Bride calls off marriage:పెళ్లి వేడుకలో కేకు ముఖానికి పూశాడని విడాకులు - ఈ వధువు చాలా స్ట్రాంగ్!
wedding day: పెళ్లి వేడుకల్లో కేక్ ఒకరికొకరు కేక్ తినిపించుకోవడం ఆనవాయితీ. కానీ, ఆ వరుడు కేక్ కట్ చేసిన వెంటనే ఆమె ముఖాన్ని పట్టుకుని బలవంతంగా కేక్ లోకి నొక్కేశాడు. చివరికి విడాకులు తీసుకున్నాడు.

Bride calls off marriage over cake: పెళ్లి అంటే నూరేళ్ల పంట.. రెండు మనసుల కలయిక. కానీ, ఆ కలయిక అడుగు కూడా పడకముందే విడిపోతే? అది కూడా కేవలం ఒక కేక్ ముక్క వల్ల అంటే నమ్మశక్యంగా లేదు కదా! వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, ఒక భర్త చేసిన అతి తెలివి పనికి, ఒక వధువు తన వివాహ బంధానికి అక్కడికక్కడే విడాకులు ఇచ్చేసింది.
కేక్ తినిపించమంటే.. ముఖానికి కొట్టాడు!
సాధారణంగా పెళ్లి వేడుకల్లో కేక్ కటింగ్ తర్వాత దంపతులు ఒకరికొకరు కేక్ తినిపించుకోవడం ఆనవాయితీ. అయితే, ఈ వధువుకు ఒక చిన్న భయం ఉంది.. తన మేకప్ పాడవుతుందని, అలాగే తన ముఖానికి కేక్ పూయడం తనకు ఇష్టం ఉండదని పెళ్లికి ముందే భర్తకు స్పష్టంగా చెప్పింది. కానీ, ఆ వరుడు మాత్రం సరదా పేరుతో హద్దులు దాటాడు. కేక్ కట్ చేసిన వెంటనే ఆమె ముఖాన్ని పట్టుకుని బలవంతంగా కేక్ లోకి నొక్కేశాడు.
ఒక్క క్షణంలో ముక్కలైన నమ్మకం
తన ఇష్టాన్ని గౌరవించకుండా, అందరి ముందు తనను అవమానించిన భర్త తీరుతో ఆ వధువు షాక్‌కు గురైంది. ఇది కేవలం ఒక సరదా కాదని, తన అభిప్రాయానికి విలువ ఇవ్వని వ్యక్తితో జీవితాంతం కలిసి ఉండలేనని ఆమె నిశ్చయించుకుంది. క్రిస్మస్ ముందు జరిగిన ఈ పెళ్లికి, జనవరి కల్లా ముగింపు పలకాలని నిర్ణయించుకుని విడాకులకు అప్లై చేసింది. ప్రియుడిగా ఉన్నప్పటి నుండి తన ఇష్టాయిష్టాలు తెలిసినా, కావాలనే ఇలా చేయడం ఆమెను మరింత కుంగదీసింది.
ప్లాన్ ప్రకారమే చేశాడా?
విచారకరమైన విషయం ఏమిటంటే, ఆ వరుడు ఈ పనిని కావాలనే ప్లాన్ చేసి చేసినట్లు తేలింది. అతిథుల కోసం విడిగా కప్‌కేక్స్ ఆర్డర్ ఇచ్చి, కేవలం వధువు ముఖానికి పూయడానికే ఒక పెద్ద కేక్‌ను సిద్ధం చేసుకున్నాడట. తన భార్య మాటను బేఖాతరు చేస్తూ, తన పైశాచిక ఆనందం కోసం ఆమె ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాడు.
కుటుంబ సభ్యుల ఒత్తిడి
చిన్న విషయానికే ఇంత రచ్చా? విడాకులు వద్దు.. సర్దుకుపో అని ఆమె కుటుంబ సభ్యులు ఒత్తిడి తెచ్చారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఆమెకు భారీ మద్దతు లభిస్తోంది. తొలి అడుగులోనే నీ గౌరవాన్ని కాపాడలేని వ్యక్తి, రేపు నీ జీవితాన్ని ఎలా కాపాడతాడు అంటూ నెటిజన్లు ఆమె నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. భార్యాభర్తల మధ్య ఉండాల్సింది కేవలం ప్రేమ మాత్రమే కాదు, పరస్పర గౌరవం కూడా అని ఈ ఘటన నిరూపిస్తోంది.
ట్రెండింగ్ వార్తలు




















