అన్వేషించండి

కూటమికి ఆ పేరు వద్దని చెప్పినా వినలేదు, అందుకే బయటకు వచ్చేశా - నితీశ్‌ కీలక వ్యాఖ్యలు

Nitish Kumar: కూటమిలో సీట్‌ల పంపకాల విషయంలో కాంగ్రెస్ నాన్చుడు ధోరణి వల్లే బయటకు వచ్చేశానని నితీశ్ కుమార్ తేల్చి చెప్పారు.

CM Nitish Kumar: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ I.N.D.I.A కూటమి నుంచి బయటకు రావడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఒకే ఒక్క రోజులో ఆయన మహాఘట్‌బంధన్‌కి గుడ్‌బై చెప్పడం ఆ తరవాత NDAతో చేతులు కలపడం చకచకా జరిగిపోయాయి. ఉదయం రాజీనామా చేసి సాయంత్రానికల్లా కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. తొమ్మిదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి నుంచి కాంగ్రెస్‌,జేడీయూ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. కూటమి ఏర్పాటు చేసి కాంగ్రెస్ సైడ్ అయిపోయిందని, ఏ మాత్రం పట్టించుకోవడం లేదని గతంలో చాలా సార్లు నితీశ్ అసహనం వ్యక్తం చేశారు. కానీ...కాంగ్రెస్ మాత్రం ఈ వ్యాఖ్యల్ని కొట్టిపారేసింది. కేవలం ఐదు రాష్ట్రాల ఎన్నికల కారణంగానే కొన్నాళ్ల పాటు మౌనంగా ఉండిపోయామని స్పష్టం చేసింది. కానీ...అక్కడితో మొదలైన విభేదాలు ముదిరాయి. చివరకు ఆయన కూటమి నుంచి బయటకు వచ్చేంత వరకూ వెళ్లింది. ఈ క్రమంలోనే నితీశ్ కుమార్‌ మరోసారి విపక్ష కూటమిపై కీలక వ్యాఖ్యలు చేశారు. పేరు దగ్గరి నుంచి సీట్‌ల షేరింగ్ వరకూ అంతా వాళ్లకు ఇష్టమొచ్చినట్టే చేసుకున్నారని, తమకు విలువ ఇవ్వలేదని తేల్చి చెప్పారు. 

"ప్రతిపక్ష కూటమికి వేరే పేరు పెడదామని ప్రతిపాదించాను. కానీ వాళ్లు నా మాట వినలేదు. అప్పటికే నిర్ణయం తీసుకున్నారు. నేనే చాలా సూచనలు చేశాను. వాళ్లు ఏమీ పట్టించుకోలేదు. ఏయే పార్టీ ఎన్ని చోట్ల పోటీ చేస్తుందన్న విషయంలో ఇప్పటికీ స్పష్టత రాలేదు. అందుకే నేను ఆ కూటమి నుంచి బయటకు వచ్చేశాను. బిహార్ ప్రజల కోసం నేను ఎంతైనా శ్రమిస్తూనే ఉంటాను"

- నితీశ్ కుమార్, బిహార్ ముఖ్యమంత్రి 

అటు కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ సీట్ల పంపకాలపై స్పందించారు. ప్రస్తుతం చర్చలు కొనసాగుతున్నాయని, ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం కుదరదని స్పష్టం చేశారు. కూటమిలో మూడు పెద్ద పార్టీలున్నాయని, వాళ్లు ఒంటరిగా పోటీ చేసేటట్టైతే ఈ పాటికే ప్రకటన చేసే వాళ్లని అన్నారు. 

"ఇప్పటి వరకూ సీట్‌ షేరింగ్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కూటమిగా ఉన్నప్పుడు అందరూ ఒకే అభిప్రాయంతో ఉండాలి. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం కుదరదు. కూటమిలోని పార్టీలు ఒంటరిగా పోటీ చేసేటట్టైతే వాళ్లు అధికారికంగా ప్రకటించాలి. I.N.D.I.A కూటమి కలిసికట్టుగా పోరాడుతుందన్న నమ్మకం మాకుంది"

- జైరాం రమేశ్, కాంగ్రెస్ సీనియర్ నేత 

 

టాప్ హెడ్ లైన్స్

Rs 500 Notes Ban: మళ్లీ పెద్ద నోట్లు రద్దు! ప్రధాని మోదీని మరోసారి కోరతాం: ఏపీ సీఎం చంద్రబాబు
మళ్లీ పెద్ద నోట్లు రద్దు! ప్రధాని మోదీని మరోసారి కోరతాం: ఏపీ సీఎం చంద్రబాబు సంచలనం
Census In Telangana: తెలంగాణలో జనగణన నిర్వహణకు తేదీలు ఖరారు..ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
తెలంగాణలో జనగణన నిర్వహణకు తేదీలు ఖరారు..ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
AP CPS Employees: సీపీఎస్ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్... ఓపీఎస్‌లోకి మారేందుకు అవకాశం!
సీపీఎస్ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్... ఓపీఎస్‌లోకి మారేందుకు అవకాశం!
Karimnagar Development: రాజకీయాలను పక్కనబెట్టి కరీంనగర్ అభివృద్ధికి కట్టుబడి.. రూ.4 కోట్ల పనులకు బండి సంజయ్, పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన
రాజకీయాలను పక్కనబెట్టి కరీంనగర్ అభివృద్ధికి కట్టుబడి.. రూ.4 కోట్ల పనులకు బండి సంజయ్, పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Politics: కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీ సమరం.. కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్!
కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీ సమరం.. కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్!
Nerella Sharada: హైదరాబాద్‌కు యువతులను రప్పిస్తున్నది ఎవరు? అక్రమ అండాల దందాపై మహిళా కమిషన్ ప్రశ్నలు
హైదరాబాద్‌కు యువతులను రప్పిస్తున్నది ఎవరు? అక్రమ అండాల దందాపై మహిళా కమిషన్ ప్రశ్నలు
CM Chandrababu: 2024 ఎన్నికల కంటే అత్యుత్తమ ఫలితాలు, మెరుగైన స్ట్రైక్ రైట్.. కూటమి విజయంపై సీఎం చంద్రబాబు
2024 ఎన్నికల కంటే అత్యుత్తమ ఫలితాలు, మెరుగైన స్ట్రైక్ రైట్.. కూటమి విజయంపై సీఎం చంద్రబాబు
Software Engineer Murder: పూజ చేసి బలిచ్చింది! సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను హత్య చేసిన ప్రియురాలు.. ఆమెతో పాటు తల్లి అరెస్ట్
పూజ చేసి బలిచ్చింది! సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను హత్య చేసిన ప్రియురాలు.. ఆమెతో పాటు తల్లి అరెస్ట్
Census In Telangana: తెలంగాణలో జనగణన నిర్వహణకు తేదీలు ఖరారు..ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
తెలంగాణలో జనగణన నిర్వహణకు తేదీలు ఖరారు..ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
This Week OTT Movies : శుక్రవారం ఓటీటీల్లో 12 సినిమాలు స్ట్రీమింగ్ - జైలర్ 2 To రణబాలి... ఇవి డోంట్ మిస్
శుక్రవారం ఓటీటీల్లో 12 సినిమాలు స్ట్రీమింగ్ - జైలర్ 2 To రణబాలి... ఇవి డోంట్ మిస్
ACB Raids: రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిన ఎస్సై
రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిన ఎస్సై
Comedy Drama OTT : ఓటీటీలోకి సరికొత్త కామెడీ ఎమోషనల్ మూవీ - 'హ్యాపీ జర్నీ' ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి సరికొత్త కామెడీ ఎమోషనల్ మూవీ - 'హ్యాపీ జర్నీ' ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Embed widget