News
News
X

Bhutan Government: భార్యను ఇంటికి తీసుకెళ్లాలంటే డబ్బులు కట్టాలట,పెళ్లైనా బ్రహ్మచారిగానే - ఇదేం రూల్‌రా బాబు

Bhutan Government: భార్యను ఇంటికి తీసుకురావాలంటే ప్రభుత్వానికి పన్ను కట్టాల్సిందేనట.

FOLLOW US: 
Share:

Bhutan Government Tax on Marriage: 

భూటాన్‌లో వింత రూల్..

పెళ్లి చేసుకున్న తరవాత వధువు వరుడి ఇంటికి వెళ్లడం ఆచారం. కానీ ఆ దేశంలో మాత్రం అలా కుదరదు. పెళ్లి చేసుకున్న తరవాత కూడా వధువు తన పుట్టింట్లోనే ఉండాలి. ఒకవేళ అత్తగారింటికి రావాలంటే డబ్బులు కట్టాలి. వింతగా ఉంది కదా ఈ రూల్. మన పొరుగున్న ఉన్న  భూటాన్‌లోనే ఉందీ వెరైటీ చట్టం. భూటాన్‌కు చెందిన అబ్బాయిలు ఇండియాలోని అమ్మాయిల్ని పెళ్లి చేసుకుంటే ఈ రూల్‌ కచ్చితంగా పాటించాల్సిందేనని తేల్చి చెప్పింది అక్కడి ప్రభుత్వం. ఒకవేళ పెళ్లి కూతుర్ని తనతో పాటు ఇంటికి తీసుకురావాలంటే ప్రభుత్వానికి రోజుకు రూ.1200 చెల్లించాలి. ఈ రూల్ కారణంగా ఇప్పటికీ చాలా మంది జంటలు కలిసి ఉండటం లేదు. హిమాచల్‌ప్రదేశ్‌లోని 40 ఏళ్ల చోకీ వాంగ్మో..ఇప్పటికీ తన భర్తతో కలిసి ఉండేందుకు నిరీక్షించాల్సి వస్తోంది. 2019లో పుష్పేంద్ర సింగ్ అనే వ్యక్తితో ఆమెకు వివాహమైంది. ఆ వ్యక్తి భూటాన్‌లో పని చేస్తున్నాడు. పైగా అతడు భారత దేశ పౌరుడు. అయితే...భూటాన్‌లో పని చేసేందుకు వర్క్ పర్మిట్ ఉంది. ప్రతి మూడు నెలలకోసారి వర్క్ పర్మిట్‌ను రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే...అక్కడికి తన భార్యను మాత్రం తీసుకెళ్లలేకపోతున్నాడు. మూడేళ్లుగా ఇలా ఇద్దరూ ఒక్కో చోట ఉంటున్నారు. నిజానికి..ఈ రూల్ గురించి తెలిసే వధువు వాళ్ల ఇంట్లో పెళ్లికి ఒప్పుకోలేదు. ఎలాగోలా బతిమాలి ఇద్దరూ పెళ్లి చేసుకున్నా..భూటాన్ ప్రభుత్వం పెట్టిన రూల్‌తో ఇలా వేరుగా ఉండాల్సి వస్తోంది. 

ఎంత కట్టాలంటే..? 

Sustainable Development Fee (SDF) కింద రూ.1,200 వసూలు చేస్తోంది భూటాన్ ప్రభుత్వం. అంతకు ముందు భారతీయులకు ఈ రూల్ అమల్లో ఉండేది కాదు. కానీ..కొవిడ్ తరవాత ఆదాయం పెంచుకునే మార్గాల్లో భాగంగా ఇండియాకూ ఈ రూల్‌ని అప్లై  చేసేసింది భూటాన్. అయితే..ఇక్కడ ఓ ట్విస్ట్ ఉంది. ఒకవేళ భూటాన్ నుంచి మ్యారేజ్ సర్టిఫికేట్‌ తీసుకుంటే ఈ చిక్కులు ఉండవు. కానీ...ఇది అంత సులభం కాదు. 15 ఏళ్లుగా మ్యారేజ్ సర్టిఫికేట్‌ల కోసం ఎదురు చూస్తున్న వాళ్లున్నారు. ఇది కేవలం ఈ ఒక్క జంట సమస్యే కాదు. ఇలా ఎన్నో జంటలు ఇబ్బందులు పడుతున్నాయి. ఇక మరో రూల్ ఏంటంటే...ఒకవేళ ఇండియా నుంచి ఎవరైనా భూటాన్‌కు వెళ్లి ఓ 10 రోజుల పాటు ఉంటే కచ్చితంగా గైడ్‌ను పెట్టుకోవాల్సిందే. అందుకోసం రోజుకి రూ.1,500 కట్టాలి. ఇదే భూటాన్ పౌరులు ఇండియాకు వస్తే మాత్రం ఇలాంటి రూల్స్‌ ఏమీ లేవు. వాళ్లు సింపుల్‌గా వచ్చి ఇక్కడే ఉండిపోవచ్చు. 

ఎందుకు ఈ రూల్..? 

దాదాపు రెండేళ్ల పాటు భూటాన్‌ సరిహద్దులు కొవిడ్ కారణంగా మూసేశారు. ఆ మేరకు ఆ దేశానికి ఆదాయం పడిపోయింది. కరోనా తగ్గుముఖం పట్టాక మళ్లీ బార్డర్‌ను రీఓపెన్ చేశారు. పర్యాటకులకు వెల్‌కమ్ చెప్పారు. కానీ...ఇలా వచ్చిన వాళ్ల నుంచి విజిటర్ ట్యాక్స్ కింద రోజువారీగా డబ్బులు వసూలు చేస్తోంది భూటాన్. ఒక్కో దేశం నుంచి వచ్చే వాళ్లకు ఒక్కో విధంగా ఈ ట్యాక్స్‌లు పెట్టింది. అసలు ఎందుకిలా అంటే...? రెవెన్యూ పెంచుకోడానికి అని సమాధానమిస్తోంది. పర్యాటకమే ఇక్కడి ప్రధాన ఆదాయ వనరు. అందుకే...ఆ టూరిజం నుంచే వీలైనంత ఎక్కువగా డబ్బులు వెనకేసుకోవాలని చూస్తోంది. పైగా పెద్ద మొత్తంలో పర్యాటకులు వచ్చి అక్కడి పర్యావరణాన్ని పాడు చేయకుండా ఉండేందుకు ఇలా రూల్ పెట్టింది. ఇలా అయితే....అక్కడి వనరులను జాగ్రత్తగా ఉపయోగించుకుంటారని చెబుతోంది భూటాన్. కారణాలేవైనా సరే...ఈ రూల్స్ మాత్రం చాలా వెరైటీగా ఉన్నాయి. 

Also Read: UK Sales Director: బట్టతల ఉందని ఉద్యోగంలో నుంచి తీసేసిన కంపెనీ, రివెంజ్ తీర్చుకున్న ఎంప్లాయ్

Published at : 15 Feb 2023 03:37 PM (IST) Tags: Bhutan Marriage Bhutan Government Bhutanese Tax on Marriage

సంబంధిత కథనాలు

Breaking News Live Telugu Updates: కాసేపట్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం

Breaking News Live Telugu Updates: కాసేపట్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం

Tirumala Hundi Income: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, నిన్న హుండీ ఆదాయం ఎంతంటే?

Tirumala Hundi Income: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, నిన్న హుండీ ఆదాయం ఎంతంటే?

Fed Rate Hike: వడ్డీ రేట్లను 25 bps పెంచిన ఫెడ్‌ - ప్రపంచం ఏమైనా పర్లేదు, తన దారి తనదే!

Fed Rate Hike: వడ్డీ రేట్లను 25 bps పెంచిన ఫెడ్‌ - ప్రపంచం ఏమైనా పర్లేదు, తన దారి తనదే!

Vizag Building Collapse: విశాఖలో అర్ధరాత్రి తీవ్ర విషాదం! కుప్పకూలిన భవనం, అక్కడికక్కడే ముగ్గురు మృతి

Vizag Building Collapse: విశాఖలో అర్ధరాత్రి తీవ్ర విషాదం! కుప్పకూలిన భవనం, అక్కడికక్కడే ముగ్గురు మృతి

Stocks to watch 23 March 2023: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి - HAL, Heroపై ఓ కన్నేయండి

Stocks to watch 23 March 2023: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి - HAL, Heroపై ఓ కన్నేయండి

టాప్ స్టోరీస్

ఎమ్మెల్సీ ఎన్నికల్లో గంటా శ్రీనివాసరావు ఓటేస్తారా? రాజీనామాను ఆమోదించేశారా?

ఎమ్మెల్సీ ఎన్నికల్లో గంటా శ్రీనివాసరావు ఓటేస్తారా? రాజీనామాను ఆమోదించేశారా?

KCR Tour: నేడు 4 జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటన - పూర్తి షెడ్యూల్ ఇదీ

KCR Tour: నేడు 4 జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటన - పూర్తి షెడ్యూల్ ఇదీ

NTR 30 Muhurtam : రాజమౌళి క్లాప్‌తో మొదలైన ఎన్టీఆర్ 30 - అతిరథ మహారథుల సమక్షంలో...

NTR 30 Muhurtam : రాజమౌళి క్లాప్‌తో మొదలైన ఎన్టీఆర్ 30 - అతిరథ మహారథుల సమక్షంలో...

DVV Danayya: రూ.80 కోట్లా? ఆస్కార్స్ ఖర్చుపై స్పందించిన ‘RRR’ నిర్మాత డీవీవీ దానయ్య

DVV Danayya: రూ.80 కోట్లా? ఆస్కార్స్ ఖర్చుపై స్పందించిన ‘RRR’ నిర్మాత డీవీవీ దానయ్య