Boycott Flipkart Trending: ట్రెండింగ్‌లో బాయ్‌కాట్ ఫ్లిప్‌కార్ట్ హ్యాష్‌ట్యాగ్, చీప్ ట్రిక్స్ ఆపాలంటున్న నెటిజన్లు-ఏమైందంటే?
Boycott Flipkart Trending: సుశాంత్ సింగ్ ఫోటోకి డిప్రెషన్ కొటేషన్ యాడ్ చేసి ఆ టీ షర్ట్‌లను ఫ్లిప్‌కార్ట్ విక్రయిస్తోంది. దీనిపై నెటిజన్లు మండి పడుతున్నారు.
Boycott Flipkart Trending:
ఇలాంటి పని చేసినందుకు ఫ్లిప్‌కార్ట్ సిగ్గుపడాలి-నెటిజన్లు
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ మరణంపై మిస్టరీ ఇంకా కొనసాగుతూనే ఉంది. తీవ్ర ఒత్తిడితోనే ఆత్మహత్య చేసుకున్నాడన్నది పోలీసులు ప్రాథమికంగా నిర్ధరించిన విషయం. ఎందుకంత డిప్రెషన్‌కు గురయ్యాడన్న చర్చ నడుస్తుండగానే, ఫ్లిప్‌కార్ట్ ఓ పని చేసి వివాదాల్లో చిక్కుకుంది. సుశాంత్ రాజ్‌పూత్ సింగ్ ఫోటో ఉన్న టి-షర్ట్‌లు విక్రయిస్తోంది. ఇందులో వివాదం ఏముంది అంటారా..? ఆ ఫోటోతో పాటు ప్రింట్ చేసిన కొటేషన్‌తోనే వచ్చింది ఇబ్బంది. "Depression Like Drowning" అనే సుశాంత్ సింగ్ కొటేషన్‌ను యాడ్ చేసింది. ఇదే కాంట్రవర్సీకి తెర తీసింది.ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోటోని చూసిన సుశాంత్ సింగ్ అభిమాని, ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. దానికి బాయ్‌కాట్ ఫ్లిప్‌కార్ట్ హ్యాష్‌ట్యాగ్ పెట్టాడు. అప్పటి నుంచి ఈ హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అయిపోయింది. ఫ్లిప్‌కార్ట్‌పై నెటిజన్లందరూ తిట్ల వర్షం కురిపిస్తున్నారు. "చనిపోయిన వ్యక్తి ఫోటోను టీ షర్ట్‌పై పెట్టడమే కాకుండా, అలాంటి కోట్‌ను యాడ్ చేస్తారా" ఓ నెటిజన్ తీవ్రంగా మండిపడ్డాడు. "సుశాంత్ మృతి చెందాడన్న షాక్‌లో నుంచే ఇంకా తేరుకోలేదు. న్యాయం కోసం మేం పోరాటం చేస్తూనే ఉన్నాం. ఇలాంటి పని చేసినందుకు ఫ్లిప్‌కార్ట్ సిగ్గుపడాలి. ఇంకోసారి ఇలాంటి పనులు చేయకుండా చర్యలు తీసుకోవాలి. బాయ్‌కాట్ ఫ్లిప్‌కార్ట్" అంటూ మరో నెటిజన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
Now what’s this nonsense @Flipkart ????
— Dev singh Rajpoot (@Devsing57501724) July 27, 2022
Dragging a dead soul n labelling d specific pic as “Depression”!!! 😡🤬
What kind of cheap marketing is this ???#BoycottFlipkart#HumanityFirst pic.twitter.com/j5I4B0UdBo
Now what’s this nonsense Flipcart????
— Kõêl Śîñhä 🚩🇮🇳 (@cocoapiie) July 26, 2022
Dragging a dead soul n labelling d specific pic as “Depression”!!! 😡🤬
What kind of cheap marketing is this ???#BoycottFlipkart#HumanityFirst pic.twitter.com/lJMSbHrDEe
Soulless creatures trying to mint money at other person's suffering.. Disgusting @Flipkart @flipkartsupport Can you remove this hurtful product from your platform. #BoycottFlipkart https://t.co/dNzrSuELI8
— Vandana - #CBIforPalghar (@iamwhat31702379) July 26, 2022
సుశాంత్ కాలేజ్ ఫ్రెండ్ విశాద్ దూబే కూడా ఈ వివాదంపై స్పందించాడు. "కఠిన పరిస్థితుల్లోనూ సుశాంత్ తన కలలు నెరవేర్చుకోవాలన్న తపనను పక్కన పెట్టలేదు. అతని గౌ రవాన్ని కాపాడాల్సిన బాధ్యత మనపైనే ఉంది. ఇలాంటివి క్రియేట్ చేసి లాభపడాలనుకోవటం ఏ మాత్రం కరెక్ట్ కాదు. నెగటివిటీని ఆపండి. సుశాంత్ సింగ్ ఎప్పటికీ మాకు స్ఫూర్తినిస్తూనే ఉంటాడు" అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.