Bharat Jodo Yatra: ఖరీదైన హోటళ్లలో కాదు, కంటెయినర్లలోనే బస - కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర విశేషాలివే
Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్రలో పాల్గొనే వాళ్లంతా రోడ్లపైనే భోజనాలు చేస్తారు.
Bharat Jodo Yatra:
టార్గెట్ భాజపా..
కాంగ్రెస్ భారత్ జోడో యాత్రపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. భాజపా వైఫల్యాలనే టార్గెట్ చేస్తూ...కొనసాగనుంది ఈ పాదయాత్ర. మొత్తం 3,570 కిలోమీటర్ల మేర రాహుల్ గాంధీ ఈ యాత్రకు నేతృత్వం వహించనున్నారు. 118 మంది శాశ్వత సభ్యులు ఇందులో పాల్గొంటారు. కాంగ్రెస్ సీనియర్ నేతలంతా...పార్టీకి ఇది టర్నింగ్ పాయింట్ అవుతుందని చెబుతున్నారు. ఇటీవలే వరుసగా పలువురు సీనియర్ నేతలురాజీనామా చేయటం ఆ పార్టీని గందరగోళంలో పడేసింది. ఇలాంటి సంక్లిష్ట సమయంలో కాంగ్రెస్ ఈ పాదయాత్రకు సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది పలు రాష్ట్రాల ఎన్నికలతో పాటు 2024 ఎలక్షన్స్‌ని టార్గెట్‌గా పెట్టుకుంది. ఈ భారత్ జోడో యాత్రకు సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్లు తెలుసుకుందాం.
1. కన్యాకుమారిలో ప్రారంభం కానున్న భారత్ జోడో యాత్ర 150 రోజుల పాటు 3,570 కిలోమీటర్ల మేర కొనసాగనుంది. జమ్ము, కశ్మీర్‌లో ముగుస్తుంది.
2. ఈ యాత్రలో పాల్గొనే వారెవరూ..హోటళ్లలో బస చేయరు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కంటెయినర్లలోనే బస చేస్తారు. దేశవ్యాప్తంగా ఇలాంటి కంటెయినర్లను 60 వరకూ అరేంజ్ చేశారు. వీటిలోనే నిద్రించేందుకు బెడ్స్ ఉంటాయి. టాయిలెట్స్, ఏసీలనూ ఏర్పాటు చేశారు.
3. భద్రతా కారణాల దృష్ట్యా, రాహుల్ గాంధీ ఓ కంటెయినర్‌లో ఉంటారు. మిగతా యాత్రికులంతా ఇతర కంటెయినర్లలో బస చేయనున్నారు.
4. విలేజ్ షేప్‌లో ఉండే ఈ కంటెయినర్లను రోజూ ఓ కొత్త ప్లేస్‌లో పార్క్ చేస్తారు. ఈ యాత్రలో పాల్గొనే శాశ్వస యాత్రికులకు రహదారులపైనే భోజనాలు ఏర్పాటు చేస్తారు. లాండ్రీ సర్వీస్‌లనూ అందిస్తారు.
5. ఐదు నెలల పాటు యాత్ర కొనసాగనున్నందున వాతావరణ మార్పులకు అనుగుణంగా ఏర్పాట్లు చేశారు.
6. రోజుకు 6-7 గంటల పాటు పాదయాత్ర కొనసాగుతుంది.
7. ఈ యాత్రలో పాల్గొనే వాళ్లు రెండు బ్యాచ్‌లుగా విడిపోతారు. ఉదయం ఓ బ్యాచ్ 7 గంటల నుంచి 10.30 వరకూ, సాయంత్రం మరో బ్యాచ్ 3.30 గంటల నుంచి 6.30 వరకూ కొనసాగనుంది. రోజుకు 22-23 కిలోమీటర్ల మేర యాత్ర కొనసాగిస్తారు.
8. భారత్ జోడో యాత్రలో పాల్గొనే వారిలో రాజస్థాన్‌కు చెందిన కాంగ్రెస్ కురవృద్ధుడు విజేంద్ర సింగ్ మహల్వాట్ కీలక పాత్ర పోషించ నున్నారు. వీరిలో అరుణాచల్‌ప్రదేశ్‌కు చెందిన అజమ్ జోంబ్లా, బెమ్ బాయ్ లాంటి యంగెస్ట్ లీడర్స్ కూడా ఉన్నారు. కన్హయ్యా కుమార్, పవన్ ఖేరా కూడా యాత్రలో పాల్గొననున్నారు. ఈ సభ్యుల్లో 30% కన్నా ఎక్కువ మహిళలే ఉన్నారు.
9. భారత్ జోడో యాత్ర రూట్ మ్యాప్ ఆధారంగా చూస్తే..మొత్తం 20 కీలక ప్రాంతాల మీదుగా సాగనుంది. ఈ యాత్ర కన్యాకుమారి నుంచి ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి తిరువనంతపురం, కొచ్చి, నిలంబూర్, మైసూరు, బళ్లారి, రాయ్‌చూర్, వికారాబాద్, నాందేడ్, జలగావ్, ఇండోర్, కోటా, దౌసా, అల్వార్, బులంద్‌షర్, ఢిల్లీ, అంబాలా, పఠాన్‌కోట్, జమ్ము, శ్రీనగర్ వరకూ సాగుతుంది.
10.కేరళలో 18 రోజుల పాటు, కర్నాటకలో 21 రోజుల పాటు పాదయాత్ర ఉంటుంది.