Bengaluru Vs North Indians Row: నార్త్ ఇండియన్స్ లేకుంటే బెంగళూరే లేదంది! ఇప్పుడేమో ద్వేషాన్ని వ్యాప్తి చేయొద్దంటోంది
Bengaluru vs North Indians row : నార్త్ ఇండియన్స్ లేకపోతే బెంగళూరే లేదంటూ ఇన్‌ఫ్లూయెన్సర్ సుగంధ్ శర్మ రీల్స్.బెంగళూరులో భవనాలన్నీ నార్త్ ఇండియన్సే కట్టారట.. కన్నడ ప్రజల కామెంట్స్‌తో ఐ లవ్ బెంగళూర్
Bengaluru vs North Indians row : సోషల్ మీడియా వచ్చిన తర్వాత.. ఎవరికి వారు తమ అభిప్రాయాలు వెలిబుచ్చుకునే స్వేచ్ఛ వచ్చింది. ఇది కొంత వరకు మంచిదే. కానీ.. ఎదుటి వాళ్లను తక్కువ చేసేలా స్టోరీలు చేస్తే మాత్రం.. రిటర్న్ గిప్ట్ అదిరిపోయేలా ఇస్తుంది అదే సోషల్ మీడియా. ఇలాంటి కథే.. ఇన్‌ఫ్లూయెన్స ర్ సుగంధ్ శర్మది. మొదట నార్త్ ఇండియన్స్ లేకుంటే బెంగళూరే లేదని అన్నది. రివర్స్ మ్యూజిక్ స్టార్ట్ అయ్యే సరికి.. ఐ లవ్ బెంగళూర్ బ్రో.. ప్లీజ్ డోంట్ స్ప్రెడ్ హేట్ అంటూ కొత్త రాగం అందుకుంది.
నార్త్ ఇండియన్స్ వెళ్లిపోతే.. బెంగళూరు నగరం ఆగిపోద్ది:
సుగంధ్ శర్మ. ఈమే ఒక ఇన్‌ఫ్లూయెన్సర్. ఇన్‌స్టా పేజిలో రకరకాల కథలు పెడుతూ ఉంటుంది. అన్ని కథల సంగతి ఎలా ఉన్నా బెంగళూరు మీద ఆమె కథ దగ్గరికి వచ్చే సరికి డామిట్ కథ అడ్డం తిరిగింది. బెంగళూరు ఏ ఒక్కరిదీ కాదు.. అందరిదీ పేరుతో ఓ రీల్‌ను ఇన్‌స్టాలో పెట్టింది. అందులో నార్త్ ఇండియన్స్ లేకుంటే బెంగళూరు అభివృద్ధే చెందేది కాదని.. ఇక్కడున్న ఆకాశ సౌధాలన్నీ వాళ్లు కట్టినవేనని.. మైగ్రెంట్స్ లేకుంటే బెంగళూరు ఆగి పోతుందని ఆ రీల్‌లో చెప్పుకొచ్చింది. నార్త్ ఇండియన్స్ బెంగళూరు వదిలి వెళ్తే.. గార్డెన్ సిటీ ఖాళీ అవుతుందని.. పీజీ హాస్టల్స్ అన్నీ ఎంప్టీగా ఉంటాయని అందులో సుగంధ్ చెప్పుకొచ్చింది.
ఈ రీల్స్ చూసిన కర్ణాటక భాషాభిమానులు, ప్రాంతాభిమానులు తమ కామెంట్లతో హోరెత్తించారు. సెలబ్రిటీల నుంచి కామన్ మ్యాన్ వరకు సుగంధ్ శర్మ మాటలను తీవ్రంగా తప్పు పట్టారు. పదునైన కామెంట్లతో విరుచుకు పడ్డారు. చైత్ర ఆచార్, అనుపమ గౌడ వంటి సినీ నటులతో పాటు బిగ్‌బాస్ ఫేమ్ రూపేష్ రాజన్న, ధన్‌రాజ్ వంటి వారు కూడా శర్మ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.
ఒకసారి బెంగళూరు నుంచి వెళ్లండి.. ఏమవుద్దో చూద్దాం:
సుగంధ్ శర్మ చేసిన రీల్‌కు యాక్టర్ అండ్ రాపర్ చందన్ శెట్టి పెట్టిన కామెంట్ బాగా హైలైట్ ఐంది. “మీరు చెప్పినట్లే.. ఒక ఎక్స్‌పెరిమెంట్ చేద్దాం. మీరు బెంగళూరును వదిలి వెళ్లండి. బెంగళూరు ఖాళీ అవుద్దో లేదో చూద్దాం. ఎంప్టీగా ఉండే బెంగళూరులో.. డాన్సర్స్ లేని పబ్స్‌లో మేం సంతోషంగా గడుపుతాం. ప్రస్తుతానికి అందరి నార్త్ ఇండియన్స్ గురించి వద్దు. మీరు ఒక్కళ్లు వదిలి వెళ్లి చూడండి.“ అని కామెంట్ చేశారు.
మీరు వెళ్తే మా ఊరికి ఏం కాదు:
“మీకు తమాషాగా అనిపిస్తోందా. మాకు మాత్రం కాదు. మీకు బెంగళూరు అవసరం ఉంది. బెంగళూరుని వదిలి మీరు వెళ్లినా మా ఊరులో పెద్దగా డిఫరెన్స్ ఏమీ ఉండదు. ఇంకా చెప్పాలంటే మీరు బెంగళూరును వదల్లేరు. ఆ విషయం మీకు కూడా తెలుసు” అని అనుపమ గౌడ కామెంట్ పెట్టారు.
“ఒక కన్నడ పౌరుడిగా, బెంగళూరు వాసిగా గర్వపడతాను. ఇప్పటి వరకూ నిజానికి ఏ ఒక్క నార్త్ ఇండియన్స్ ఫ్రెండ్స్‌తో మాకు గొడవ లేదు. ఇదంతా చూస్తుంటే కొంత మంది ఇన్‌ఫ్లూయెన్సర్స్ అండ్ పేజెస్ హిడెన్ అజెండాతో బెంగళూరుపై ద్వేషం చిమ్ముతున్నట్లు అర్థం అవుతోంది. నార్త్ వర్సెస్ బెంగళూరియన్స్ అన్నట్లు చేస్తున్నారు. వాస్తవానికి అక్కడక్కడా కొన్ని ఇన్సిడెంట్స్ జరిగి ఉండొచ్చు. అవి పట్టుకొని అందర్నీ అనడం సరికాదు. బెంగళూరు ప్రతి ఒక్కరినీ ఆహ్వానిస్తుంది” అంటూ సామాన్య పౌరులు కూడా కామెంట్లు పెట్టారు.
View this post on Instagram
ఈ దెబ్బతో దిగి వచ్చిన సదరు సుగంధ్ శర్మ.. తనకు కూడా బెంగళూరు అంటే ఎంతో ఇష్టమని.. సిలికాన్ వ్యాలీని ఎంతో ఇష్టపడుతున్నానంటూ ఓ పోస్టుపెట్టారు. ఇంకా ప్లీజ్ హేట్‌ను స్ప్రెడ్ చేయొద్దంటూ అందులో పేరొన్నారు.
Also Read: Viral News: బీఫ్ కావాలా... అయితే తిరుమల లడ్డూ తిందాం! వ్యూస్ కోసం తమిళ యూట్యూబర్ల పిచ్చి చేష్టలు