Plane Catches Fire : విమానం ల్యాండ్ అవుతుండగా రన్ వేపై మంటలు.. ఎయిర్ పోర్ట్ క్లోజ్
Plane Catches Fire : ఎయిర్ కెనడా విమానం ల్యాండింగ్ సమయంలో రన్‌వేపై నుండి పడిపోయింది. దీంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటనతో హాలిఫాక్స్‌లోని విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు.
Plane Catches Fire : పలు దేశాల్లో చోటుచేసుకుంటున్న విమాన ప్రమాదాలు భయాందోళనలు కలిగిస్తున్నాయి. ఇటీవలే కజకిస్థాన్, సౌత్ కొరియాలో విమాన ప్రమాదాలను మరువకముందే తాజాగా మరో ప్రమాదం జరిగింది. కెనడాలోని హలిఫాక్స్ విమానాశ్రయంలో ఎయిర్ కెనడా విమానం ల్యాండింగ్ గేర్ విఫలమై అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఈ సమయంలో విమానం రన్ వేపై అదుపు తప్పింది. దీంతో విమానం విమానం రెక్క రన్ వేకు రాసుకుని పోయి.. మంటలు చెలరేగాయి.
వెంటనే స్పందించిన ఎమర్జెన్సీ బృందాలు పరిస్థితిని అదుపులోకి తెచ్చాయి. మంటలను ఆర్పేశాయి. దీంతో ప్రాణ నష్టం తప్పింది. ప్రయాణికులు క్షేమంగా ఈ ప్రమాదం నుంచి బయటపడ్డాయి. విమానం ల్యాండ్ కాగానే పెద్ద శబ్ధం వచ్చిందని, చాలా భయపడ్డామని ఓ ప్రయాణికుడు తెలిపారు. తృటిలో తప్పిన ఈ ప్రమాదంతో విమాన సిబ్బంది, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
విమానం సెయింట్ జాన్స్ నుండి వస్తుండగా, ల్యాండింగ్ సమయంలో సమస్య తలెత్తిందని అధికారులు తెలిపారు. విమానం రన్‌వే నుండి పక్కకు వెళ్లి అందులో కొంత భాగం మంటల్లో చిక్కుకోవడంతో కెనడాలోని హాలిఫాక్స్ విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. ప్రయాణీకులలో ఒకరైన నికి వాలెంటైన్ ప్రకారం, విమానం ల్యాండింగ్ సమయంలో టైర్లలో ఒకటి సరిగ్గా పనిచేయలేదు.
🚨🇨🇦 BREAKING: AIR CANADA FLIGHT LANDS WITH BROKEN LANDING GEAR IN HALIFAX, MINOR INJURIES REPORTED
— Mario Nawfal (@MarioNawfal) December 29, 2024
An Air Canada flight reportedly made an emergency landing at Halifax airport after its landing gear failed.
Despite the malfunction, only minor injuries were reported among… pic.twitter.com/HCtnrwzg9p
విమానంలో ఎంతమంది ఉన్నారన్న విషయాన్ని విమానాశ్రయం పేర్కొనలేదు. దాదాపు 20 వరుసల సీట్లు, నడవకు ఇరువైపులా ఒక జత సీట్లతో విమానం సామర్థ్యం దాదాపు 80 మంది ప్రయాణీకులను కలిగి ఉంటుందని వాలెంటైన్ అంచనా వేశారు. అన్ని సీట్లలోనూ ప్రయాణికులు ఉన్నారు. దీంతో ప్రతి ఒక్కరినీ విమానం నుంచి దింపడానికి రెండు నిమిషాల వరకు పట్టింది. ప్రయాణీకులకు ప్రాణహాని కలిగించే గాయాలు కాలేదని సమాచారం.
మరో ప్రమాదం
నార్వేలో కూడా విమాన ప్రమాదం చోటుచేసుకుంది. రాయల్ డచ్‌కు చెందిన ఓ విమానం టోర్ప్ ఎయిర్‌పోర్టులోని రన్‌వేపై అదుపు తప్పింది. టేకాఫ్ అవుతున్న సమయంలోనే హైడ్రాలిక్ ఫెయిల్యూర్ కావడంతో విమానం అదుపు తప్పినట్లు సమాచారం. ఈ ప్రమాదం జరిగిన సమయంలో మొత్తం 182 మంది ప్రయాణికులు ఉన్నారు. ఆ విమానం గడ్డి మీద ల్యాండ్ కావడంతో పెను ప్రమాదం తప్పింది.
విమాన ప్రమాదంలో 179 మంది మృతి
దక్షిణ కొరియాలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. యువాన్ ఎయిర్ పోర్టులో రన్‌వే మీద అదుపుతప్పిన విమానం గోడను ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. విమానంలో మొత్తం 181 మంది ఉన్నారు. వారిలో 175 మంది ప్రయాణికులు కాగా, ఆరుగురు విమాన సిబ్బంది ఉన్నారని యోన్హాప్ రిపోర్ట్ చేసింది. ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కొన్ని రిపోర్టుల ప్రకారం 179 మంది మృతిచెందారని సమాచారం.
Also Read : South Korea Plane Crash: ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, మంటలు చెలరేగి 85 మంది మృతి