By: Ram Manohar | Updated at : 28 Dec 2022 03:22 PM (IST)
కాంగ్రెస్ పార్టీ 138వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటోంది. (Image Credits: Congress)
Congress 138th Foundation Day:
138వ వ్యవస్థాపక దినోత్సవం..
138వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటోంది కాంగ్రెస్ పార్టీ. ఈ సందర్భంగా ఢిల్లీలోని కాంగ్రెస్ హెడ్‌క్వార్టర్స్‌ను అందంగా అలంకరించారు. పార్టీ సీనియర్ నేతలంతా ఇక్కడే ఉన్నారు. సోనియా గాంధీ,రాహుల్ గాంధీ నేతృత్వంలో ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సమయంలోనే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండి పడ్డారు. ఇంత జరుగుతున్నా...కేంద్రం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని అన్నారు. "భారతీయ స్ఫూర్తిపైనే కేంద్రం దాడి చేస్తోంది. ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొడుతోంది. రాహుల్ గాంధీ నేతృత్వంలో సాగిన భారత్ జోడో యాత్ర దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌కు పునరుజ్జీవం పోసింది. అందుకే ప్రతిపక్షాలు అలా ఆందోళనకు గురవుతున్నాయి. జోడో యాత్రకు వచ్చిన మద్దతు చూసి వాళ్లు తట్టుకోలేకపోతున్నారు" అని వ్యాఖ్యానించారు ఖర్గే. పదేపదే యాత్రను ఆపేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. 1855లో బాంబే వేదికగా డిసెంబర్ 28న ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఆవిర్భవించింది. దాదాబాయ్ నౌరోజీ, దిన్షా వచా పార్టీని స్థాపించగా...మిగతా కార్యకలాపాలాన్నీ వుమేష్ చంద్ర బెనర్జీ చూసుకున్నారు. 1947లో దేశానికి స్వాతంత్య్రం వచ్చాక INC పార్టీ అతి పెద్ద పార్టీగా అవతరించింది.
कांग्रेस अध्यक्ष @kharge जी ने आज 'कांग्रेस स्थापना दिवस' के अवसर पर दिल्ली स्थित भारतीय राष्ट्रीय कांग्रेस के कार्यालय में श्रीमती सोनिया गांधी जी एवं @RahulGandhi जी सहित कांग्रेस पदाधिकारियों एवं नेतागणों की उपस्थिति में ध्वजारोहण किया। pic.twitter.com/JdhCv8JUAD
— Congress (@INCIndia) December 28, 2022
కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ..
కాంగ్రెస్‌పై బీజేపీ మాటల యుద్ధం కొనసాగిస్తూనే ఉంది. ఆ పార్టీది అవినీతి చరిత్ర అంటూ ఎప్పుడూ మండి పడుతూనే ఉంటుంది. ఇటీవల బీజేపీ మరోసారి కాంగ్రెస్ కుంభకోణాలను ఏకరవు పెడుతోంది. బోఫోర్స్ స్కామ్‌ను మరోసారి తెరపైకి తీసుకొచ్చి విమర్శలు చేసింది. ఆర్మీకి అందించే తుపాకుల విషయంలో అవినీతికి పాల్పడిందని మండి పడింది. తుపాకుల కొనుగోలులో గోల్‌మాల్ జరిగిందని వెల్లడించింది. 1986లో అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ హయాంలో బోఫోర్స్ కుంభకోణం జరిగిందని ట్విటర్‌లో పోస్ట్ చేసింది. అప్పట్లో భారత్ 400 హోవిట్జర్ గన్స్ కొనుగోలు చేసేందుకు రూ.1,437 కోట్లు కేటాయించింది. అయితే...1987లో ఈ కొనుగోలు వ్యవహారంలో అక్రమాలు జరిగాయంటూ పెద్ద ఎత్తున ఆరోపణలొచ్చాయి. సీబీఐ కేసు కూడా నమోదు చేసింది. ఫోర్జరీ కేసు కింద రాజీవ్ గాంధీ సన్నిహితుడైన ఒట్టావియో పై FIR నమోదైంది. పీవీ నరసింహా రావు హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధాన నిందితుడైన ఒట్టావియోను దేశం దాటించిందని ఆరోపించింది. ఆ తరవాత 1999లో సీబీఐ నిందితుడిపై చార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఒట్టావియో తన నేరాన్ని అంగీకరించినట్టు, 7 మిలియన్ డాలర్ల మేర అవినీతి జరిగిందని ఒప్పుకున్నట్టు అందులో పేర్కొంది. దీనిపై బీజేపీ అప్పట్లో కాంగ్రెస్‌పై పోరాటం చేసింది. సుప్రీం కోర్టునీ ఆశ్రయించింది. బోఫోర్స్ కుంభకోణంపై పిటిషన్ దాఖలు చేసింది. భారత్‌కు చెందిన బడా వ్యాపారి ఒట్టావియోకి ఈ డీల్‌లో పెద్ద మొత్తంలో కమిషన్ అందినట్టు ఆరోపణలొచ్చాయి. అయితే...కాంగ్రెస్ మాత్రం ఈ స్కామ్ జరగలేదని వాదించింది. 2004లో సీబీఐ విచారణ జరిపి...రాజీవ్ గాంధీకి క్లీన్ చిట్ ఇచ్చింది.
Also Read: New Year 2023: న్యూ ఇయర్ పార్టీలతో జాగ్రత్త, ఎక్కడ పడితే లిక్కర్ కొనకండి - అధికారుల సూచనలు
Jee Main 2023 answer key: జేఈఈ మెయిన్ సెషన్ 1 ప్రాథమిక కీ విడుదల, అభ్యంతరాలకు అవకాశం!
TSPSC: 'గ్రూప్-4' రాతపరీక్ష తేదీని వెల్లడించిన టీఎస్పీఎస్సీ! ఎగ్జామ్ ఎప్పుడంటే?
TSWRES Inter Admissions: తెలంగాణ గురుకుల సైనిక పాఠశాలలో ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్! పరీక్ష ఎప్పుడంటే?
TSSPDCL Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్- 1601 'కరెంటు' కొలువుల భర్తీకి నోటిఫికేషన్లు
Anganwadi Jobs: వైఎస్సార్ కడప జిల్లాలో 115 అంగన్వాడీ పోస్టులు, వివరాలివే!
Pawan Kalyan Marriages: మూడు పెళ్లిళ్ల వివాదంపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ - చివర్లో బాలకృష్ణ షాకింగ్ కామెంట్స్!
K.Viswanath: చిరంజీవితో విశ్వనాథ్‌కు ప్రత్యేక అనుబంధం - కళా తపస్విని కన్నతండ్రిలా భావించే మెగాస్టార్!
Anil Kumar On Kotamreddy : దమ్ముంటే రాజీనామా చెయ్, కోటంరెడ్డికి అనిల్ కుమార్ సవాల్
K Viswanath Death: టాలీవుడ్‌ను ఖండాంతరాలకు తీసుకు వెళ్ళారు, తీరని లోటు - విశ్వనాథునికి చిరంజీవి, ఎన్టీఆర్, మమ్ముట్టి నివాళులు