Mithun Chakraborty On TMC: బంగాల్ రాజకీయంలో 'గోపాల గోపాల'- BJPతో టచ్‌లో 38 మంది TMC ఎమ్మెల్యేలు!
Mithun Chakraborty On TMC: తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన 38 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని భాజపా నేత మిథున్ చక్రవర్తి అన్నారు.
Mithun Chakraborty On TMC: యాక్టర్, భాజపా నేత మిథున్ చక్రవర్తి సంచలన వ్యాఖ్యలు చేసారు. తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన 38 మంది ఎమ్మెల్యేలు భాజపాతో టచ్‌లో ఉన్నారని బ్రేకింగ్ న్యూస్ ఇచ్చారు. అందులో 21 మంది అయితే నేరుగా భాజపాతో సంప్రదింపులు జరుపుతున్నట్లు పేర్కొన్నారు.
#WATCH | West Bengal: Do you want to hear breaking news? At this moment, 38 TMC MLAs have very good relations with us, out of which 21 are in direct (contact with us): BJP leader Mithun Chakraborty in Kolkata pic.twitter.com/1AI7kB4H5I
— ANI (@ANI) July 27, 2022
ఈ మేరకు అని ఏఎన్ఐ వార్తా సంస్థతో మిథున్ చెప్పారు. గత ఏడాది బంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు సువేందు అధికారితో సహా పలువురు టీఎంసీ నేతలు ఆ పార్టీని విడిచిపెట్టి భాజపాలో చేరారు. అయితే ఎన్నికల్లో మమతాబెనర్జీ సారథ్యంలోని టీఎంసీ అఖండ విజయం సాధించడంతో కొందరు నేతలు మళ్లీ సొంత గూటికి చేరుకున్నారు.
దీదీ ఫైర్
ప్రధాని నరేంద్ర మోదీపై బంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇటీవల ఫైర్ అయ్యారు. వరుసగా విపక్షాల ప్రభుత్వాలను కూల్చడమే మోదీ పనిగా పెట్టుకున్నారని దీదీ ఆరోపించారు. 2024 పార్లమెంటు ఎన్నికల్లో భాజపా ప్రభుత్వం కూలక తప్పదని జోస్యం చెప్పారు. కోల్‌కతాలో జరిగిన అమరవీరుల దినోత్సవం కార్యక్రమంలో దీదీ ఈ మేరకు మాట్లాడారు.
" మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని కూల్చి అధికారంలోకి వచ్చారు. మీరు ముంబయిని విడగొట్టామని భావిస్తున్నారు. తర్వాత ఛత్తీస్‌గఢ్‌ను పడగొడతారు. ఆ తర్వాత బంగాల్ వస్తారు. ఇక్కడికి రావొద్దని నేను హెచ్చరిస్తున్నా. ఇక్కడ రాయల్ బెంగాల్ టైగర్ ఉంది. "
Also Read: Spicejet Flight: స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్స్‌పై DGCA సీరియస్- కీలక ఆదేశాలు
Also Read: National Herald case: 3 రోజులు, 100 ప్రశ్నలు- ముగిసిన సోనియా గాంధీ ఈడీ విచారణ