్చడమే కాదు .. ఎమర్జెన్సీ విధించి రాజ్యాంగాన్ని కాల రాసింది కూడా కాగ్రెస్ పార్టీనేనని ప్రధాని మోదీ విమర్శించారు. లోక్ సభలో మోదీ ప్రసంగించారు.
PM Modi Slams Gandhi Family: రాజ్యాంగంపై పార్లమెంట్‌లో జరిగిన చర్చలో ప్రధాని మోదీ.. కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. నెహ్రూ హయాంలోనే రాజ్యాంగానికి తూట్లు పొడిచారని .. ఇష్టం వచ్చినట్లుగా ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా సవరణలు చేశారని అన్నారు. ఇందిగాంధీ హయాలంలో రాజ్యాంగాన్ని అవమాన పరుస్తూ..ఎమర్జెన్సీ విధించారని గుర్తు చేశారు. నెహ్రూ దొంగ చాటుగా రాజ్యాంగాన్ని సవరించారని..సొంత రాజ్యాంగాన్ని నడిపారన్నారు. ఎంతో మంది పెద్దలు అలా చేయవద్దని సలహాలు ఇచ్చినా నెహ్రూ వినలేదన్నారు. ఆనాటి కాంగ్రెస్ నేతలు రాజ్యాంగానికి 75 సవరణలు చేశారని గుర్తు చేశారు. 1971లో ఇందిరాగాంధీ.. సుప్రీంకోర్టు అధికారాలను తగ్గించేందుకు ప్రయత్నించారని అన్నారు. ఇందిర ఎన్నికలను రద్దు చేయడంతో ఈ చర్యకు ప్రయత్నించారని.. ప్రజల మద్దతు లేకుండానే గాంధీ కుటుంబం దేశాన్ని పరిపాలించిందని మండిపడ్డారు. ప్రజాస్వామ్యస్ఫూర్తిని కాంగ్రెస్ అర్థం చేసుకోలేదని..మా పాలన చూసి ప్రజలు మూడు సార్లు అధికారం ఇచ్చారన్నారు.
The Nehru-Gandhi family has a long-standing legacy of tampering with the Constitution to suit their political interests.
— Vishnu Vardhan Reddy (@SVishnuReddy) December 14, 2024
What was initiated by Jawaharlal Nehru, strengthened by Indira Gandhi during the Emergency, and carried forward by Rajiv Gandhi, continues with the current… pic.twitter.com/BFEyBb5m0t
కానీ భారత రాజ్యాంగం.. కాంగ్రెస్ పార్టీ , గాంధీ కుటుంబం చేసిన దాడిని తట్టుకుందన్నారు. 75 ఏళ్ల ప్రజాస్వామ్యాన్ని వేడుకగా చేసుకునే క్షణాలివని ప్రజాస్వామ్య పండుగను ఘనంగా జరుపుకుంటున్నామన్నారు. మన రాజ్యాంగం ఎన్నో దేశాలకు స్ఫూర్తిగా నిలిచిందని.. ఎందరో మహానుభావులు కలిసి రాజ్యాంగాన్ని రచించారని గుర్తు చేసారు. ఇలాంటి కీలక సమయంలో పార్లమెంట్‌లో తాను ఉన్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. స్వాతంత్ర్యం సాధించిన సమయంలో భారతదేశ భవిష్యత్‌పై కలిగిన సందేహాలు, సవాళ్లను అధిగమించి.. భారత రాజ్యాంగం మనలను ఇక్కడి వరకు తీసుకువచ్చిందని... ఇది నిజంగా అద్భుత విజయం అని స్పష్టం చేశారు.
రాజ్యాంగ నిర్మాతలతో పాటు.. కోట్లాది మంది భారతీయులకు మోదీ గౌరవ వందనం ప్రకటించారు. మనది అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమే కాదని.. వేలాది సంవత్సరాల ప్రజాస్వామ్య సంప్రదాయాల కారణంగా ప్రజాస్వామ్యానికి తల్లిగా నిలిచిందని ప్రకటించారు. ప్రజల మధ్య ఐకమత్యం దేశాభివృద్ధిలో కీలక పాత్ర షోషిస్తోంని తెలిపారు. భిన్నత్వంలో ఏకత్వం మనదేశ గొప్ప విధానం. బానిస మనస్తత్వంతో ఉన్నవాళ్లు దేశాభివృద్ధికి ఆటంకం కలిగించారు. కొందరు స్వార్థపరుల వల్ల అనేక కష్టాలు పడ్డాం. మన ఐక్యత దెబ్బతీసేందుకు కొందరు విషబీజాలు నాటారన్నారు.
1950లోనే భారతదేశం ప్రజాస్వామ్యం దేశం అవుతుందని నమ్మలేదని ప్రధాని వ్యాఖ్యానించారు. భారతదేశ ప్రజాస్వామ్యం, భారతదేశ గణతంత్రం గతం చాలా గొప్పదన్నారు. దేశాభివృద్ధిలో మహిళల పాత్ర ఎనలేనిదన్నారు. దేశ అధ్యక్షురాలిగా ఆదివాసీ మహిళ ఎన్నికయ్యారని మోదీ గర్వంగా ప్రకటించారు. భారతదేశాన్ని వికసిత్ భారత్‌గా మార్చాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. 75 ఏళ్ల రాజ్యాంగ యాత్ర ఓ గొప్ప ప్రయాణమని అన్నారు.