Chinese Woman Arrested: నకిలీ ఐడీతో భారత్‌లో చైనా మహిళలు, సాధ్వి వేషంలో జాతి వ్యతిరేక కార్యకలాపాలు?
Chinese Woman Arrested: భారత్‌లోకి నకిలీ ఐడీతో నివాసం ఉంటున్న ఇద్దరు చైనా మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు.
Chinese Woman Arrested:
అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు..
నకిలీ ఐడీతో భారత్‌లో అక్రమంగా ఉంటున్న ఇద్దరి చైనా మహిళలను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే అనుమానంతో అరెస్ట్ చేసినట్టు వెల్లడించారు. ఈ ఇద్దరు మహిళలు చైనాలోని హైనాన్ ప్రావిన్స్‌కు చెందిన వాళ్లుగా గుర్తించారు. ఇద్దరూ బౌద్ధ సాద్విణి వేషధారణలో ఉన్నారు. నార్త్ ఢిల్లీలోని మజ్నూ కా తిలా ప్రాంతంలో ఒకరిని అరెస్ట్ చేశారు. టిబెటన్ శరణార్థుల కాలనీగా పాపులర్ అయిన ఈ ప్రాంతం...ఢిల్లీ యూనివర్సిటీకి సమీపంలో ఉంటుంది. అయితే..వెరిఫికేషన్‌లో భాగంగా...నేపాల్ పౌరసత్వం ఉన్న ఓ సర్టిఫికెట్‌ను ఓ మహిళ నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనుమానం వచ్చి Foreigners Regional Registration Officeలో ఆరా తీయగా...ఆమె చైనా పౌరురాలు అని తేలింది. 2019లోనే ఆమె భారత్‌కు వచ్చినట్టు నిర్ధరణైంది. సెక్షన్ 120B కింద ఆమెపై కేసు నమోదు చేశారు. 419, 420, 467 సెక్షన్ల కిందా కేసు నమోదు చేశారు.
Delhi | A Chinese woman, Cai Ruo arrested for alleged involvement in anti-national activities. One Nepali citizenship certificate in the name of Dolma Lama recovered from her. However, it was found that she's Chinese&travelled to India in '19 on Chinese passport. Case registered.
— ANI (@ANI) October 20, 2022
Delhi Police has arrested a Chinese woman, Cai Ruo arrested for alleged involvement in anti-national activities. A case has been registered under section 120B read with 419/420/467/474 IPC and 14 Foreigners Act at PS Special Cell: Delhi Police
— ANI (@ANI) October 20, 2022
ప్రాణాల మీదకు..
అక్రమంగా వేరే దేశంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించి గతంలో కొందరు ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. యూఎస్ కెనడా సరిహద్దుల్లో ఈ విషాదం చోటు చేసుకుంది. అక్రమంగా సరిహద్దులు దాటుతూ ఓ ఫ్యామిలీ బలైపోయింది. అతి శీతల వాతావరణం ఆ కుటుంబాన్ని బలి తీసుకుంది. ఎమర్సన్ సమీపంలో యూఎస్-కెనడా సరిహద్దుల్లో ఈ దుర్ఘటన జరిగింది. మైనస్ 35 డిగ్రీల చలిలో ఆ భారతీయ ఫ్యామిలీ గడ్డకట్టుకుపోయి మృతి చెందింది. చనిపోయినవారిలో భార్య, భర్త, ఓ టీనేజర్, నవజాత శిశువు ఉన్నారు. కెనడా సరిహద్దు దాటి యూఎస్‌లో ప్రవేశించిన మరికొందర్ని యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ విభాగం పట్టుకుంది. పట్టుకున్నవారిలో ఒకరి వద్ద నవజాత శిశువుకు
సంబంధించిన ఆహారం, డైపర్లు, ఇతర వస్తువులు ఉన్నాయి.
Also Read: Nitish Kumar On Prashant Kishor: 'ఆయనకు కుర్రతనం ఇంకా పోలేదు'- పీకేకు సీఎం నితీశ్ కుమార్ కౌంటర్