Galwan Valley Clash: 'చైనా అబద్ధం చెప్పింది.. గల్వాన్ ఘర్షణలో వారి సైనికుల మరణాలు 9 రెట్లు ఎక్కువ'

భారత్- చైనా మధ్య జరిగిన గల్వాన్ ఘర్షణలో డ్రాగన్ సైన్యంలో జరిగిన ప్రాణ నష్టం అధికారిక లెక్కల కంటే 9 రెట్లు ఎక్కువని తాజాగా ఓ వార్తాపత్రిక వెల్లడించింది.

FOLLOW US: 

2020లో చైనా- భారత్ జవాన్ల మధ్య జరిగిన గల్వాన్ ఘర్షణపై తాజాగా షాకింగ్ విషయాలు బయటపెట్టింది ఆస్ట్రేలియాకు చెందిన ఓ పత్రిక. ఆ ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన చైనా సైనికుల సంఖ్య డ్రాగన్ ప్రభుత్వం చెప్పిన అధికారిక లెక్కల కంటే తొమ్మిది రెట్లు ఎక్కువని తేల్చింది. ఆస్ట్రేలియాకు చెందిన ఇన్వెస్టిగేటివ్ న్యూస్ పేపర్ క్లాక్సన్ ఈ నివేదికను ప్రచురించింది.

నలుగురే..

గల్వాన్ ఘర్షణ జరిగిన దాదాపు ఎనిమిది నెలల తర్వాత అంటే 2021 ఫిబ్రవరిలో చైనా ప్రభుత్వం చనిపోయిన నలుగురు జవాన్లకు మెడల్స్ ప్రకటించింది. ఈ నలుగురే గల్వాన్ ఘర్షణలో చనిపోయారని చెప్పుకొచ్చింది. కానీ ఈ పరిశోధాత్మక వార్తా పత్రిక కథనం ప్రకారం.. ఆ రోజు గల్వాన్ ఘర్షణలో చాలా మంది చైనా జవాన్లు.. చీకట్లో సబ్ జీరో నది దాటుతూ అందులో మునిగిపోయి చనిపోయారని తేలింది. ఈ ఘటనపై చైనా అంతర్గతంగా తీవ్రంగా చర్చించినట్లు కూడా కథనం పేర్కొంది.

గల్వాన్ ఘర్షణ..

లద్దాఖ్‌లోని గల్వాన్ లోయలో 2020 జూన్ 15న భారత్- చైనా దేశాల మధ్య ఒక్కసారిగా ఘర్షణలు జరిగాయి. రెండు దేశాల సైనికులు భౌతిక దాడులకు పాల్పడ్డారు. లద్దాఖ్‌లోని ప్యాంగ్యాంగ్ సొ సరస్సు వద్ద ఈ ఘర్షణలు జరిగాయి. అయితే, దీనికి నెల రోజుల ముందు నుంచే ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు మొదలయ్యాయి. ఈ క్రమంలో 2020 మే 21న భారత సైన్యం సరిహద్దులు దాటుతోందని చైనా విదేశాంగ శాఖ ఆరోపించింది. దీనిపై భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ కూడా స్పందించారు. రోజువారీగా భారత్ చేపట్టే గస్తీ విధులకు చైనా సైన్యమే అడ్డు తగిలిందని అనురాగ్ చెప్పారు.

2020 జూన్ 6న లద్దాఖ్‌లో భారత్, చైనా దౌత్యవేత్తలు, సైనిక కమాండర్లు ఈ విషయంపై చర్చలు జరిపారు. ఆ తర్వాత పలు దఫాలుగా సంప్రదింపులు జరిగాయి. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించేందుకు రెండు దేశాలు సంసిద్ధత వ్యక్తం చేశాయి. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యితో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ చర్చలు జరిపారు.

ఇదిలా ఉండగానే లద్దాఖ్‌లోని ప్యాంగ్యాంగ్ సొ సరస్సు వద్ద రెండు దేశాల సైనికుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ విషయాన్ని 2020 జూన్ 16న భారత సైన్యం అధికారికంగా ప్రకటించింది. జూన్ 15న విధ్వంసకర ఘర్షణలు జరిగాయి. రెండు వైపులా మరణాలు నమోదైనట్లు భారత్ తెలిపింది. 

చైనా వైపు 45 మందికిపైగా మరణించారని భారత ప్రభుత్వం అప్పుడే చెప్పింది. కానీ చైనా దీనిని బుకాయించింది.

Also Read: India Corona Cases: భారత్‌లో మళ్లీ పెరిగిన పాజిటివ్ కేసులు.. తాజాగా 1,72,433 మందికి కరోనా

Published at : 03 Feb 2022 12:27 PM (IST) Tags: china Indian Army Line of Actual Control India China standoff PLA Galwan Valley Beijing Galwan Valley Clash klaxon

సంబంధిత కథనాలు

UIDAI Update: మాస్క్‌ ఆధార్‌ వినియోగంపై కేంద్రం వెనక్కి! తప్పుగా అర్థం చేసుకున్నారని వివరణ

UIDAI Update: మాస్క్‌ ఆధార్‌ వినియోగంపై కేంద్రం వెనక్కి! తప్పుగా అర్థం చేసుకున్నారని వివరణ

Family Kidnap : అప్పు తీసుకున్నందుకు కుటుంబాన్నే కిడ్నాప్, గ్రామస్తుల ఎంట్రీతో సీన్ రివర్స్!

Family Kidnap : అప్పు తీసుకున్నందుకు కుటుంబాన్నే కిడ్నాప్, గ్రామస్తుల ఎంట్రీతో సీన్ రివర్స్!

Nellore Govt Hospitals : నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందని సేవలు, అడుగడుగునా సిబ్బంది నిర్లక్ష్యం!

Nellore Govt Hospitals : నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందని సేవలు, అడుగడుగునా సిబ్బంది నిర్లక్ష్యం!

Southwest Monsoon : కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు, మరో వారంలో తెలుగు రాష్ట్రాలకు

Southwest Monsoon : కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు, మరో వారంలో తెలుగు రాష్ట్రాలకు

Drone Shot Down: అమర్‌నాథ్ యాత్రపై ఉగ్ర కుట్ర, బాంబులతో వచ్చిన డ్రోన్‌ను కూల్చేసిన సైన్యం

Drone Shot Down: అమర్‌నాథ్ యాత్రపై ఉగ్ర కుట్ర, బాంబులతో వచ్చిన డ్రోన్‌ను కూల్చేసిన సైన్యం

టాప్ స్టోరీస్

Infinix Note 12 Flipkart Sale: ఇన్‌ఫీనిక్స్ నోట్ 12 సేల్ ప్రారంభం - అదిరిపోయే ఫీచర్లు - ఎలా ఉందో చూశారా?

Infinix Note 12 Flipkart Sale: ఇన్‌ఫీనిక్స్ నోట్ 12 సేల్ ప్రారంభం - అదిరిపోయే ఫీచర్లు - ఎలా ఉందో చూశారా?

The Conjuring House: ‘ది కంజూరింగ్’ హౌస్, ఆ దెయ్యాల కొంపను రూ.11 కోట్లకు అమ్మేశారు, చరిత్ర తెలిస్తే షాకవుతారు!

The Conjuring House: ‘ది కంజూరింగ్’ హౌస్, ఆ దెయ్యాల కొంపను రూ.11 కోట్లకు అమ్మేశారు, చరిత్ర తెలిస్తే షాకవుతారు!

F3 Movie OTT Release: 'ఎఫ్3' ఓటీటీ రిలీజ్ అప్డేట్ - స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడ?

F3 Movie OTT Release: 'ఎఫ్3' ఓటీటీ రిలీజ్ అప్డేట్ - స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడ?

Allu Sirish: ముంబైలో అల్లు శిరీష్ - ఏం చేస్తున్నాడంటే?

Allu Sirish: ముంబైలో అల్లు శిరీష్ - ఏం చేస్తున్నాడంటే?