(Source: ECI/ABP News/ABP Majha)
Chhattisgarh CM Update: 'నాన్న.. ఓ తండ్రిగా నిన్ను గౌరవిస్తా.. కానీ సీఎంగా మాత్రం క్షమించను'
ఛత్తీస్గఢ్ సీఎం భూపేశ్ బఘేల్ తండ్రి నందకుమార్ బఘేల్ అరెస్టయ్యారు. ఓ సామాజిక వర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ తండ్రి నంద్ కుమార్ బఘేల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. బ్రాహ్మణ సమాజంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా ఆయనపై కేసు నమోదైంది. నంద్ కుమార్ ను కోర్టులో హాజరుపర్చగా.. 15 రోజుల కస్టడీ విధించింది న్యాయస్థానం.
Chhattisgarh CM Bhupesh Baghel's father Nand Kumar Baghel who has been arrested over his alleged derogatory remarks against Brahmins is being produced before a court in Raipur. pic.twitter.com/i2GAJaF066
— ANI (@ANI) September 7, 2021
సెప్టెంబర్ 21న ఆయన్ను తిరిగి కోర్టులో హాజరుపర్చనున్నారు. అయితే బెయిల్ తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ ఇందుకు నంద్ కుమార్ నిరాకరించినట్లు ఆయన తరుఫు న్యాయవాది తెలిపారు.
Chhattisgarh CM Bhupesh Baghel's father Nand Kumar Baghel arrested, produced before a court in Raipur over his alleged derogatory remarks against Brahmins
— ANI (@ANI) September 7, 2021
ఉత్తర్ ప్రదేశ్ లో జరిగిన ఓ కార్యక్రమంలో నంద్ కుమార్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
తప్పు చేస్తే అంతే..
అయితే ఈ అంశంపై అంతుకుముందే ఛత్తీస్ గఢ్ సీఎం స్పందించారు.
చట్టం ముందు అందరూ సమానమేనని.. ఒకవేళ నా తండ్రి తప్పు చేశారని రుజువైతే శిక్ష అనుభవించాల్సిందేనని బఘేల్ అన్నారు.