అన్వేషించండి

Bankipur By Election: బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ మైండ్ గేమ్ - బీజేపీ అభ్యర్థి అభిషేక్ సిన్హా నామినేషన్ ఉపసంహరణ !

Prashant Kishor: బీహార్ రాజకీయాల్లో ఉపఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రశాంత్ కిషోర్.. బీజేపీతో మైండ్ గేమ్ ఆడుతున్నారు. ఆ పార్టీ అభ్యర్థి తన నామినేషన్ ను ఉపసంహరించుకునేలా చేశారు.

Bankipur Assembly BJP Candidate: బీహార్ రాజకీయాల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన బంకీపూర్ అసెంబ్లీ స్థాన ఉపఎన్నిక వేళ ఊహించని రాజకీయ భూకంపం సంభవించింది. బీజేపీ అభ్యర్థిగా గురువారం నామినేషన్ దాఖలు చేసిన అభిషేక్ సిన్హా  , కేవలం 24 గంటల వ్యవధిలోనే శుక్రవారం  తన నామినేషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించి అందరినీ విస్మయానికి గురిచేశారు. కుటుంబ కారణాల వల్లే తాను తప్పుకుంటున్నట్లు ఆయన రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ సరఫ్గీకి లేఖ రాశారు. అయితే, బీజేపీ కోటగా భావించే బంకీపూర్‌లో నామినేషన్ వేసిన అభ్యర్థి ఇలా అర్ధాంతరంగా తప్పుకోవడం వెనుక అసలు కారణం  జన్ సూరాజ్ పార్టీ అధినేత, ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్  సృష్టించిన పొలిటికల్ మైండ్ గేమేనని బీహార్ మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగుతోంది.

ఈ ఉపఎన్నిక ద్వారా ప్రశాంత్ కిషోర్ ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. పీకే లాంటి బలమైన అభ్యర్థి ముందు అభిషేక్ సిన్హా చాలా బలహీనమైన క్యాండిడేట్ అని, ఆయన నిలబడితే బీజేపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకోవాల్సి వస్తుందని పార్టీ అంతర్గత సర్వేల్లో తేలిందట. దీనికి తోడు, అభిషేక్ సిన్హాకు సంబంధించిన కొన్ని వివాదాస్పద ఆర్థిక లావాదేవీల  చిట్టా ప్రశాంత్ కిషోర్ వద్దకు చేరిందనే ప్రచారం   జోరందుకుంది. ఒకవేళ పీకే వాటిని ఎన్నికల ప్రచారంలో బయటపెడితే పార్టీ పరువు పోతుందని భావించిన అధిష్టానమే, అభిషేక్‌తో బలవంతంగా నామినేషన్ ఉపసంహరింపజేసిందనే చర్చ నడుస్తోంది.

బీజేపీ అభ్యర్థి వెనక్కి తగ్గడాన్ని ప్రశాంత్ కిషోర్ తనదైన శైలిలో క్యాష్ చేసుకున్నారు.  బీజేపీ భయంతో ప్రజలు వెనక్కి తగ్గడం చూశాం కానీ, ఓటమి భయంతో బీజేపీ అభ్యర్థే రంగం వదిలి పారిపోవడం చరిత్రలో ఇదే మొదటిసారి  అంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. బంకీపూర్ తమ అజేయమైన కోట అని, అక్కడ కుక్కను నిలబెట్టినా గెలుస్తామని అహంకారంతో మాట్లాడే బీజేపీకి ఇప్పుడు అభ్యర్థే దొరకడం లేదని ఎద్దేవా చేశారు. పీకే దూకుడుకు బ్రేక్ వేసేందుకు బీజేపీ వెంటనే అలర్ట్ అయి, క్షేత్రస్థాయి నుంచి ఎదిగిన 32 ఏళ్ల యువజన విభాగం నేత నీరజ్ కుమార్ సిన్హాను కొత్త అభ్యర్థిగా బరిలోకి దించుతూ కేంద్ర ఎన్నికల కమిటీ ద్వారా ప్రకటన చేయించింది.

ఈ స్థానం ఖాళీ అవ్వడానికి కారణం.. ఇక్కడి నుంచి ఐదుసార్లు వరుసగా గెలిచిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ రాజ్యసభకు ఎన్నికై రాజీనామా చేయడమే. 2025 అసెంబ్లీ ఎన్నికల్లో నితిన్ నవీన్ ఇక్కడి నుంచి ఆర్‌జేడీ  అభ్యర్థి రేఖా కుమారిపై 51,000 పైచిలుకు ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. అప్పట్లో జన చైతన్య యాత్రలో ఉన్న పీకే పార్టీ మూడో స్థానానికే పరిమితమైంది. అయితే, ఇప్పుడు స్వయంగా ప్రశాంత్ కిషోర్ బరిలో ఉండటం, ఆర్జేడీ తరఫున మళ్లీ రేఖా కుమారి పోటీలో నిలవడంతో త్రిముఖ పోరు ఆసక్తికరంగా మారింది. జులై 30న పోలింగ్, ఆగస్టు 3న కౌంటింగ్ జరగనున్న ఈ ఎన్నికను పీకే తన రాజకీయ భవిష్యత్తుకు ఒక  రెఫరెండం గా అభివర్ణిస్తున్నారు.

అంతిమంగా చూస్తే.. అభిషేక్ సిన్హా విరమణతో బీజేపీ డిఫెన్స్‌లో పడిందనే నెరేటివ్‌ను సెట్ చేయడంలో ప్రశాంత్ కిషోర్ సఫలమయ్యారు. ఒకప్పుడు తెరవెనుక ఉండి దేశవ్యాప్తంగా ఎందరినో సీఎంలను, పీఎంలను చేసిన పీకే.. ఇప్పుడు స్వయంగా ఎమ్మెల్యేగా గెలిచే బాధ్యతను తన భుజాలకెత్తుకున్నారు. ఈ క్రమంలోనే పాతబస్తీ తరహా ఓట్ల సమీకరణాలు, కేడర్ భరోసా లెక్కలను తిరగరాస్తూ బీజేపీపై ఆయన పైచేయి సాధించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, మూడు దశాబ్దాలుగా ఆర్ఎస్ఎస్, జనసంఘ్ మూలాలున్న బంకీపూర్ ఓటర్లు పీకే ప్రయోగాలను ఆదరిస్తారా.. లేక కొత్తగా వచ్చిన సాధారణ బూత్ స్థాయి కార్యకర్త నీరజ్ సిన్హాకు పట్టం కడతారా అనేది బీహార్ రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతోంది. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్.. రాష్ట్ర విభజన హామీలు ప్రస్తావించనున్న సీఎం చంద్రబాబు
సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్.. రాష్ట్ర విభజన హామీలు ప్రస్తావించనున్న సీఎం చంద్రబాబు
AP Municipal Amendment Bill: మేయర్, మున్సిపల్ చైర్మన్‌లకు ఇకపై ప్రత్యక్ష ఎన్నికలు.. బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
మేయర్, మున్సిపల్ చైర్మన్‌లకు ఇకపై ప్రత్యక్ష ఎన్నికలు.. బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
Breaking News: మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Advertisement

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Embed widget