CM Mamata Banerjee: '2024 ఎన్నికల్లో మోదీపై సమష్టిగా పోరాడతాం- నితీశ్‌తో కలిసే'
CM Mamata Banerjee: రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో విపక్షాలన్నీ ఐకమత్యంగా పోరాడతాయని బంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు.
CM Mamata Banerjee: 2024 సార్వత్రిక ఎన్నికల్లో విపక్ష పార్టీలన్నీ ఐక్యంగా పోరాడతాయని బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. నరేంద్ర మోదీ సారథ్యంలోని భాజపాకు వ్యతిరేకంగా నితీశ్ కుమార్, హేమంత్ సొరెన్ వంటి నేతలతో కలిసి పోరాడతామని దీదీ తేల్చి చెప్పారు.
భయపడరు
రాజకీయ పార్టీల్లో విభేదాలను మీడియా కొండంతలుగా చూపుతుందని దీదీ ఆరోపించారు. గతంలో తనకు అభిషేక్ బెనర్జీ మధ్య విభేదాలున్నాయని కూడా చూపించారని దీదీ అన్నారు. అయితే ఇవేమీ విపక్షాల ఐక్యతను దెబ్బతీయలేవని స్పష్టం చేశారు.
నితీశ్ పోరు
భాజపాతో సంబంధాలు తెంచుకున్న తర్వాత నితీశ్ కుమార్ పలువురు విపక్ష నేతలతో సమావేశమవుతున్నారు. దిల్లీలో పర్యటించిన నితీశ్ కుమార్.. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో సమావేశమయ్యారు. ఆ తర్వాత సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. తొలుత కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని కలిసిన నితీశ్ ఆ మరుసటి రోజే సీతారాం ఏచూరితో భేటీ అయ్యారు.
ప్రతిపక్షాల ఉమ్మడి ప్రధానమంత్రి అభ్యర్థిగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో నితీశ్ కుమార్ నిలిచే అవకాశం ఉందని వార్తలు వస్తుండటంతో ఆయన ఈ మేరకు స్పందించారు.
Also Read: Viral News: ఏ నిమిషానికి ఏమి జరుగునో- స్టేజ్‌పై డ్యాన్స్ చేస్తూ హార్ట్ ఎటాక్!
Also Read: Vietnam Fire Accident: బార్‌లో చెలరేగిన మంటలు- 33 మంది సజీవదహనం!