Bhabanipur By-Election 2021 Result Live: భవానీపుర్‌లో దీదీ విజయకేతనం.. 58 వేల ఓట్ల తేడాతో గెలుపు
బంగాల్ ఉపఎన్నికల కౌంటింగ్ జరుగుతోంది. బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. భాజపా అభ్యర్థి ప్రియాంకా టిబ్రేవాల్‌పై ఆధిక్యత కొనసాగిస్తున్నారు.
LIVE
Background
దేశవ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న బంగాల్ భవానీపుర్ అసెంబ్లీ ఉపఎన్నికల కౌంటింగ్ మొదలైంది. 21 రౌండ్లలో ఈ కౌంటింగ్ జరగనుంది. భవానీపుర్తో పాటు బంగాల్లోని సంసేర్గంజ్, జంగీపుర్ ఉపఎన్నిక ఫలితాలు కూడా వెలువడనున్నాయి.
దీదీ విజయం..
భవానీపుర్ ఉపఎన్నికలో మమతా బెనర్జీ విజయకేతనం ఎగురవేశారు. భాజపా అభ్యర్థి ప్రియాంక టిబ్రేవాల్‌పై భారీ ఆధిక్యాన్ని నమోదు చేశారు. తొలి రౌండ్ నుంచీ మమత ఆధిపత్యం కొనసాగించారు. 58,389 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ విజయంతో మమత సీఎం పీఠాన్ని నిలబెట్టుకున్నారు.
58 వేల ఓట్లు..
భవానీపుర్ ఉపఎన్నికల ఫలితాల్లో మమతా బెనర్జీ దూసుకుపోతున్నారు. ప్రత్యర్థి ప్రియాంక టిబ్రేవాల్‌పై 58 వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
34 వేల ఓట్ల ఆధిక్యం..
11వ రౌండ్ ముగిసేసరికి 34 వేల ఓట్ల ఆధిక్యంలో మమతా బెనర్జీ ఉన్నారు.
28,825 ఓట్ల ఆధిక్యంలో..
భవానీపుర్‌లో 9వ రౌండ్ కౌంటింగ్ ముగిసేసరికి మమతా బెనర్జీ 28,825 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు దీదీ ఇంటి బయట సంబరాలు జరుపుకుంటున్నారు.
#WATCH | TMC workers & supporters celebrate outside the residence of West Bengal CM Mamata Banerjee in Kolkata as she leads by 28,825 votes in Bhabanipur bypolls after 9th round of counting pic.twitter.com/XlZhaJPB0n
— ANI (@ANI) October 3, 2021
దీదీ జోరు..
భాజపా అభ్యర్థి ప్రియాంక టిబ్రేవాల్‌పై భవానీపుర్ ఉపఎన్నికల కౌంటింగ్‌లో మమతా బెనర్జీ 12,435 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
West Bengal: TMC supporters celebrate outside CM Mamata Banerjee’s residence in Kolkata as she leads in the Bhabanipur Assembly by-election pic.twitter.com/roWsaX9moK
— ANI (@ANI) October 3, 2021