(Source: ECI/ABP News/ABP Majha)
Indigo Cute Fee : అందంగా ఉండటం నేరమా ? క్యూట్ చార్జీలు వేస్తున్న ఇండిగో ! అసలు ట్విస్ట్ ఇదే
Bengaluru : సాధారణంగా విమానం టిక్కెట్ ఎంత ఉంటుందో అందులో సగం ఇతర చార్జీలు ఉంటూంటాయి. పేరుకు టిక్కెట్ మాత్రం తక్కువ రేటే. ఇండిగో ఇంకో అడుగు ముందుకు వేసి క్యూట్ చార్జీలు విధిస్తోంది.
Indigo charging Rs 50 as cute charge : రెండు పాలప్యాకెట్లు ఉన్నాయి కదా సార్ చెరో ఒకటి తీసుకుంటే సరిపోయేదిగా ... అని అమాయకంగా పవన్ కల్యాణ్ ని అడుగుతాడు.. జల్సా సినిమాలో బ్రహ్మానందం. ఎందుకంటే.. రెండు పాల ప్యాకెట్లను కట్ చేసి.. దోసిళ్లలో సగం సగం పోస్తాడు మరి. ఈ ఐడియా అప్పుడే తెలిసినట్లుగా పవన్ కల్యాణ్ బ్రాహ్మానందాన్ని క్యూట్ అని పొగుడుతాడు.
ఇప్పుడు తమ ప్రయాణికుల్ని కూాడా ఇండిగో విమాన యాన సంస్థ క్యూట్‌గా ట్రీట్ చేస్తోంది. మీరు చాలా క్యూట్ అంటూ చార్జీలు వసూలు చేసేస్తోంది. ఒక్కో టిక్కెట్‌పై యాభై రూపాయలు వసూలు చేస్తోంది. యాభై రూపాయలు పోతే పోయాయి కానీ.. క్యూట్ గా ఉన్నారని ఇండిగో సర్టిఫికెట్ ఇస్తోందని చాలా మంది సైలెంట్ గానే ఉన్నారు కానీ.. బెంగళూరుకు చెందిన ఓ లాయర్ మాత్రం.. నేను క్యూట్ గా ఉంటానో.. ఇంకెలా ఉంటానో.. అదింతా నా ఇష్టం.. నేనెందుకు డబ్బులు కట్టాలని ఫైరయ్యారు. టిక్కెట్ తీసి సోషల్ మీడియాలో పెట్టి రచ్చ చేశారు.
Dear @IndiGo6E ,
— Shrayansh Singh (@_shrayanshsingh) August 19, 2024
1. What is this 'Cute Fee'? Do you charge users for being cute? Or do you charge because you believe that your aeroplanes are cute?
2. What is this 'User Development Fee'? How do you develop me when I travel in your aeroplane?
3. What is this 'Aviation… pic.twitter.com/i4jWvXh6UM
బెంగళూరు లాయర్ ట్వీట్ ఒక్క సారిగా వైరల్ అయింది. అందరూ రకరకాల జోకులేశారు.
@MoCA_GoI @HardeepSPuri @JM_Scindia
— K.K (@I_m_Kamil) August 19, 2024
Absolutely unfair to see that the current policies allow airlines to impose additional charges on customers at every step. Recently, when I booked a ticket for a friend, I was surprised to find that even selecting a seat came with an extra…
తమ క్యూట్ నెస్ గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతుందని తెలియగానే.. ఇండిగో కూడా స్పందించింది. క్యూట్ చార్జీలు అంటే అందంగా ఉన్నందుకు కాదని.. ఎయిర్ పోర్టులో సౌకర్యాలు కల్పిస్తున్నందని వివరణ ఇచ్చింది.
Hi, we would like to inform you that the Cute charges refer to the Common User Terminal Equipment charge. It is basically the amount that is charged for the use of metal-detecting machines, escalators, and other equipments that are being used at the airport. (1/3)
— IndiGo (@IndiGo6E) August 19, 2024
అయితే ఇలా ప్రతీ దానికి ఎప్పట్నుంచి విడివిడిగా చార్జీలు వసూలు చేస్తున్నారని నెటిజన్లు ప్రశ్నించడం ప్రారంభించారు. ఇదో అంతులేని కథ. మొత్తంగా క్యూట్ చార్జీల పేరుతో ఇండిగో చేస్తున్న చార్జీల వసూళ్లు మాత్రం వైరల్ అయ్యాయి.