Bihar : బతికే ఉన్న భార్య హత్య కేసులో నాలుగేళ్లుగా జైల్లో భర్త - ఈ వింత బీహార్‌లో !
Viral News: భార్యను చంపేసిన కేసులో నాలుగేళ్లుగా జైల్లో ఉన్నాడు ఓ భర్త. కానీ ఆ భార్య బతికే ఉందని తెలిసే సరికి నాలుగేళ్లు పట్టింది.
Bihar Man Spends 4 Years In Jail For Wifes Murder Turns Out She Is Still Alive : బీహార్‌లోని అరా అనే గ్రామంలో ఓ రైల్వే ట్రాక్ దగ్గర ఓ గుర్తు తెలియని మహిళ మృతదేహం కనిపించింది. అది తన కుమార్తేదేనని ఓ తండ్రి వచ్చి బోరుమన్నారు. ఆమె భర్త చంపేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ మృతదేహం కోసం ఎవరూ రాకపోవడంతో చివరికి ఆ మృతదేహం ఆయన కూతురిదేనని తేల్చి .. హత్య కేసులో అల్లుడ్ని అరెస్టు చేసి జైలుకు పంపారు. నాలుగేళ్ల నుంచి ఆ వ్యక్తి జైల్లోనే ఉన్నాడు.
నాలుగేళ్ల తర్వాత చనిపోయిదనుకున్న ఆ వ్యక్తి భార్య బతికే ఉందని తెలిసింది. వేరే ఊరికి వెళ్లిపోయి బతుకుతున్న ధర్మశీలాదేవి అనే మహిళ తనను హత్య చేసిన కారణంగా తన భర్తను జైల్లో పెట్టారని తెలుసుకుని తను బతికే ఉన్నానని పోలీసులకు స్టేట్‌మెంట్ ఇచ్చింది. అసలు ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్లారు.. ఎందుకు వెళ్లారు.. ఈ కథ ఏంటి అని పోలీసులు అడిగితే అప్పుడు విలన్ ఎవరో బయటపడింది.
బెంగళూరు నుంచి ఏపీకి రావాలని లోకేష్ పిలుపు - ఇంకా గ్రౌైండ్ వర్క్ చేయాలన్న పారిశ్రామికవేత్త
ధర్మశీలాదేవికి తండ్రి ఓ యువకుడ్ని చూసి పెళ్లి చేశాడు. అయితే ఆ యువకుడు మద్యానికి బానిస. ప్రతి రోజూ హింసిచేవాడు. భరించి భరించి ఇక తన వల్ల కాదని చెప్పి ఆమె ఇంటికి వెళ్లిపోయిది. ఇక తాను భర్త వద్దకు వెళ్లనని చెప్పింది. కొద్ది రోజులకు అనారోగ్యంతో ధర్మశీలాదేవి తల్లి చనిపోయింది. తర్వాత తన సొంత తండ్రి ఆమెను లైంగికంగా వేధించడం ప్రారంభించాడు. దాంతో ఆమె ఇల్లు వదిలి వెళ్లిపోయింది. వేరే ఊరికి వెళ్లిపోయి చిన్న చిన్న పనులు చేసుకుంటున్న సమయంలో ఓ యువకుడు పరిచయం కావడంతో అతనిని పెళ్లి చేసుకుంది. ఇద్దరు పిల్లలకు తల్లి కూడా అయింది. తండ్రి కీచకుడు కావడం.. మొదటి భర్త హింస పెట్టేవాడు కావడంతో తన ఉనికి తెలియాలని ఆమె అనుకోలేదు. రెండో పెళ్లితో పిల్లలతో హాయిగా గడుపుతోంది.
డేటింగ్‌లో కనిపించే 'ఘోస్టింగ్' ఆఫీసుల్లోకి ఎలా ఎంటరైంది, ఇంతకీ ఏమిటది?
అయితే నాలుగేళ్ల తర్వాత విషయం తెలియడంతో పోలీసులకు మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఆమె వద్ద స్టేట్ మెంట్ తీసుకుని మొదటి భర్తను వదిలేశారు. ఇప్పుడు పోలీసులు పట్టాల వద్ద దొరికిన గుర్తు తెలియని మృతదేహం ఎవరిదో కనుక్కునే ప్రయత్నం చేశారు. ధర్మశీలాదేవి తన తండ్రిపై చేసిన ఆరోపణల విషయంలో విచారణ ప్రారంభించారు. అవి నిజమని తేలితే అరెస్టు చేస్తామని పోలీసులు చెబుతున్నారు.
తన భార్యను తాను హత్య చేయకపోయినా తన మాట ఎవరూ వినకుండా నాలుగేళ్ల పాటు జైల్లో పెట్టాలని ఆ భర్త బోరుమని.. కళ్లు తుడుచుకుని ఇంటికెళ్లిపోయాడు. తన మొదటి భార్యతో మాట్లాడే ప్రయత్నం కూడా చేయలేదు.